బీర్ యోగా వెనుకున్న ఆసక్తికరమైన విషయాలు..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

"బీర్ యోగా" ఇప్పుడు ఫిట్ నెస్ ఔత్సాహికులలో సరికొత్త సంచలనం. బీర్ ఇష్టపడే వారు ఎక్సర్సైజ్ ఇష్టపడని వారు తప్పకుండ బీర్ యోగా ట్రై చేయాల్సిందే.

మనస్ఫూర్తిగా కావల్సినంత బీరు తాగలేని వారికి ఇది శుభవార్తే. యోగా చేస్తూ బీరు తాగతున్నట్టు ఊహించండి, కల నిజం అయినట్టుగా ఉందికదా?

Have You Tried Beer Yoga Yet

కొన్ని రిపోర్ట్స్ బీర్ యోగాదే భవిష్యత్తు అని చెప్తునప్పటికీ, ఈ బీర్ యోగా చేసే వ్యక్తులు అయితే ఇది చాలా సత్ఫలితాలు ఇచ్చిందని చెప్తున్నారు.

మరి ఈ విచిత్రమైన యోగా వెనుక ఉన్న చరిత్ర ఏంటి దాని విశేషాలు తెలుసుకొండి.

అసలు బీర్ యోగా అంటే ఏంటి?

అసలు బీర్ యోగా అంటే ఏంటి?

ఇదేమి సరికొత్త పద్ధతేమి కాదు, కాని అసలు కిటుకంతా తలపైన సీసాను బ్యాలన్స్ చేయడంలోనే ఉంది. అలా సీసాను బ్యాలన్స్ చేసే క్రమంలో సరైన భంగిమలొ ఉన్నప్పుడు కొన్ని చుక్కలు బీర్ కూడా తాగచ్చు. మనస్సు మరియు శరీరాన్ని విశ్రాంతి కలిగించే ఈ బీర్ యోగా చాలా పాత చికిత్సా పద్ధతేనని నమ్ముతారు.

కాని యోగా కి బీర్ ఎందుకు వాడడం?

కాని యోగా కి బీర్ ఎందుకు వాడడం?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు బీర్ కు ఉన్న పొషక విలువల గురుంచి చాలాకాలంగా చర్చిస్తూనే ఉన్నారు. బీరులొ అధిక కెలరీలు ఉన్నపటికీ , గుండెపోటు వచ్చే అవకాశం తగ్గించడమే కాకుండా శరీరానికి డయాబెటీస్ రాకుండా కాపాడడంలో సాయం చేస్తుంది.

బీర్ యోగా ఎలా చేయాలి?

బీర్ యోగా ఎలా చేయాలి?

బీర్ యోగా చేయాలంటే కొంచెం బీర్ తాగి తర్వాత మీ శరీరంతో విభిన్న భంగిమలు , ఆసనాలు వేయడమే. ఇది అత్యంత వినోదాత్మకమైన అనుభుతిని కలిగిస్తుంది ఎందుకంటే బీర్ రుచి చూస్తూ యోగాసనాలు చేసే అనుభవానికి సాటి ఏముంటుంది చెప్పండి.

బీర్ యోగా ఎవరు చేస్తారు?

బీర్ యోగా ఎవరు చేస్తారు?

ఈ యోగా పద్ధతి ఎవరు చేయచ్చంటే యోగా ఇష్టపడే బీర్ ప్రేమికులందరూ అలాగే బీర్ తాగడం ఇష్టపడే యోగులందరూ చెయచ్చు. ఒక్క విషయం మాత్రం మర్చిపోకుండా చూస్కొవాలి అదేంటంటే మీరు కనీస వయసు కలిగిన వారై ఉండాలి ఎందుకంటే ఈ బీర్ యోగా చిన్న పిల్లలకు కాదు మరి.

స్నేహితులను చేసుకోడానికి ఆసక్తికరమైన మార్గం

స్నేహితులను చేసుకోడానికి ఆసక్తికరమైన మార్గం

యోగా సెంటర్లొ స్నేహితులను చేసుకోవడం అత్యంత సులభం. సీసాను బ్యాలన్స్ చేయడం నేర్చుకునే క్రమంలో మనుషుల మధ్య బంధాలు బలపడి స్నేహితులుగా మారిపొతారు. మరి బీర్ యోగా గురుంచి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా , ఈ యోగాను మీరు ట్రై చేస్తారా? క్రింద కామెంట్ లో తెలియజేయండి.

English summary

Have You Tried Beer Yoga Yet?

"Beer Yoga", is the new buzz for fitness enthusiasts! This is the perfect thing that people who love beer and hate exercising can try!
Story first published: Thursday, February 23, 2017, 20:00 [IST]
Subscribe Newsletter