Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మిమ్మల్ని షాక్ కి గురిచేసే ప్రపంచవ్యాప్త కొన్ని సంప్రదాయాలు!
పిల్లలు చాలా అధ్బుతమైన మానవ రూపాలు.వాళ్ళు రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే అది కొత్త తల్లిదండ్రులని ఆశ్చర్యపరుస్తూ వాళ్ళ మొహం మీద చిన్న నవ్వును తెప్పిస్తుంది.పిల్లలని అత్యంత ప్రేమ ఇంకా జాగ్రత్తతో చూడాలి
ప్రపంచంలో వివిధ రకాల సంస్కృతులున్నాయి మరియు కొన్ని సంస్కృతులు చాలా విచిత్రమైనవి,వింతైనవి. వారు అనుసరించే పద్ధతులు వింటే మీరు విభ్రాంతిలో ఉండిపోతారు కానీ ఇవి అక్కడి స్థానికులు రెగ్యులర్ గా అనుసరించే సంప్రదాయాలు.
బహిరంగ ప్రదేశాలలో మూత్రం నుంచి రేపిస్టులకి ఏ నియమాలు లేకపోవటం వరకు అన్ని రకాల విచిత్ర విషయాలు మీ కళ్ళముందుకి రావచ్చు.
ఈ వ్యాసంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్కృతుల వారు పాటిస్తున్న కొన్ని సంప్రదాయాల లిస్టును పొందుపరిచాం.
చదవండి, మనం ఉంటున్న ప్రపంచం ఎంత వింతైనదో!

గోమూత్రం పవిత్రమైనది!
భారతదేశంలో చాలామంది గోమూత్రాన్ని ప్రత్యేకంగా, పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా హిందూమత విశ్వాసం ప్రకారం అందులో ప్రత్యేక హార్మోన్లు, ఖనిజలవణాలు లాభదాయకమైనవి ఉంతాయి. కొంతమంది దాన్ని తాగుతారు కూడా!

అక్కడకి ప్రయాణించడం మీ సొంత పూచీకత్తు!
ఫిలిప్పీన్స్ లో, బస్సులో ప్రయాణించడం ఒక ఛాలెంజయి పోయింది. బస్సులన్నీ తేనెతుట్టల్లా నిండిపోతున్నాయి. సీటు లేని ప్రయాణికులందరూ తమ సొంత ప్లాస్టిక్ కుర్చీలలో ఖాళీప్రదేశంలో కూర్చుండిపోవడం చాలా సాధారణ విషయం. అప్పుడు కూడా కూర్చోటానికి స్థలం లేకపోతే బస్సు పైకి కూడా ఎక్కిస్తున్నారు!
గతంలో అబార్షన్ చేయడానికి అనుసరించిన దారుణ పద్దత్

మలమూత్రాలకి వెళ్ళడం చాలా సాధారణం!
మనదేశంలో ఇది చూడటం కొత్తేమీ కాదు, కానీ చైనాలో నివసించేవారు కూడా ఇలానే చేస్తారని తెలుసా? మీరు తరచుగా అక్కడ స్త్రీలు తమ పిల్లలను మలమూత్రాలకి బయటకి తీసుకెళ్ళటం చూడవచ్చు.

కోస్టారికాకి చిరునామా లేదు!
నిజం! కోస్టారికాలో చిరునామాలు ఉండవు మరియు అక్కడి ప్రజలు స్థలాల గుర్తులతో ప్రయాణిస్తుంటారు. ఆ ప్రదేశం మొత్తంలోనే ఇల్లు లేదా ఆఫీసులకి చిరునామాలు ఉండవంటే నమ్ముతారా? మరి తాగేసిన తర్వాత ఇళ్ళకి ఎలా వెళ్తారో! ఏదిఏమైనా ఇక్కడి ప్రజలకి చిరునామాలు వాడటమైతే రాదు.

అన్నివైపులా సగం కట్టిన ఇళ్ళు ఉండే సమయంలో!
బెలిజెలో విచిత్రమైన విషయం అన్ని ఇళ్ళు సగం మాత్రమే కట్టబడి ఉంటాయి. ఇక్కడ కావాలనే ఇళ్ళు పూర్తిచేయరట. ప్రభుత్వ రూలు ప్రకారం ఇంటి పన్ను కట్టాల్సి వస్తుందని, అదే ఇల్లే పూర్తిగా కట్టకపోతే పన్ను కట్టనవసరం లేదు.

మధ్యధరా దేశాలలో మగవారు చేతుల్లో చేయి వేసుకుని నడవడం సాధారణం!
మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతంలో పురుషులు ఒకరి చేతుల్లో మరొకరు చేతులు వేసుకుని నడుస్తారంటే నమ్మగలరా? ఇది సాధారణ విషయమే, ముఖ్యంగా లైంగికంగా స్ట్రయిట్ గా ఉన్న మగవారికి.దీన్ని రొమాంటిక్ బంధంగా కన్నా దగ్గరి స్నేహంగా భావిస్తారు.

ఇతరులు రాసినది కాపీ కొట్టడం ఇక్కడ చాలా మంచి విషయం!
ఇది అస్సలు నమ్మగలరా! ఫిలిప్పీన్స్ లో విద్యార్థులకి అనుమతి ఉంది, ఇంకా వారు తన సీనియర్ థీసిస్ పేపర్లను రాసిపెట్టడానికి డబ్బులిచ్చి కొంతమందిని నియమించుకోవచ్చు కూడా! ఇది స్థానికులకు రెగ్యులర్ గా జరిగే వ్యాపారం. ఇక్కడ చదివే విద్యార్థినీ విద్యార్థులు ఒకసారైనా ఇతరులు రాసినది కాపీ కొట్టే ఉంటారు!
ఇలాంటి ప్రపంచ వింతైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలని ఉందా? కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాటించే మూఢనమ్మకాలు



Click it and Unblock the Notifications