For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  13వ నెంబర్ అన్ లక్కీ నెంబర్ ఎందుకనీ, 13 నెంబర్ అంటే ఎందుక భయపడుతారు?

  |

  3 సంఖ్య అంటే భయం ప్రపంచమంతా ఉంది. ఉత్తర భారతదేశంలో 13 అంటే వణికిపోతారు. నంబర్ 13 ఎందుకు దురదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?కొందరికి కొన్ని విషయాలపట్ల మూఢ నమ్మకాలు ఎక్కువ. అలాంటి వాటిల్లో 13వ సంఖ్య, శుక్రవారం ముఖ్యమైనవి. ఇక ఈ రెండూ కలిసి వస్తే.. ఏదో కీడు జరుగుతుందని కొందరు భయపడతారు. అందుకే 13వ తేదీ శుక్రవారం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో సంగతేమంటే ఈ ఏడాది 13వ తేదీ శుక్రవారం అక్టోబర్ నెలలో మాత్రమే వస్తుంది. అది కూడా ఈరోజే కావడం విశేషం.

  సాధరణంగా చాలా మంది 13వ సంఖ్యను ఇష్టపడరు. ఈ నెంబర్ ఉన్న రూమ్స్ , అపార్ట మెంట్స్‌, వాహనాలకు దూరంగా ఉంటారు. ఇక 13, శుక్రవారం కలిసి వస్తే ఆ రోజు పెళ్ళు, శుభకార్యాలు జరుపుకునేందుకు వెనుకాడతారు. అయితే సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రం 13 సంఖ్య, శుక్రవారం బాగా కలిసివస్తుందని గట్టి నమ్మకం. అందుకే శుక్రవారం రోజునే సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా శుక్రవారం నాడే విడుదల కావడం విశేషం.

  ప్రతి ఒక్కరూ వారి జెర్సీ వెనుక వ్రాయబడిన 13 వ సంఖ్య నుండి తప్పించుకునేందుకు ఇష్టపడతారు. వారు 11, 12, 14 లేదా 15 వంటి సంఖ్యలను వాడటానికి ఆసక్తిని కలిగి ఉంటారు, కానీ 13 వారి కలలో కూడా ఎన్నటికీ ఎంపిక చేసుకోరూ.

  13 శుక్రవారం అన్ లక్కీ డే : '13' వ తేదీ శుక్రవారం(నేడు) మీరు చేయవలసినవి..

  ఈ సంఖ్యతో కొంతమంది చాలా భయపడ్డారు, వారు 13వ సంఖ్యగా వచ్చే స్థలంలో (లేదా) వరుసలో కూర్చోవడాన్ని కూడా తిరస్కరించారు.

  13 వ సంఖ్య ఎందుకు చెడుకు సంబంధించినదిగా ఆలోచిస్తారు ? బాగా, ఈ పురాణం వెనుక గల కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వాటిని చూద్దాం.

  1. చివరి భోజనము (లాస్ట్ సప్పర్) :

  1. చివరి భోజనము (లాస్ట్ సప్పర్) :

  ఇది జుడాస్ ఇస్కారియట్ చెప్పిన దాని ప్రకారం - యేసును మోసం చేసిన వ్యక్తి, భోజనం వరుసలో 13 వ వ్యక్తి. యేసు చివరి భోజనంలో కేవలం 12 శిష్యులు ఉన్నారు కానీ నిర్ణయాత్మక సమయం లో అది 13 కి పెరిగింది. యేసు మోసగించబడినప్పుడు ఆ సమయమే ఆయనని శిలువకు వెయ్యడానికి దారితీసింది.

  2. ఉరి ( గల్లోస్) :

  2. ఉరి ( గల్లోస్) :

  ఒక వ్యక్తిని ఉరి వేయబడిన చోటు ఇది. ఉరికి దగ్గర అయ్యేందుకు ఒక వ్యక్తిని నడిపించే 13 దశలు ఉన్నాయని అంతా నమ్ముతున్నారు, అతను తన జీవిత చివరి శ్వాసను తీసుకునే ప్రదేశంగా ఉరి కంభంగా అందరూ విశ్వసించారు.

  3. కోవెన్స్ :

  3. కోవెన్స్ :

  ఒక కోవెన్స్ అనేది ఎల్లప్పుడూ పదమూడు మంది ఉన్న మంత్రగత్తెల సమూహంగా సూచిస్తుంది. ఈ భావనతో సంబంధం ఉన్నందున 13 మంది సభ్యులతో కూడిన ఈ సమూహంను తరచూ ఒక కోవెన్స్ వలె పిలచే దురదృష్టకరమైన సంఖ్యగా భావిస్తారు.

