For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను ఎట్టి పరిస్థితిలో ఇతరులతో షేర్ చేయకండి..!!

మన జీవితం లో మనం మనకు నచ్చినట్లు ఉండటానికి అందరం ఏదో ఒకటి చేస్తుంటాం దానికి మనం నిజంగా గర్వ పడాలి. అయితే, మీరు నిజమైన శాంతి, ఆనందం మరియు శ్రేయస్సుని అనుభవించాలనుకుంటే, మీరు ఇతరుల నుండి ఈ కొన్ని నిజాలన

|

మన జీవితం లో మనం మనకు నచ్చినట్లు ఉండటానికి అందరం ఏదో ఒకటి చేస్తుంటాం దానికి మనం నిజంగా గర్వ పడాలి.

అయితే, మీరు నిజమైన శాంతి, ఆనందం మరియు శ్రేయస్సుని అనుభవించాలనుకుంటే, మీరు ఇతరుల నుండి ఈ కొన్ని నిజాలని దాచిపెట్టాలి. అవి ఏంటో మీరే చదవండి...

 మీ పొజీషన్ (మీ స్థానం)

మీ పొజీషన్ (మీ స్థానం)

ఈ సమాజంలో మీరు ఒక నిర్దిష్ట స్థానం మరియు ప్రతిష్ట ను ఆస్వాదిస్తున్నారంటే గొప్ప విషయమే, మీరు సొంతంగా డబ్బా కొట్టుకొనవసరం లేదు. మీరంటు ఒక మంచి స్థానంలో వున్నపుడు, మీరు మీ గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే మీ గురించి వాళ్ళంతట వాళ్ళ తెలుసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది.

 ఇది ఎలా ఇబ్బంది కలిగిస్తుంది:

ఇది ఎలా ఇబ్బంది కలిగిస్తుంది:

ప్రజలకు మీ శక్తి మరియు ప్రతిష్టల గురించి చెప్పడం వలన అభినందించేవాళ్ల కంటే శత్రువులనే ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ సమాజం. ఇంకా మిమ్మల్ని చూసి ఈర్ష పడే వాళ్ళ సంఖ్య ఎక్కువవుతుంది. ఎదుటివారితో కొన్ని హద్దులులో ఉండటం మంచిది. అది ప్రతి ఒక్కరితో మీ బంధం మంచిగా సాగటానికి ఉపయోగపడుతుంది.

అవమానం

అవమానం

మీరు ఎవరి చేతిలో నైనా అవమానించబడినప్పుడు, దాన్ని మీరు రహస్యంగా ఉంచడం ఉత్తమం. ఎవరూ అవమానించబడటాన్ని ఇష్టపడరు, అందులో ఎవరిది తప్పు అనేది విషయం కాదు. కాబట్టి మీరు సమాజంలో గౌరవాన్ని పొందాలంటే దానిని మీలోనే రహస్యంగా ఉంచుకోండి.

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా జడ్జిమెంటల్ గా మారారు అదే దీనికి కారణం. వారి అవగాహన ద్వారా మిమ్మలిని నిర్ధారించడం లేదు, బదులుగా వారు ప్రజల అవగాహన బట్టి నిర్ధారిస్తారు. కాబట్టి, మీరు ఈ విషయాలగురించి ఎక్కువగా వారికి చెప్పకండి, మరింతగా వాళ్ళు మమల్ని జడ్జ్ చేస్తారు.

మంత్రం

మంత్రం

మనం దేవుడి దయను పొందడానికి అన్ని మంత్రాలూ, శ్లోకాలు చదువుతాము. శక్తివంతమైన మంత్రాలలో ప్రపంచంలోని అన్ని కంపనాలు వుంటాయని చెప్పబడింది మరియు అది మిమల్ని దేవుడికి కనెక్ట్ చేయడమే కాకుండా, మానసికంగా మనకు సహాయపడుతుంది. మీరు చదివే మంత్రాలను ఎవరితోనూ షేర్ చేసికోకూడదని చెబుతారు.

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఏ మంత్రం, ప్రార్ధన లేదా భక్తి గీతాల గురించి మీరు ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు దానియొక్క ప్రాముఖ్యతని కోల్పోతుందని చెప్పబడింది. ప్రార్ధనలని ఇంకొకరికి షేర్ చేస్తున్నారంటే వాళ్లు దానిలో కల్పించుకోకుండా, దాని గురించి జడ్జ్ చేయకుండా ఉండాలి.

మనీ(సంపద, డబ్బు)

మనీ(సంపద, డబ్బు)

మన అందరికీ జీవితంలో మనీ కావాలి కదా? దానికోసమే మనం ఏ పనైనా చేస్తాము మరియు దానిని ఎప్పుడు మన హృదయంలో ఉంచుకోవాలి. అయితే, మన కుటుంబ సభ్యులు అయితే తప్పా, ఎప్పుడూ ఎవరితోనూ మన వాస్తవ సంపాదన గురించి చెప్పకూడదు.

 ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

దీని వెనుకున్న కారణం చాలా సింపుల్- మీరు మీ సంపాదన గురించి అందరికి చెప్పినప్పుడు మిమల్ని చూసి అసూయ పొందుతారు. వాళ్ళు మీ డబ్బుని దోచుకోవడానికి చూస్తారు లేదా మీ శక్తిని కోల్పోయేలా ప్లాన్స్ చేస్తారు.

