ఈ యోగి ఆమె యోగాసనాలతో ప్రపంచానికి గట్టి సందేశాన్ని పంపుతోంది

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

జీవితాన్ని ఒత్తిడిలో గడపాలంటే అంత ఆషామాషీ విషయం కాదు, మరీ ముఖ్యంగా ఏ వ్యక్తులైతే ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతారో, వాళ్లకు అలా జీవించడం మరీ కష్టతరంగా ఉంటుంది. ఒత్తిడిని జయించడం మరియు ఆత్మహత్య ఆలోచనలు మన మదిలో రాకుండా మన పని చేసుకుపోవడం అలాంటి సమయంలో కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. కానీ ఒకసారి సానుకూల దృక్పధంతో అటువంటి సందర్భాల్లో వ్యవహరించడం ద్వారా మీరు విజయ తీరాలకు చేరడానికి మీకు ఏవి అడ్డుపడవు.

మహిళ అయిన యోగి తన యోగాసనాల ద్వారా ప్రపంచానికి ఒక శక్తి వంతమైన సందేశాన్ని పంపిస్తోంది !

హైడి విలియమ్స్ ఖచ్చితత్వంతో, పట్టుదలతో ఇలా చేసింది ! ఆమె ఒక అత్యాచార బాధితురాలు. అత్యాచారం జరిగిన తర్వాత ఆమె ఒక తెలియని మానసిక సంఘర్షణకు మరియు వేదనకు విపరీతంగా లోనైంది. ప్రతి క్షణం ఒక తెలియని భయంతో బ్రతికింది. దీంతో ఆమెలో ఒత్తిడి మరియు ఆతురత విపరీతంగా పెరిగిపోయాయి.

యోగ డే: తలనొప్పి తగ్గించుకోవడానికి యోగ!

ఇంత మానసిక క్షోభ అనుభవించిన ఈ మహిళ తన ఒత్తిడిని ఎలా జయించింది ? ఎలా ఇప్పుడు మళ్ళీ సాధారణ జీవితాన్ని గడుపుతోంది? ఇలా మారడానికి యోగా ఎలా కారణం అయ్యింది? ఆమె జీవితంలోని స్ఫూర్తి దాయక విషయాలను క్రోడీకరించి, ఒక ప్రేరణాత్మక కథగా మీకు తెలియజేసే ప్రయత్నమిది.

ప్రస్తుతం ఆమె తన యోగాసనాలతో ప్రపంచంలో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది.

ఒకానొక ఇంటర్వ్యూలో ఆమె ఏమని చెప్పిందంటే :

యోగా తనకు ఎంతో ఓదార్పు ఇచ్చిందని పేర్కొంది హైడి విలియమ్స్. " ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు జీవితమే నరకప్రాయంగా మారినప్పుడు, నేను ఉంటున్న చోటులో ఉండలేక పోతున్నప్పుడు, ఇటువంటి క్లిష్టతర సమయంలో నేను యోగా నేర్చుకోవడం ప్రారంభించాను. అది నిజంగా ఒక అదృష్టం, అది నన్ను ఎంతగానో అనుగ్రహించింది. యోగా వల్లనే నేను ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాను. యోగా చేయడం వల్ల ప్రశాంతతను పొందాను మరియు నన్ను నేను అర్ధం చేసుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడింది" అని ఆమె చెప్పుకొచ్చింది.

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది :

ప్రస్తుతం హైడి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తూ, తన జీవితంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను, తద్వారా ఆమె నేర్చుకున్న విషయాలను, ప్రపంచానికి తాను ఇవ్వాలనుకుంటున్న సందేశాన్ని, అవి మిగతా వారిలో ఎంతో మార్పు తీసుకోనువస్తుంది అనే నమ్మకంతో సామాజిక మాధ్యమాలను విశేషంగా వాడుకుంటోంది. ప్రపంచంలో స్ఫూర్తిని నింపాలని ప్రయత్నిస్తుంది. మనకున్న ఒకే ఒక్క జీవితంలో ఆనందాన్ని ఎలా కనుక్కోవాలి అని చెప్పడానికి విపరీతంగా ప్రయత్నిస్తోంది.

తన సామాజిక మాధ్యమాల అకౌంట్లు ఎంతగానో ప్రేరణ కలిగిస్తాయి :

ఆమె తన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ప్రతి ఒక్క చిత్రం, ప్రతి ఒక్కరిని ఎదో ఒకరకంగా ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాని ఒక భాగం చేసుకోవాలని ఆమె అంతర్లీనంగా ప్రజలకు తన చిత్రాల ద్వారా చెబుతూనే ఉంటుంది. అక్కడ తను చేసే వ్యాఖ్యలు ఎంతో మందికి భావోద్వేగ ప్రశాంతతను ఎలా సాధించాలి అనే విషయమై ఎంతగానో దోహదపడుతున్నాయి.

