పవర్ ఫుల్ ఆఫ్రికా జ్యోతిష్య శాస్త్రం మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

ఆఫ్రికాకు సంబంధించిన జ్యోతిషశాస్త్రం చాలా పురాతనమైనది. మన జ్యోతిష్యం మాదిరిగానే ఇది కూడా చాలా పవర్ ఫుల్. అప్పటి ఆఫ్రికా నాగరికతల నుంచి ఇది ఉద్భవించింది. అక్కడి తెగల వారు ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే జ్యోతిష్యం శాస్త్రాన్ని కనుగొన్నారు. అదే ఇప్పటికీ అక్కడ వాడుకలో ఉంది.

చారిత్రాత్మకంగా అనేక జ్యోతిషశాస్త్ర సంప్రదాయాలు ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువ సంప్రదాయాలను ఇప్పుడు ఉపయోగించడం లేదు. కానీ ఆఫ్రికన్ జ్యోతిష్యాన్ని మాత్రం ఇప్పటికీ అందరూ నమ్ముతున్నారు. వీరి జాతకచక్ర జ్యోతిషశాస్త్రం ఎంతో ప్రభావవంతమైనది. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన జ్యోతిషశాస్త్రంగా గుర్తింపు పొందింది. పుట్టిన నెలలను బట్టీ వీరు ఏర్పరిచిన జ్యోతిష్యాన్ని మీరూ తెలుసుకోండి.

బాబాబ్ (జనవరి 4 - ఫిబ్రవరి 3)

బాబాబ్ (జనవరి 4 - ఫిబ్రవరి 3)

ఈ తేదీల మధ్యలో పుట్టిన వారు బాబాబ్ కిందకు వస్తారు. వీరు నిజాయితీగా ఉంటారు. వీరి చాలా సున్నిత మనస్కులు. వీరు అందరితో కలవిడిగా ఉంటారు. వారి హోదాను బట్టి ప్రవర్తిస్తుంటారు. వీళ్లు ఇతరులకు ఎలాంటి హానీ చేయకూడదని భావిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులతో మంచిగా ఉండే గుణం వీరికి ఉంటుంది.

వెండి (4 ఫిబ్రవరి - 5 మార్చి)

వెండి (4 ఫిబ్రవరి - 5 మార్చి)

4 ఫిబ్రవరి - 5 మార్చి మధ్య పుట్టిన వారు వెండికిందకు వస్తారు. వీరికి తెలివి చాలా ఎక్కువగా ఉంటటుంది. అయితే కొన్ని సార్లు వీరు ఏ విషయంలోనైనా సరే ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉంటారు. వీళ్లు చాలా రెబల్ గా ఉంటారు. వారికి నచ్చని విషయంపై అవతలి వ్యక్తిని గట్టిగా ప్రశ్నిస్తారు. పోరాడుతారు. తిరుగుబాటు చేస్తారు. వీరు ఎలాంటి పరిస్థితులైనైనా అడ్డుకోగల ధైర్యం కలిగి ఉంటారు.

కుటుంబం (6 మార్చి - 4 ఏప్రిల్) 5/14

కుటుంబం (6 మార్చి - 4 ఏప్రిల్) 5/14

6 మార్చి - 4 ఏప్రిల్ మధ్య పుట్టిన వారు కుటుంబం కిందకు వస్తారు. వీరిలో జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం వీరితో సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే తెలుస్తుంది. వీళ్లు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బాగా రాణిస్తారు. వీరు వారి తోటివారికంటే ప్రతి విషయంలో కాస్త మెరుగ్గా ఉంటారు.

చుట్టు పక్కల ఉండే వారికి సేవలు (5 ఏప్రిల్ - 4 మే)

చుట్టు పక్కల ఉండే వారికి సేవలు (5 ఏప్రిల్ - 4 మే)

5 ఏప్రిల్ - 4 మే మధ్య జన్మించిన వారు దీని కిందకు వస్తారు. వీరు సమాజానికి తమవంతుగా ఏదో ఒక సాయం చేయాలని పరితపిస్తుంటారు. ప్రతి ఒక్కరితో ఈజీగా కలిసిపోతారు. వీరికి స్నేహితులు చాలామంది ఉంటారు. వీరు నిత్యం చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వీరు వాళ్ల నమ్మకస్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్లు మీ ముందు ఒక మాట మాట్లాడుతారు. తర్వాత మీ వెనుకే ఉండి వెన్నుపోటు పొడుస్తారు.

