అబ్బురపరిచే ఈ విషయాలు జూదంలో ఉన్నాయనే విషయం మీకు తెలుసా?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా జూదాన్ని ఇష్టపడేవారు కోట్లమంది ఉన్నారు. దీనిని ఇష్టపడేవాళ్లు మనస్సుకి ఎంతో దగ్గరగా ఈ ఆటని తీసుకుంటారు. అదే సమయంలో వారికి రక్తం కూడా ఉరకలేస్తుంది లేదా ఇష్టపడని వాళ్ళు అంటీముట్టనట్లు ఉంటారు. ఎంతో మంది ఈ జూదం ఆడటం వల్ల ఐశ్వర్యాన్ని కోల్పోయారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ధనం సంపాదించగలిగారు.

లాస్ వెగాస్ లో ఉన్నకొన్నివింత విషయాలు

కొన్ని సంవత్సరాల నుండి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, ప్రజల నుండి ఈ జూదాన్ని దూరం చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఆటను ఆడటం ద్వారా ఆనందంపొందగలము అని భావిస్తున్నారు. జూదం గురించి 10 అబ్బురపరిచే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం....

1. అత్యధిక సమయం ఆడిన జూదం ఆట ఎంతసేపు అంటే, 8 సంవత్సరాల 5 నెలల 3 రోజులు.

1. అత్యధిక సమయం ఆడిన జూదం ఆట ఎంతసేపు అంటే, 8 సంవత్సరాల 5 నెలల 3 రోజులు.

అరిజోన లో ఉన్న టూంబ్ స్టోన్ లో ఉన్న బర్డ్ కేజ్ థియేటర్ వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు. వారి ప్రకారం 1881 వ సంవత్సరంలో ఈ అత్యధిక సమయం ఆడిన ఆట చోటుచేసుకుందట. ఈ ఆటలో అప్పటి కాలంలో ఉన్న చాలా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు పాల్గొన్నారట. దీని గురించి ఇలా చెప్పడమే కానీ, ఎక్కడ కూడా ఖచ్చితమైన అధరాలు లేవు. అయినప్పటికీ జూదం ఆడేవారు మందు త్రాగడానికి కూర్చున్నప్పుడు ముఖ్యంగా ఈ కథ గురించి ఎక్కువగా ప్రస్తావించుకుంటారు.

2. జూదాన్ని

2. జూదాన్ని " దెయ్యాల ఆటగా " చాలా మంది క్రైస్తవులు భావిస్తారు, అందుకు ఒక మంచి కారణం కూడా ఉంది :

జూదం వంటి విషయాలను మతం అనేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే సహిస్తూ ఉంటుంది. జూదంలో అన్ని సంఖ్యలు కలిపితే గనుక 666 అంకె గనుక వస్తే అప్పుడు ఆ జూదాన్ని "దెయ్యాల ఆట"గా అభివర్ణిస్తారు. ఎందుకంటే బైబిల్ లో 666 అనే అంకెను దెయ్యానికి ఆపాదించారు.

3. ఇంగ్లాండ్ దేశంలో అసాధారణ పద్దతిలో వ్యవహరిస్తారు, పోలీసుల దాడుల్లో దొరికినప్పుడు :

3. ఇంగ్లాండ్ దేశంలో అసాధారణ పద్దతిలో వ్యవహరిస్తారు, పోలీసుల దాడుల్లో దొరికినప్పుడు :

ప్రపంచంలోని చాలా ప్రదేశాల్లో జూదాన్ని ఒక ఆచారంగా మాత్రమే స్వీకరించలేదు. దానిని ఒక వేడుకగా కూడా జరుపుకుంటారు. కానీ, ఇందుకు విరుద్ధంగా ఆ దేవుడు సృష్టించిన ఇదే పచ్చని భూమి పైన ఈ ప్రపంచంలో జూదాన్ని అస్సలు సహించని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇదేమి కొత్తగా వచ్చిన పద్ధతేమీ కాదు. 18 వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో ఉన్న జూదగృహాల పై పోలీసులు తరచూ దాడులు చేసేవారు. ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ జూదగృహాల నిర్వాహకులు కొంత మంది ప్రత్యేకమైన వ్యక్తులను ఏర్పాటుచేసేవారు. వీళ్ళ కర్తవ్యం ఏమిటంటే ఎప్పుడైతే పోలీసులు వస్తున్నారు అనే విషయం వీళ్లకు తెలుస్తుందో ఆ సమయంలో వీరు పాచికలను పోలిసుల కంటపడకుండా మింగేయవలసి ఉంటుంది.