ఆమె ఏమని పోస్టులు పెట్టిందంటే :

"ప్రజలు మీరు వెళ్లే దారిని ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటారు. వాళ్ళు మీ పై వ్యాఖ్యలు చేస్తారు మరియు విమర్శిస్తారు మరియు మీరు మీ విజయ తీరాలకు చేరేవరకు మిమ్మల్ని వేరే వాళ్లతో పోల్చి చిన్నచూపు చూస్తూనే ఉంటారు. మీరు విజయాన్ని అందుకున్న తర్వాత వారికి కృతఙ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీలో మెరుపుని రగిల్చారు వారు. వారి యొక్క వ్యతిరేక గాలి వల్లే మీకు ఎగరడం ఎలాగో తెలిసింది. "

అత్యాచారం జరిగినప్పుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంది:

తను అత్యాచారానికి గురైన సంఘటనను వివరిస్తూ ఏమని రాసుకొచ్చిందంటే " ఎప్పుడైతే ఒక స్త్రీ అపవిత్రురాలు అవుతుందో అప్పుడు చాలా మంది ఆ సందర్భాన్ని వివరించడానికి వాడే పదం " ఆమె తన అమాయకత్వాన్ని కోల్పోయింది ." ఇందువల్లనే చాలా మంది స్త్రీలు అత్యాచారం జరిగిన తర్వాత పశ్చాత్తాప భావంతో కుమిలిపోతారు ."

ఇంకా ఏమని చెప్పుకొచ్చిందంటే :

" నేను గనుక ఏమాత్రం రాధిని కాకపొతే, ఇక ఏమి మిగిలి ఉంది నేను భావించడానికి. కానీ ఎందుకో ఎలా గోలా అందరూ నన్ను నిందిస్తున్నారు. నేను అత్యాచారానికి గురైన తర్వాత క్షమాపణలు చెప్పవలసి ఉందని భావించాను. ఎందుకంటే అనుకున్న అంత బాగా వ్యవహరించినందుకు, ఏమి చేయాలో అర్ధంకానందుకు, ఏమి జరిగిందో నేను గుర్తించేలోపే అత్యాచారం జరిగిపోయింది. కానీ దానిని వర్ణించడానికి అంత జుగుత్సాకర వ్యాఖ్యలు వాడనవసరంలేదు. ఆ పదాన్ని అసలు వాడకూడదు అనుకున్నాను. సమయంకాని సమయంలో, తప్పుడు ప్రదేశంలో ఉన్నాను కాబట్టి అలా జరిగింది. నేను అలా జరగడానికి ఒప్పుకున్నాను. నేను వద్దు అని చెప్పిన తర్వాత కూడా అతడు నా పై పడుతుంటే నా శక్తినంతా వాడిన ప్రక్కకు త్రోయలేకపోయాను, దీంతో నా పై పై కి వచ్చేసాడు. "

మరింత స్ఫూర్తి పొందే మాటలు :

" మొదట నా రక్తపోటు విపరీతంగా పెరిగిపోయింది మరియు గుండె కొట్టుకోవడం ఎక్కువైపోయింది. నా శ్వాస తీసుకొనే ప్రక్రియ రెండింతలు వేగంగా పుంజుకుంది. నా కుడి చేతి భుజం తీవ్రంగా బిగుసుకు పోయింది. ఇక ఎటు కదలలేని పరిస్థితికి చేరుకున్నాను మరియు నా తలని చేతులతో బంధించారు. నా చేతులన్నీ చెమటలు పట్టాయి. రెండు సంవత్సరాల క్రితం ఇది ఒక భయంకరమైన సంఘటనగా మారిపోయింది. నేను ఒక తెలియని స్థితికి వెళ్ళిపోయాను, నా శరీరం మొత్తం వణికిపోతోంది. గట్టి గట్టిగా అరుస్తున్నాను. నన్ను వదిలేయమని, ఇక ఆపమని వేడుకుంటున్నాను. ఒక్క సారిగా ఆగిపోయిన తర్వాత అలసిపోయి కుప్పకూలిపోయాను. ఆ తర్వాత కూడా నన్ను ఎవరో చంపడానికి బెదురుస్తున్నట్లు భావించి నా జీవితం కాపాడుకోవడానికి పరిగెత్తాను."

English summary

This Yogi With Her Yoga Poses Has A Strong Message To The World!

Here is here inspirational story on how she fought her depression and all these conditions with the help of Yoga!
Subscribe Newsletter