చదువు లేకున్నా మేధావులే! పరీక్షల్లో పెయిల్ అయినా..జీవితంలో సక్సెస్ అయ్యారు!

By Lekhaka
Subscribe to Boldsky

వైఫల్యం అనేది విజయానికి తొలి మెట్టుగా పరిగణించబడుతుంది. అది చాలా మంది లెంజెండ్స్ ద్వారా అనేక సార్లు నిరూపించబడింది.

ఒక వక్తి విజయం పొందటానికి కేవలం విద్యావంతుడై ఉండవలసిన అవసరం లేదు. ఇతర రంగాలలో వారికి టాలెంట్ ఉంటే చాలు జీవితంలో విజయాన్ని పొందుతారు.

నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

ఇక్కడ కొంతమంది భారతీయులు చదువు పరంగా గొప్ప ర్యాంకర్లు కాకపోయినా, వారికి సంబంధించిన రంగాలలో తమకంటూ సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొంది విజయాన్ని తమ కైవసం చేసుకున్నారు. వాళ్లెవరో మేరే చూడండి...

పి. సి. ముస్తఫా

పి. సి. ముస్తఫా

ఇతను కేరళలోని ఒక మారుమూల గ్రామంలో నిరక్షరాస్యులైన కుటుంబంలో పెరిగాడు. అతను తన 6 వ తరగతి పరీక్షల్లో తప్పాడు అయినప్పటికీ, అతడు వ్యవసాయం చేసుకుంటూ ఎలాగైనా తాను ఇంకొకసారి ప్రయత్నించి ఉతీర్ణుడు కావాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాల మరియు కళాశాల (కాలికట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ద్వారా తన చదువుని పూర్తిచేసుకున్నాడు. అతను ప్రస్తుతం ఆహారాన్ని విక్రయించే ఐడి స్పెషల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫ్యాక్టరీ లో 62 కోట్ల విలువైన బ్రాండ్ను నడుపుతున్నాడు.

Image Source

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

ప్రముఖ జాతీయ అవార్డుని సొంతం చేసుకున్న ఈ నటుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతులైన నటులలో ఒకరు. అతను చిన్న పిల్లవాడిగా ఉన్నపుడు, పాఠశాలలో ఒక పరీక్షలో విఫలమయ్యాడు మరియు తన తల్లిదండ్రులకు తన రిపోర్ట్ ని చూపించడానికి భయపడ్డాడు. కానీ అతను అక్కడితో కోప్పడి మౌనం వహించడానికి బదులుగా,అతని వైఫల్యాలను ఆధారంగా చేసుకొని తన కలలను నెరవేర్చుకున్నాడు.

వీర్ దాస్

వీర్ దాస్

భారతదేశంలోని అత్యంత విజయవంతులైన హాస్యనటులలో ఈయన ఒకరు, నెట్ఫ్లిక్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. తాను చిన్నపిల్లాడిగా వున్నపుడు అతను తన బోర్డు పరీక్షలలో అతి తక్కువ స్కోర్లను పొందిన దిగువ-సగటు విద్యార్ధి. ఒక సోషల్ సైట్లో,అతని పరంగా విజయం గురించి ఇలా చెప్పాడు.

"మీ ఫలితాలు అద్భుతమైనా లేదా కాకపోయినా, మీ జీవితాన్ని అద్భుతమైనదిగా మార్చుకోవడం లో ఎవరు అడ్డుకోలేరు. మీ జీవితంలోని ప్రతి ఒక్కరోజు చివరిలో, మీరు ఎవరన్నది గుర్తించుకోవాలి. ఎలా చేశారన్నది కాదు."

సందీప్ మహేశ్వరి

సందీప్ మహేశ్వరి

ఇతను భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యవస్థాపకులలో ఒకరు. తాను టీన్ గా ఉన్నప్పుడు కళాశాలనుండి డ్రాప్ అవుట్ అయ్యాడు, అతను తను సొంతంగా ఎదో ఒకటి చేయాలనుకున్నాడు. ప్రస్తుతం, అతను "ఇమేజెస్ బజార్" యొక్క స్థాపకుడు, ఇది భారతీయ స్టాక్ చిత్రాల అతిపెద్ద సేకరణగా ఆన్లైన్లో రాణిస్తోంది.

బిస్వా కల్యాణ్ రథ్

బిస్వా కల్యాణ్ రథ్

ఇతను యూట్యూబ్ లో భారతదేశం యొక్క ఎక్కువ వైరల్ వీడియోల యొక్క సృష్టికర్త. దేశంలో అందరూ ఇష్టపడే హాస్యనటులలో ఈయన ఒకరు. అతను తన ఫేస్బుక్ పోస్ట్ లో ఒక సగటు స్థాయి విద్యార్ధిగా తనను తాను వర్ణించాడు మరియు తన పరిస్థితి అతడి మీద ఎంతవరకు ప్రభావితం చేసిందో, దానివలన అతి తక్కువ సమయంలోనే సుమారు 8 కిలోలను బరువుని కోల్పోయాడని చెప్పాడు. అయితే, అదృష్టవశాత్తు, అతను తిరిగి మాములయ్యాడు లెండి మరియు ఈ రోజు అతన్ని అంత గొప్పవాడిలా చేసింది!

కైలాష్ కట్కర్

కైలాష్ కట్కర్

తన కుటుంబ పరిస్థితి వలన 10 వ తరగతి తరువాత అతను నిష్క్రమించాల్సి వచ్చింది. అతనికి గాడ్జెట్లలో మంచి నైపుణ్యం ఉండటంతో, అతను ఒక చిన్న రేడియోలో మరియు కాలిక్యులేటర్ సర్కింగ్ చేసే దుకాణంలో పని చేశాడు. కొంతకాలం తర్వాత, అతను కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి మరియు నేర్చుకోవడానికి కంప్యూటర్ కోర్సులు ప్రారంభించాడు, ఆ తరువాత అతడు ఆసక్తికరమైన కంప్యూటర్ సేవల వ్యాపారాన్ని ప్రారంభించాడు, ఇది అతనికి ₹ 200 కోట్లు + వరకు తెచ్చిపెట్టింది. మరియు తన కంపెనీ పేరు హీల్ టెక్నాలజీ, ఇది ఆంటీ వైరస్ సాఫ్ట్వేర్ గా వ్యవహరిస్తోంది! మాట్లాడటానికి పేరు సరిపోతుందని అనుకోండి!

ప్రేమ్ గణపతి

ప్రేమ్ గణపతి

ఇతను భారతీయ వ్యవస్థాపకుడు మరియు వ్యాపారవేత్త. అతను దోసా ప్లాజాగా పిలవబడే అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్ ని చెన్నైలో స్థాపించాడు. స్పష్టంగా,అతడు తన 10 వ తరగతి పూర్తిచేసిన తరువాత సొంతంగా ఎదో ఒకటి చేయాలనుకున్నాడు.అతని వ్యాపారం న్యూయార్క్, ఒమన్ మరియు యుఎఇతో సహా ప్రపంచ వ్యాప్తంగా దోసా ప్లాజా ప్రసిద్ధి చెందింది!

వైఫల్యం అనేది విజయానికి తొలి మెట్టుగా పరిగణించబడుతుంది మరియు అది చాల మంది లెంజెండ్స్ ద్వారా అనేక సార్లు నిరూపించబడింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Failure is the Stepping Stone to Success; And Look at These Nine Living Examples!

    Failure is considered to be a stepping stone for success and this has been proven many times by various legends.One does not have to be academically brilliant to become successful. They can become successful by excelling in other fields of life as well! These are some of the successful Indians who have excell
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more