4. జూదం కనిపెట్టింది గణిత శాస్త్రజ్ఞుడు :

4. జూదం కనిపెట్టింది గణిత శాస్త్రజ్ఞుడు :

జూదం లో ఎంతో గణిత శాస్త్రం దాగి ఉంది. కానీ చివరకు ఈ ఆట అదృష్టం పై మాత్రమే ఆధారపడి ఉంది. ఈ జూదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఒక వేడుకలాగా జరుపుకుంటారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జూదాన్ని కనిపెట్టింది ఫ్రెంచ్ గణితశాస్త్రజ్ఞుడు బలైజ్ పాస్కల్. పాస్కల్ కనిపెట్టింది మాములుగా అయితే ఇలా జూదం ఆడటానికి కాదు. అతనొక యంత్రాన్ని సృష్టించాలని భావించాడు దీనిని ఉపయోగించి. ఆ యంత్రానికి శాశ్వతమైన కదలిక ఉండేలా రూపొందించాలని అనుకున్నాడు.

5. ఈ ప్రపంచంలో మొదటి జాబితాను కనిపెట్టడానికి కారణం ఏమిటంటే ? - గొప్ప వినియోగదారుని సేవ :

5. ఈ ప్రపంచంలో మొదటి జాబితాను కనిపెట్టడానికి కారణం ఏమిటంటే ? - గొప్ప వినియోగదారుని సేవ :

మీకు తెలుసా ? మీరు ఏదైనా ఏదైనా ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎంతో ప్రేమతో లోపలికి ఆహ్వానిస్తాడు. కొన్ని సందర్భాల్లో అది మన కంటి నుండి ఆనంద భాష్పలు వచ్చేలా కూడా చేస్తాయి. ఇప్పుడున్న పెద్ద పెద్ద బ్రాండెడ్ దుకాణాలు మరియు షాపింగ్ మాల్స్ లో గొప్ప వినియోగదారుని సేవ అనేది చాలా మామూలు విషయం అయిపొయింది. కానీ, ఇవేవి లేకముందు 1883 లో చార్లెస్ ఫెయ్ అనే ఒక కార్ మెకానిక్ తన వ్యాపారాన్ని మరింత బాగా పెంచుకోవడానికి ఏదైనా కొత్తగా చేయాలని భావించాడు. అందులో భాగంగా తన వద్దకు వచ్చే వినియోగదారులకు తాను కార్ ని బాగుచేసే సమయంలో ఆనందాన్ని కలిగించాలనుకున్నాడు. అందులో భాగంగా ఒక యంత్రాన్ని సృష్టించాడు. అందులో మూడు తిప్పే చక్రాలున్నాయి, వాటి పై ఐదు గుర్తులున్నాయి. అవేమిటంటే హార్ట్స్, డైమండ్స్, హార్స్ షూస్, స్పేడ్స్ మరియు లిబర్టీ బెల్. ఈ భూమి పైన మొదటిసారి కనుకొన్న మొదటి జాబితా యంత్రానికి లిబర్టీ బెల్ అని పేరుపెట్టాడు.

6. ఒక నావికుడు ఒక బంగారంలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు - జూదం గురించి ఇతిహాస కథ :

6. ఒక నావికుడు ఒక బంగారంలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు - జూదం గురించి ఇతిహాస కథ :

1950 వ సంవత్సరంలో లాస్ వేగస్ నగరంలో చోటుచేసుకుంది అని చెబుతున్న జూదానికి సంబంధించిన నమ్మలేని కథ ఇది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే లాస్ వేగస్ లోని డెసర్ట్ ఇన్ అనే హోటల్ లో ఒక నావికుడు ఒకానొక రోజున 27 సార్లు ఏకధాటిగా జూదంలో గెలిచాడంట. అతడు ఎవరు అనే విషయమై ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, కోటి ఇరవైఐదు లక్షల సార్లలో ఏ ఒక్కరికో మాత్రమే ఇటువంటి గెలుపు సాధ్యమయ్యే అవకాశముంది. ఆ ఇతిహాసపు గెలుపుకి చిహ్నంగా ఆ తెలియని నావికుడు ఉపయోగించిన పాచికలు ఇంకా ఆ హోటల్ లో అలానే భద్రపరచి, వచ్చినవారికి కనపడే విధంగా ప్రదర్శించబతున్నాయి.

