ఐదేళ్ల చిన్నారికి బెస్ట్ ఫ్రెండ్ తో పెళ్లి, తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది, ఎందుకంటే?

Posted By:
Subscribe to Boldsky

భయానకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఐదేళ్ల చిన్నారిని నీ చివరి కోరిక ఏంటని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. నేను పెళ్లి చేసుకోవాలని చిన్నారి చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెళ్లి కుమారుడిని కూడా ఐదేళ్ల చిన్నారి ముందుగానే చూసుకుంది. పిల్లలను ఏమి కావాలి అని అడిగితే అందరిలాగే చాక్లెట్లు, ఆడుకోవడానికి బొమ్మలు అడుగుతారని చిన్నారి తల్లిదండ్రులు అనుకున్నారు.

ఐదేళ్ల చిన్నారికి బెస్ట్ ఫ్రెండ్ తో పెళ్లి, తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది, ఎందుకంటే?

PC:eileidhsjourney

అయితే ఆ అమ్మాయి తెలివిగా నాకు పెళ్లి చెయ్యండి. బంధువులు అందరిని పిలిపించండి అంటూ ఎవ్వరూ ఊహించని విధంగా తన కోరిక చిట్టాలను వివరించింది. త్వరలో చనిపోతున్న చిన్నారి చివరి కోరికను ఆమె తల్లిదండ్రులు కాదనలేకపోయారు. ఆమె చెప్పిన అబ్బాయితోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. చిన్నారి బెస్ట్ ఫ్రెండ్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వారిని అంగీకరించేలా చేశారు. స్కాట్లాండ్ లో ఐదేళ్ల చిన్నారికి, ఆమె బెస్ట్ ఫ్రెండ్ కు అందరి సమక్షంలో అదిరిపోయేలా పెళ్లి జరిపించారు. ఎందుకు ఏమిటనేది మీరు తెలుసుకోవాలంటే కథ పూర్తిగా కదవావల్సిందే..

2. త్వరలో చనిపోతుంది

ఇలీధ్ ఎక్కువ కాలం బతకదని చివరికి డాక్టర్లు తేల్చేశారు. చిన్నారి బతికున్నంతకాలం సంతోషంగా ఉండేలా చూడాలని, అంతకంటే మనం ఏమీ చెయ్యలేమని వైద్యులు ఇలీధ్ తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారిని నీకు ఏమీ కావాలి అంటూ తల్లిదండ్రులు అడిగారు.

మిమ్మల్ని షాక్ కు గురిచేసే భారత దేశంలోని ఒక పురాతన సెక్స్ గేమ్!

3. ఊహించని షాక్ ఇచ్చిన ఇలీధ్

అందరు పిల్లలులాగే ఆడుకొవడానికి బొమ్మలు, తినడానికి చాక్లెట్లు, పండ్లు అడుగుతుందని ఇలీధ్ తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే మన బంధువులు అందరినీ పిలిపించి వారి సమక్షంలో తనకు పెళ్లి చెయ్యాలని ఇలీధ్ షాక్ ఇచ్చింది.

4. వాడినే చేసుకుంటా, లేకుంటే లేదు

తన బెస్ట్ ఫ్రెండ్ హ్యారిసన్ గ్రేర్ తోనే పెళ్లి జరిపించాలని ఇలీధ్ తన తల్లిదండ్రులకు చెప్పింది. వాడు కాకుంటే నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోనని మెలిక పెట్టింది. అంతే తన తల్లిదండ్రులకు చిన్నారి ఇలీధ్ మరో షాక్ ఇచ్చింది.

5. మొహమాటంతో

ఇలీథ్ తల్లిదండ్రులు పెళ్లికి హ్యారిసన్ గ్రేర్ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా ? లేదా ? అంటూ భయపడిపోయారు. చివరికి హ్యారిసన్ గ్రేర్ ఇంటికి వెళ్లారు. చిన్నారి ఇలీధ్ మీ కుమారుడిని పెళ్లి చేసుకోవాలని అంటున్నదని వారు మొహమాటంగా చెప్పారు.

పురుషులకు చనుమొనలు ఎందుకు ఉంటాయో తెలుసా?

6. చిన్నారి సంతోషం కంటేనా

మా కుమారుడు అంటే ఇలీధ్ కు ఇష్టం అని తెలుసు, అయితే పెళ్లి చేసుకునే అంత ఇష్టం ఉందని ఇప్పటి వరకూ మాకు తెలీదని హ్యారిసన్ గ్రేర్ తల్లిదండ్రలు అన్నారు. ఇలీధ్ సంతోషం కంటే మాకు ఏమీ అవసరం లేదని చెప్పి వెంటనే చిన్నారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

7. బంధువులకు ఆహ్వానం

ఇలీధ్, హ్యారిసన్ గ్రేర్ పెళ్లికి ఇరు వైపుల ఉన్న బంధువులకు ఆహ్వానం పంపించారు. పెళ్లి చెయ్యడానికి ఓ ఫంక్షన్ హాల్ ను ఎంపిక చేశారు. తరువాత పెళ్లి వంటలు చెయ్యడానికి క్యాటరింగ్ నిర్వహకులకు కబురు పంపించారు.

8. పెళ్లి కుమార్తె ను తయారు చేశారు

ఇలీధ్ ను చక్కగా పెళ్లి కుమార్తె లాగా అలంకరించారు. పెళ్లి కుమారుడు హ్యారిసన్ గ్రేర్ ను అలంకిరించారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఇద్దరికి ఉంగరాలు మార్చించి పెళ్లి జరిపించారు. చిన్నారి ఇలీధ్ చివరి కోరిక కావడంతో పెళ్లిలో ఫోటోలు, వీడియోలు తీయించారు.

ఆ కోరిక తీర్చుకోవడం కోసం కర్ర పెండలం ఉపయోగించి ఆస్పత్రి పాలైంది..

9. చివరికి బంధువుల ఆశీర్వాదం తీసుకున్న చిన్నారి

ఇలీధ్, తన బెస్ట్ ఫ్రెండ్ హ్యారిసన్ గ్రేర్ తో కలిసి పెళ్లి జరిగిన ఫంక్షన్ హాలో సందడి చేసింది. బంధువులు అందరి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది. బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి వంటలు ఆరగించింది. తరువాత ఇద్దరు ఫంక్షన్ హాల్ బయట ఉన్న పార్క్ లో షికారుకు వెళ్లారు.

10. కళ్లలో నీళ్లు, ఎన్ని రోజులో చెప్పలేం

త్వరలో చనిపోతన్న ఇలీధ్ తన స్నేహితుడు హ్యారీసన్ గ్రేర్ తో కలిసి పార్క్ లో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటున్న విషయం గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు, బంధువుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంత చిన్న వయస్సులో ఇలీధ్ కు దేవుడు ఎందుకు ఇంత వింత వ్యాధి ఇచ్చాడు, పాపం ఎన్ని రోజులు బతుకుతుందో అంటూ విషాదంలో మునిగిపోయారు.

English summary

5 year-old terminally-ill girl marries her best friend aged six in this fairytale wedding

A TERMINALLY ill five-year-old girl has ticked her “dream-wedding” off her bucket list after a touching ceremony with her best friend.
Subscribe Newsletter