మీ పెదాల షేప్ ను బట్టి మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మానవ ముఖంలో అతి ముఖ్యమైన అంశంలో పెదవులు ఒకటి. అలాంటి వ్యక్తి యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇతరులు వారిపై ఎంతో ఆసక్తిని కలిగి ఉండవలసిన అవసరం ఎంతో ఉంది.

ఇటీవలి ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, పెదవుల ఆకారం బట్టి ఒక వ్యక్తి యొక్క లక్షణాలను మరియు వ్యక్తిత్వం గురించి చాలా వెల్లడిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

కాబట్టి, మీరు చెయ్యాల్సినదల్లా కేవలం ఆ వ్యక్తి యొక్క పెదాలను చూడండి మరియు వారి యొక్క పెదవుల ఆకారం మరియు సైజ్ ను బట్టి, వారి యొక్క లక్షణాలను విశ్లేషించండి.

ఎంత ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయో తనిఖీ చేయండి !

గడ్డం ఆకారం లేదా షేప్ ను బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..! మీరూ ట్రై చేయండి

సాధారణ పెదవులు :

సాధారణ పెదవులు :

సామాన్యంగా కనిపించే పెదవులతో ఉన్న వ్యక్తులు, తరచుగా వారి ముందు ఉంచిన పనులను నెరవేర్చడానికి సమతుల్యంగా, సామాన్యమైన మానసిక శక్తిని కలిగి ఉంటారు. వీటితో పాటు, ఇతరులు మాటలను విన్నప్పుడు, వారి యొక్క సామర్థ్యంలో వారి బలాలు కనిపిస్తాయి. వారు కూడా విమర్శలను తేలికగా తీసుకొని ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు.

పై పెదవి చాలా పదునుగా ఉన్నట్లయితే :

పై పెదవి చాలా పదునుగా ఉన్నట్లయితే :

పెదవుల ఈ ఆకారంలో ఉన్న వ్యక్తులు 100% సృజనాత్మకతను కలిగి ఉంటారని చెబుతున్నారు. వారు తరచూ ప్రతిభావంతులైన కళాకారులుగా మరియు సంగీత విద్వాంసులుగా ఉన్నారు. ఇతరుల ముఖాలను మరియు పేర్లను గుర్తుకు వచ్చినప్పుడు వారిలో అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నారని నమ్ముతారు. ఇదే కాకుండా, వారు స్నేహశీలియైనవారు కూడా. వారు ప్రతి సాధ్యమైన విధంగా, స్వీయ భావ వ్యక్తీకరణ కోసం పోరాడతారు మరియు వారు ఎల్లప్పుడూ వారి పనిలో మంచి ఫలితాలను సాధించడాన్ని మనము గమనించవచ్చు.

పై పెదవి పెద్దదిగా ఉంటే :

పై పెదవి పెద్దదిగా ఉంటే :

ఈ విధమైన ఆకారంలో పెదవులను కలిగిన ఉన్న వ్యక్తి నాటకంలో గొప్ప రాణులుగా రాణిస్తారు అని నమ్ముతారు. వారు భావోద్వేగభరితంగా, ఆకర్షణీయమైనవి, వారి జీవితాన్ని సంపూర్ణంగా ప్రేమిస్తారు మరియు వారు తమ దృష్టిని ఆకర్షించడంగా కూడా కనిపిస్తుంది. వీటితో పాటు, వారు తమ సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు మరియు ఇతరులను తమ వైపుకు ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు సాధారణంగా ఇతరుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటారు.

కింద పెదవి, పై పెదాల కంటే పెద్దదిగా ఉంటే :

కింద పెదవి, పై పెదాల కంటే పెద్దదిగా ఉంటే :

ఈ రకమైన పెదవులను కలిగి ఉన్నవారికి 9 - 5 గంటల సమయం వరకూ ఉండే ఉద్యోగాలు వీలు కావు. అన్వేషించడం కోసం వారి వద్ద అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి, కానీ వారు ఆ విషయాలను బయటపెట్టారు. ఆనందాన్ని ఆస్వాదించడం అనేది వారికి బాగా తెలుసు. కొత్త ప్రదేశాలను సందర్శించడానికి తగిన శక్తిని మరియు ఆసక్తిని పూర్తిగా కలిగి ఉంటారు. దీనితో పాటు వారు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే కొత్త అంశాల పట్ల ఆసక్తికరంగా, స్నేహశీలిగా ఉంటూ వారి ఆలోచనలను తెరచి ఉంటారు. సాహస భరితమైన మార్గంలో వారు ప్రయాణించడంతో పాటు, ప్రజలను వారితో పాటు నడిపించే వ్యక్తిగానూ ఉంటారు.

ఫ్యాక్ట్స్ : రాత్రి లేదా పగలు..పుట్టిన సమయాన్ని బట్టి వ్యక్తిత్వ లక్షణాలు.. !

బొద్దుగా పెదవులు గాని ఉంటే :

బొద్దుగా పెదవులు గాని ఉంటే :

ఈ విధమైన ఆకారంలో పెదవులను కలిగి ఉన్న వ్యక్తులను, ఇతరులు ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి పెదవులు ఈ విధంగా ఉన్నాయంటే, ఆ వ్యక్తి వారి తోబుట్టువులలో చిన్నవారిగా ఉన్న వారిని (లేదా) పెంపుడు జంతువులను జాగ్రత్తలు చూసుకోవడం కోసం చాలా సమయాన్ని కేటాయిస్తారని అర్థం. వారు ఒక అంతర్గతమైన మరియు బలమైన మాతృత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు ఇతరులను కాపాడాలన్న మరియు రక్షించాలన్న ఒక బలమైన కోరికను కలిగి ఉంటారు. ఇటువంటి అబ్బాయిలు సాధారణంగా ఉత్తమమైన తల్లిదండ్రులుగా తయారవుతారు.

కాబట్టి, మీ పెదవుల యొక్క ఆకారం ఏవిధంగా ఉంది మరియు ఇది మీ వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేస్తుంది ? దిగువ వ్యాఖ్య విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

How Do The Shape Of Lips Define You

How Do The Shape Of Lips Define You ,Did you know researchers have proven that lip shapes define a lot about your personality?
Subscribe Newsletter