లైఫ్ క్రేజీగా ఉండాలంటే ఈ 25పనులు చేయాల్సిందే

7. శాస్త్రము ప్రకారం చాలా మంది జూదం ఆడేవారు మగవారేనంట :

7. శాస్త్రము ప్రకారం చాలా మంది జూదం ఆడేవారు మగవారేనంట :

జూదం ఆడవారిలో మొగవారు 84%. ఇన్లాండ్ ఎంటర్టైన్మెంట్ కార్ప్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం జూదగాలల్లో ఎక్కువ మంది మగవారేనంట. మగవారి జన్యువుల్లోనే జూదం వైపు ఆకర్షితులయ్యేలా ఏమైనా ఉందా అనే అనుమానాన్ని కూడా చాలా మంది వ్యక్తపరచడం జరిగింది.

8. శక్తివంతమైన మెదడు కలిగిన అరిస్టాటిల్ జూదం లో మోసాన్ని ఎలా చేయాలో కనుగొన్నాడు :

8. శక్తివంతమైన మెదడు కలిగిన అరిస్టాటిల్ జూదం లో మోసాన్ని ఎలా చేయాలో కనుగొన్నాడు :

ప్రపంచంలోనే ప్రసిద్ధిచెందిన గొప్ప తత్వవేత్తలలో అరిస్టాటిల్ కూడా ఒకరు. విద్యాదృష్టిలో భాగంగా అరిస్టాటిల్ కి జూదంలో ఉండే విధానం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి విపరీతమైన ఆసక్తి ఉండేది. దీనినంతా విశ్లేషించి ఒక పెద్ద పుస్తకమే రాసాడు. ఆ పుస్తకంలో పాచికల్లో ఉన్న అవకతవకలు ప్రస్తావించాడు మరియు జూదంలో ఎలా మోసం చేయవచ్చో వివరించాడు. అరిస్టాటిల్ తాను రాసిన పుస్తకం ద్వారా గణిత శాస్త్రానికి సంబంధించిన నిరూపణ ఎదో చేయదలుచుకున్నాడు. సంభావ్యత ఎప్పుడు గాని మరీ ఎక్కువ ఊహించలేనంత విధంగా ఉండదని చెప్పదలుచుకున్నాడు.

9. ప్రపంచంలోనే మొదటి జూదగృహం 17 వ శతాబ్దం లో కెసనోవా నిర్మించాడు :

9. ప్రపంచంలోనే మొదటి జూదగృహం 17 వ శతాబ్దం లో కెసనోవా నిర్మించాడు :

ఎవరైతే జూదాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ జూద గృహాలకు తరచూ వెళుతుంటారో వాళ్ళు దాని యొక్క చరిత్ర గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ప్రపంచంలో మొట్టమొదటి జూదగృహం ఇటలీ లోని వెనిస్ నగరంలో 1638 వ సంవత్సరంలో తెరవబడింది. దీనిని కెసనోవా అనే వ్యక్తి నిర్మించాడు. కొన్ని ఏవైనా అబ్బురపరిచే పనులు చేయడం కోసం.

10 . నెపోలియన్ బోనాపార్టే కు అత్యంత ఇష్టమైన ఆట :

10 . నెపోలియన్ బోనాపార్టే కు అత్యంత ఇష్టమైన ఆట :

తన అద్భుతమైన చాతుర్యం మరియు అమోఘపరిచే తెలివితో పాటు అకుంఠిత దీక్షతో పశ్చిమ ప్రపంచంలో గొప్ప విజేతగా నిలిచాడు నెపోలియన్ బోనాపార్టే. ఇతడికి అదృష్టంతో ఆడే ఈ ఆట అంటే ఎంతో మక్కువ. అయితే ఈ గొప్ప చక్రవర్తికి ఈ ఆటను విభిన్న రకాలుగా ఆడే అలవాటు ఉంది. అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆట బ్లాక్ జాక్. అయితే, బోనాపార్టే ఎప్పుడు కానీ తాను బ్లాక్ జాక్ ఆడేవాడినని ఒప్పుకోలేదు. ఈ ఆటను ' 21 ' అని కూడా పిలుస్తారు.

English summary

Amazing Facts About Gambling That Will Surprise You

Amazing Facts About Gambling That Will Surprise You. Read to know more about..
Story first published: Friday, October 13, 2017, 20:00 [IST]
Subscribe Newsletter