For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలేచిన ఫస్ట్ వన్ అవర్ లో మీరు చేయాల్సిన పనులు..!!

By Lekhaka
|

ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజూ ఉదయం చేసే ఐదు పనుల గురించి మీకు తెలుసా? ఈ పనులు రోజు మొత్తంలోని పనులను సమగ్రంగా చేయడానికి సహాయపడుతుంది.

రోజులోని మొదటి గంట చాలా కీలకం, ఇది మిగిలిన రోజుమొత్తంలో మన ఆలోచనా విధానాన్ని పెంపొందించి, పనిచేసే సామర్ధ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు నిరూపించాయి.

ఇది కూడా చదవండి: కొన్ని చాలా కొత్త ఆలోచనలు కాగితం మీద ఉండవు

అయితే, ఈ విషయాలను మొదటి గంటలోనే ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం, ఇక్కడ మీరు విజయం సాధించాలి అనుకుంటే రోజులోని మొదటి గంటలో చేయాల్సిన 5 ముఖ్యమైన పనుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. రోజు ప్రారంభంలో చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి ఎక్కువ గమనించండి.

ఇది కూడా చదవండి: సోమవారాన్ని మీకు ఇష్టమైన రోజుగా చేసుకోవడం ఎలా!

నిద్రలేచిన ఫస్ట్ వన్ అవర్ లో మీరు చేయాల్సిన పనులు

సాంకేతిక పరమైన పనులను చేయకండి!
ఉదయానే మీ ఫోన్ ని పరీక్షించడంతో రోజును ప్రారంభించకండి. ఇది అందరూ చేసే అత్యంత సాధారణమైన తప్పు. ఉదయం లేవగానే ఫోన్ ను చెక్ చేసుకోవడం అనేది మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధ్యయనాలు నిరూపించాయి, ముందురోజు జరిగిన విషయాలు మీ తలకు భారమయ్యాయని అనుకోవచ్చు. అందువల్ల, ఉదయానే ఫోన్ చెక్ చేసుకోవడం మానేయండి.

నిద్రలేచిన ఫస్ట్ వన్ అవర్ లో మీరు చేయాల్సిన పనులు

మీకుమీరే ఫ్రెష్ గా ఉండండి
వ్యక్తిగత పరిశుభ్రత తాజాదనాన్ని, ఆశావాద స్పూర్తిని ఇస్తుంది. జీర్ణశక్తి సరిగా పనిచేయడానికి ఒక చిన్న గ్లాసు నీటిని తాగండి. ముందురోజు రాత్రి మీరు లోనయిన డి హైడ్రేషన్ నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడికి గురిచేసే లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందువల్ల, మీరు ప్రతిరోజూ ఉదయం తప్పకుండా ఈ పని చేయండి.

నిద్రలేచిన ఫస్ట్ వన్ అవర్ లో మీరు చేయాల్సిన పనులు

కొద్దిపాటి వ్యాయామం, స్ట్రెచ్ లు చేయండి
ఒకే స్థానంలో శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల శరీరంలో గట్టితనం మెరుగుపడుతుంది. వ్యాయామం రక్తప్రసరణను మెరుగుపరిచి, వత్తిడిని తగ్గిస్తుంది, అంతేకాకుండా ఏదైనా పనిచేయాల్సి వచ్చినపుడు శరీరం తేలికగా కదలడానికి సహాయపడుతుంది. అయితే, ఉదయానే ఇలా చేయడం చాలా ముఖ్యం.

నిద్రలేచిన ఫస్ట్ వన్ అవర్ లో మీరు చేయాల్సిన పనులు

మీ పనులను చేసుకుని, మంచాన్ని ఏర్పాటు చేసుకోండి
ఈ పనులు చేయడం వల్ల ఉదయం సమయంలో వత్తిడి దూరమయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి విజయవంతమైన రోజు తరువాత అలసిపోయిన వాతావరణం నుండి ఇంతకంటే మంచి భావన ఇంకోటి ఉండదు.

నిద్రలేచిన ఫస్ట్ వన్ అవర్ లో మీరు చేయాల్సిన పనులు

అనుకోని & ముందే మీ రోజుని ప్రణాళిక చేసుకోండి
మీకుమీరే కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి. వాటి గురించి అలోచించి, వాటిని ఎలా చేయాలో ప్రణాళిక వేసుకోండి. అవసరమైతే, మీ వారం ప్రణాళికలో ఉన్న కొన్ని విషయాలను జోడించి లేదా మీ మనసులో 'చేయవలసిన పనులు' ఏమైనా ఉంటే వాటిని జతచేయండి. ఇవి మీరు మీ పనులను ఎంతో సామర్ధ్యంతో, ఆలోచనతో మంచి దారిలో చేయడానికి సహాయపడతాయి!

English summary

Do These Things In The First Hour Of Your Day

Do these things in the first hour of your day, as it helps in organising yourself for the entire day. Find out what they are!
Desktop Bottom Promotion