వయస్సు :

వయస్సు :

హిందూ మతం శాస్త్రాల ప్రకారం ఒక సామెత వుంది "వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే" అది ఎక్కువ వాటర్ ని నిలువరించదు. మీ వయసు ని మీకిష్టమైన వాళ్లకి, మీ దగ్గరి వాళ్లకి తప్పా ఎవరితో ఎప్పుడూ షేర్ చేసుకోకూడదు. దీనిని రహస్యంగా ఉంచడం ఉత్తమం.

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

దీనికి కి కారణము ప్రజలకి మీ రియల్ వయసు తెలియకుండా ఉన్నంత వరకు వారు గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోలేరు. ఈ సమాజంలో చాలా చిన్న వయసుగల వక్తి లేదా ఎక్కువ వయసువున్నవాళ్ళకి తక్కువ ప్రమాదం ఉంటుంది. అందుకే వయసు గురించి దాచాలి.

గ్రహ స్థితి

గ్రహ స్థితి

మన జ్యోతిషశాస్త్ర ప్రకారం గ్రహాల మార్పిడి వలన సమస్యలను పొందుతామని అంటారు. అయితే ఒక్క మతాధికారి తప్ప,ఇంకెవరు ఈ గ్రహ సమస్యల గురించి ఎవరికీ చెప్పకూడదు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కూడా చెప్పకూడదు.

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

మీరు మీ జీవితంలో గ్రహ మార్పిడి వలన సమస్యలను ఎదురుకొంటునట్లు ఇతరులకు తెలిస్తే, వారు మిమల్ని మరింత దిగదార్చిడానికి ప్రయత్నిస్తారు. మీరు సమస్యలలో వున్నపుడు మిమల్ని అనేక సందేహాలను కల్పించి మీ జీవితాన్ని నాశనం చేస్తారు. మీ గ్రహాలను నిందిస్తారు. అలాంటి విషయాలలో స్పష్టంగా వుండండి.

అనారోగ్యం

అనారోగ్యం

కేవలం ఒక డాక్టర్ కి మాత్రమే మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకునే హక్కు వుంది. మీరు ఒక వ్యక్తి నుండి ఇంకొకరికి సోకే వ్యాధి తో బాధపడుతున్నపుడు,ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి.

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

మీరు ఒక బలహీనమైన అనారోగ్యానికి గురైనారని ఇతరులకి తెలిస్తే వాళ్ళు మిమల్ని విధ్వంసము చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ వాస్తవం మీకు మరియు మీ కుంటుంబ సభ్యులకి సమస్యలని తీసుకురావచ్చు. ఇంకా మీ వర్క్ ప్లేస్ లో కూడా మీకు సమస్యలు రావచ్చు.

వ్యక్తిగత సంబంధాలు

వ్యక్తిగత సంబంధాలు

భార్య మరియు భర్తల మధ్యగల సంబంధం చాలా వ్యక్తిగతం మరియు ఎప్పుడూ ఎవరితో దాని గురించి చర్చించకూడదు. మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కూడా చెప్పకూడదు. ఒకవేళ మీ కుటుంబ జీవితంలో ఏదయినా సమస్య ఉంటే, సలహాదారుడితో చర్చించండి అంతే కానీ ఇంకెవరితో కాదు.

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

మీ వ్యక్తిగత జీవితం బహిరంగంగా మారినప్పుడు మీ జంట మధ్య వివాదాస్పద సమస్యలకు కారణమవుతుంది. అనేకమంది మీకు సలహాలు ఇవ్వడానికి కారణమవుతుంది. ఒక వివాహం లేదా సంబంధం అనేది ఒక పవిత్రమైన ఐక్యత మరియు దీనిని సాధ్యమైనంత వరకు వక్తిగతంగా ఉండాలి.

విరాళం

విరాళం

లేనివారికి విరాళం ఇవ్వడం గొప్పే అయితే, దానిగురించి చాల రహస్యంగా ఉంచాలి. మీరు నిజంగా సమాజం కోసం విరాళం చేసి దానిగురించి అందరికీ గొప్పగా చెప్పడం వలన మిమల్ని బలహీనులను చేస్తుంది.

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

ఇది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది

దానం మరియు విరాళం రహస్యంగా ఉంచడం వల్ల మీరు తిరిగి రాబడి ( ఆనందం మరియు డబ్బు రూపంలో) ని ఇస్తుందని చెబుతారు. దాని గురించి ఇతరులకు చెప్పడం ఒక వ్యాపార లాభాలతో సమానంగా ఉంటుంది మరియు దానిని విరాళంగా పరిగణించబడదు.

English summary

Hiding these things from others could mean happiness and prosperity for you!

We all have done something in our life that we are proud of and something that we rather keep to ourselves. However, do you know that if you want to experience real peace, happiness and prosperity, there are certain facts of your life that you should keep hidden from others? Read on to know what they are...
Story first published: Thursday, April 20, 2017, 13:30 [IST]
Desktop Bottom Promotion