మార్కెట్ (మే 5 - జూన్ 4)

మార్కెట్ (మే 5 - జూన్ 4)

5 మే - 4 జూన్ మధ్య జన్మించిన వారు దీని కిందకు వస్తారు. వీరు శాంతియుతంగా ఉంటారు. అయితే వీరికి ఎదురై సమస్యలను అధిగమించడానికి కాస్త కోపానికి గురువుతుంటారు. భావోద్వేగంతో మాట్లాడుతారు. కానీ వీరు లోపల మాత్రం చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు.

పూర్వీకులు (5 జూన్ - 4 జూలై)

పూర్వీకులు (5 జూన్ - 4 జూలై)

5 జూన్ - 4 జూలై మధ్యలో పుట్టిన వారు దీని కిందకు వస్తారు. వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు వీరు చాలా దురుసుగా వ్యవహరిస్తుంటారు. అందరి పట్ల కోప్పడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు కాస్త ఆలోచించి జీవితంలో పయనిస్తే మేలు.

న్యాయమూర్తి (జడ్జి) (5 జూలై - ఆగష్టు 4)

న్యాయమూర్తి (జడ్జి) (5 జూలై - ఆగష్టు 4)

5 జూలై - 4 ఆగస్టు మధ్య పుట్టిన వారు దీని కిందకు వస్తారు. వీరు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. వీరు దేనికి భయపడరు. వీరు వాస్తవంలో బతుకుతారు. గాల్లో కోటలు కట్టే వ్యక్తులు కాదు. ప్రతి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

కోలా నట్ (5 ఆగస్టు - 3 సెప్టెంబరు)

కోలా నట్ (5 ఆగస్టు - 3 సెప్టెంబరు)

5 ఆగస్టు - 3 సెప్టెంబరు మధ్య జన్మించిన వారు దీని కిందకు వస్తారు. వీరు మంచి శక్తి కలిగి ఉంటారు. కానీ వీరు జీవితంలో కాస్త ఇబ్బందులుపడుతుంటారు. అప్పటికప్పడు నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులుపడుతుంటారు.

ప్రయాణికుడు (4 సెప్టెంబరు - 3 అక్టోబర్)

ప్రయాణికుడు (4 సెప్టెంబరు - 3 అక్టోబర్)

4 సెప్టెంబరు - 3 అక్టోబరు మధ్య జన్మించిన వారు దీని కిందకు వస్తారు. వీరు ఇతరులపై ఆధారపడరు. వీరు ఒంటరిగా ఉండాలనుకుంటారు. సమాజానికి దూరంగా ఉండాలనుకుంటారు. తమ గురించి ఎవరూ ఏమీ మాట్లాడుకోకూడదనుకుంటారు. అప్పుడప్పుడు మాత్రమే సమూహాల్లో కలుస్తారు.

దూరం (4 అక్టోబర్ - 3 నవంబర్)

దూరం (4 అక్టోబర్ - 3 నవంబర్)

4 అక్టోబర్ - 3 నవంబర్ మధ్య పుట్టిన వారు దీని కిందకు వస్తారు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీళ్లు అందరికీ విరుద్దంగా ఉంటారు. వాళ్లకు నచ్చిందే చేస్తారు. నచ్చకుంటే వదిలేస్తారు. వీళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టం.

చైల్డ్ ఆఫ్ ది వరల్డ్ (4 నవంబర్ - 3 డిసెంబర్)

చైల్డ్ ఆఫ్ ది వరల్డ్ (4 నవంబర్ - 3 డిసెంబర్)

4 నవంబర్ - 3 డిసెంబరు మధ్య పుట్టిన వారు దీని కిందకు వస్తారు. వీరు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఎప్పుడూ తాము జీవితంలో ఎదగాలనే తపనతో వీరు కష్టపడుతుంటారు. వీరు వృత్తిపరంగా, కానీ వ్యక్తిగతంగా కానీ చాలా కష్టాలు ఎదుర్కొంటారు. కానీ చివరకు విజయాలు సాధిస్తారు.

ది హార్వెస్ట్ అండ్ ది గ్రెనరీ (4 డిసెంబరు - 3 జనవరి)

ది హార్వెస్ట్ అండ్ ది గ్రెనరీ (4 డిసెంబరు - 3 జనవరి)

4 డిసెంబరు - 3 జనవరి మధ్య పుట్టిన వారు దీని కిందకు వస్తారు. వీరి వారి లక్ష్య సాధనకు చాలా కష్టపడతారు. వీరు జీవితంలో మొదట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తర్వాత వీరి జీవితం ఆనందమయం ఉంటుంది.

English summary

african astrology what says about you

African Astrology: One of the most accurate ways to predict your future!