Latest Updates
-
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.? -
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా..
ప్రేత వివాహ సంప్రదాయం! ఇక్కడ వయసుకొచ్చి చనిపోయిన పిల్లలకు పెళ్ళి చేస్తారు
"ప్రేత కళ్యాణం" అనే ఆచారం ఈ శతాబ్దంలో కూడా నేటికీ కొనసాగుబడుతున్నది. ఈ ఆచారంలో 18 ఏళ్ల వయస్సులోపు చనిపోయిన పిల్లలకు, అనగా వధువు మరియు వరుడికి వివాహం చేస్తారు.
మన యొక్క మానసిక ఆరోగ్యమును ప్రశ్నించేలా,
మనకు అనేక ఆచారాలు ఉన్నాయి. ఒక మహిళకు కుక్కలు (లేదా) కప్పులతో వివాహం చేసేటటువంటి నమ్మకాలను కలిగి ఉన్నప్పుడు, ఇలాంటి ఆచారాలు వలన ఉనికిలోకి వచ్చాయి అని మనము ఆశ్చర్యపోతున్నాము !
బాబాలు, గురూజీలు, మరియు మునులు వంటి వారు - ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు చాలా వింతైన పరిష్కారాలను అందిస్తారు.
"ప్రేత కళ్యాణం" అనే ఆచారం ఈ శతాబ్దంలో కూడా నేటికీ కొనసాగుబడుతున్నది. ఈ ఆచారంలో 18 ఏళ్ల వయస్సులోపు చనిపోయిన పిల్లలకు, అనగా వధువు మరియు వరుడికి వివాహం చేస్తారు.
అలా 18 సంవత్సరాలలోపు చనిపోయిన పిల్లలకు వివాహం చేసేటటువంటి ఈ వింతైన ఆచారము గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం రండి !

ఈ ఆచారం చనిపోయిన పిల్లల యొక్క కుటుంబాల మధ్య జరుగుతుంది :
ఆచరణాత్మక పద్ధతి ప్రకారం, 18 సంవత్సరాల ప్రాయంలోనే చనిపోయిన పిల్లల యొక్క కుటుంబాలు - అదే విధంగా పిల్లలను పోగొట్టుకున్న వేరొక కుటుంబాలతో కలిసి ఈ వింతైన ఆచారాన్ని కొనసాగించడం జరుగుతుంది.

చనిపోయిన పిల్లల యొక్క ఇరువురి జాతకాలు కలవాలి :
చనిపోయిన పిల్లల యొక్క జాతకాలను సిద్ధం చేసి వాటిని ఒకదానితో మరొకదానిని సరిపోల్చుతారు. అలా కలిసిన తర్వాత, ఈ రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని జరిపించేందుకు అనుమతినిస్తాయి. ఈ విధమైన ఆచారం లో కొన్ని బొమ్మలను ఉపయోగించబడతాయి. ఈ బొమ్మలు చనిపోయిన పిల్లలకు ప్రతీక అని వర్ణిస్తారు.

సరైన పద్ధతిలో ఈ వివాహం జరుగుతుంది :
నిజమైన పెళ్లి మాదిరిగానే, ఈ ఆచారంలో కూడా అచ్చం అలాంటి పెళ్ళిల్లే జరుగుతాయి. మంగళసూత్రమును 'అమ్మాయి బొమ్మ' మెడకు చుట్టబడి, దండలు కూడా మార్పిడి చెయ్యబడతాయి. ఈ పెళ్లి వేడుక, ఒక అరటి ఆకు మీద కేరళ భోజనంతో చివరిగా ముగుస్తుంది.

ఈ ప్రయోగాత్మకమైన ఆచారం ఎలా ఉనికిలోకి వచ్చింది ?
ఈ ఆచారం యొక్క మూలాల ప్రకారం, గర్భస్రావము అనగా కడుపులోని పిండము యొక్క ఎదుగుదల నిలిచిపోవడం వల్ల (లేదా) ఒక పిల్లవాడు త్వరగా చనిపోయినట్లయితే, ఈ ఆచారం అనేది ఆచరణలోనికి వస్తుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ కుటుంబంలో ఎదురయ్యే పరిణామాల వల్ల, వారి జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు (లేదా) ఆ కుటుంబంలోని ఇతర పిల్లలకు ఎదురయ్యే ఇతర సమస్యల పరిష్కారానికిగాను - ఇంతకుముందు చనిపోయిన బిడ్డకు వివాహం చేయడమే ఉత్తమమైన మార్గమని అక్కడ జ్యోతిష్యులు వారికి సలహాను ఇచ్చి, సహాయం చేస్తారు.

అందువల్లే, ఈ ప్రయోగం మొదలైంది :
మరణించిన పిల్లలు యొక్క కుటుంబాలు, వారి పిల్లల వివాహాన్ని నిర్వహిస్తాయి, ఎందుకంటే వారు ఈ ప్రపంచంలోని ఆనందాలను అనుభవించక ముందే భూమిని విడిచిపెట్టారు కాబట్టి. అందువల్ల, ఈ దెయ్యం వివాహాన్ని పూర్తి చేయడం ద్వారా, వారి యొక్క పిల్లల ఆత్మకు శాంతి చేకూరి, స్వర్గానికి వెళ్తారని ఆ కుటుంబం భావిస్తుంది.

ఈ ఆచారాన్ని ఆ కుటుంబీకులు నమ్ముతారు :
చాలా కుటుంబాలు వారి పిల్లలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో మునిగిపోతాయి. కాబట్టి, అలా వారి జీవితాలను పోగొట్టుకున్న పిల్లల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులు కోరుకుంటూ ఉన్నారు. ఈ కారణం చేతనే ఈ ఆచారం నేటికీ ఆచరణలో ఉంది.
ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోగలరు !



Click it and Unblock the Notifications