  4. 12 - పరిపూర్ణమైనది :

  4. 12 - పరిపూర్ణమైనది :

  మనకు 12 నెలలు, గడియారంలో 12 గంటలు మరియు 12 రాశిచక్రాలు కూడా ఉన్నాయి అందుకే ప్రపంచంలోని 12 అనేది ఆదర్శమైన సంఖ్య అని చెప్పబడింది. మనకు గడియారంలో 13-గంటలు, 13 నెలలు మరియు 13 రాశిచక్ర సంకేతాలు కలిగి ఉండనందున; లేదంటే ఈ సంఖ్య మీ విధిని నాశనం చేయగలదు.

  5. అన్ని చెడ్డ పేర్లు 13 అక్షరాలతో అనుబంధించబడ్డాయి :

  5. అన్ని చెడ్డ పేర్లు 13 అక్షరాలతో అనుబంధించబడ్డాయి :

  జాక్ రిప్పర్, జెఫ్రే డహ్మెర్, థియోడోర్ బుండి లేదా చార్లెస్ మాన్సన్, చరిత్రలో ఉన్న అన్ని చెడు పేర్లు వారి పేరులో 13 అక్షరాలు కలిగి ఉన్నాయి. ఇది కేవలం యాదృచ్చికం లేదా అదృష్టమా?

  6. అపోలో-13 :

  6. అపోలో-13 :

  అపోలో 13 మాత్రమే విజయవంతం కాని మూన్ మిషన్, ఇది దాని ట్యాగ్లో 13 సంఖ్యకు దురదృష్టంగా ఉందని నమ్ముతారు. ఆమ్లజని సిలిండర్ పేలింది, దాని వల్ల వ్యోమగాముల మనుగడ అంతరిక్షంలో చాలా కష్టంతరంగా మారింది అయితే, వారు సురక్షితంగా తిరిగి భూమి మీదకు వచ్చారు.

  7. భారీ నష్టము :

  7. భారీ నష్టము :

  చరిత్ర ప్రకారం, సెప్టెంబర్ 13, 1940 సంవత్సరంలో నాజీలు బకింగ్హామ్ ప్యాలెస్పై బాంబు దాడి చేశారు. ఆ రాజరిక కుటుంబం తేయాకును తీసుకుంటున్న సమయంలో, వెంటనే ఈ నష్టాన్ని ఎదుర్కొంది.

  8. యేసు 13 సంఖ్య రోజున సిలువ వేయబడ్డారు :

  8. యేసు 13 సంఖ్య రోజున సిలువ వేయబడ్డారు :

  చాలామంది క్రైస్తవులు యేసును శుక్రవారం చంపబడ్డాడని నమ్ముతారు, మరియు ఆరోజు 13 వ తేదీగా ఉన్నది. ఈ తేదీ శుక్రవారం, ఏప్రిల్ 13, 33 A.D గా ఉన్నది.

  9. పిల్లల 13 వయస్సు కలవారిగా ఉంటే :

  9. పిల్లల 13 వయస్సు కలవారిగా ఉంటే :

  పిల్లలు అధికారికంగా పదమూడు సంవత్సరాల వయస్సులోనే యుక్తవయసులోకి వస్తారు, ఇది భయానక దశ అని నమ్ముతారు. ఈ యవ్వన కాలం ఎంత భయానకంగా ఉంటుందో మనకు తెలుసు కదా !

  10. విమానము కుప్పకూలిన సంఘటన :

  10. విమానము కుప్పకూలిన సంఘటన :

  ఉరుగ్వేయన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ 571, ఆండెస్ ప్రాంతంలో ప్రేలి ఆ విమానం కుప్పకూలినప్పుడు, 13 మంది మరణించారు, ఈ కారణంగా మొత్తం 29 మంది మరణించారు. అలాగే, సోవియట్ ఏరోఫ్లోట్ ఒక సదస్సులో విమానం క్రాష్ అయినప్పుడు 174 మంది మరణించారు, ఇది రన్ వే నుండి కేవలం కిలోమీటరు దూరంలో మాత్రమే ఉన్నది.

  English summary

  Ever Wondered Why Is 13 Number Unlucky?

  Do you really think that number 13 is unlucky? If not, then find out the reasons for which people have labelled it as an unlucky day
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more