2018లో ఈ రాశుల వారిని కేతువు వేధిస్తాడు

Written By:
Subscribe to Boldsky

కేతువు ఆయా రాశుల్లో అపసవ్యదిశలో పయనిస్తాడు. మేషం నుంచి మీనానికి పయనిస్తుంటాడు. ఒక్కో రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశలో కేతువు ఉంటాడు. కేతువు పురుష గ్రహము. 2018లో కేతువు ఆయా రాశుల్లో పలు స్థానాల్లో ఉంటాడు. 2018లో మీ రాశి ప్రకారం కేతువు ఉండే స్థితి, మీకు కలిగే నష్టాలు, అవరోధాలు, లాభాలు ఏమిటో తెలుసుకోండి.

మేషం (21 మార్చి 20 ఏప్రిల్)

మేషం (21 మార్చి 20 ఏప్రిల్)

మేషరాశిలో కేతువు పదో స్థానంలో ఉంటాడు. దశమ స్థానంలో కేతువు ఉన్న వారికి కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతాయి. వీరిలో ఏకాగ్రత తక్కువే చేసేందుకు కేతువు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. అలాగే మీరు విజయం సాధించకుండా కేతువు అడ్డుపడుతూ ఉంటాడు. అయితే ఎక్కువగా కృషి చేస్తే తప్పా విజయం సాధించలేరు.

వృషభం (21 ఏప్రిల్ -21 వ మే)

వృషభం (21 ఏప్రిల్ -21 వ మే)

కేతువు తొమ్మిదో స్థానంలో ఉంటాడు. మీరు ఎక్కువగా ప్రకృతితో మమేకం కావడానికి కేతువు దోహదం చేస్తాడు. అలాగే మీలో ఆధ్యాత్మిక భావనలు కూడా పెరుగుతాయి. మీరు చేపట్టబోయే కొన్ని పనులు కూడా విజయవంతం కానున్నాయి.

మిథునం (22 మే 21 జూన్)

మిథునం (22 మే 21 జూన్)

ఈ రాశిలో 8 వ స్థానంలో కేతువు ఉంటాడు. మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని రకాల ఒత్తిళ్లకు గురువుతారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

కర్కాటకం (22 జూన్ 22 జూలై)

కర్కాటకం (22 జూన్ 22 జూలై)

ఈ రాశిలో 7 వ స్థానంలో కేతువు ఉంటాడు. మీరు మీ భార్య లేదా భర్తతో ఇబ్బందులుపడాల్సి వస్తుంది. చిన్నచిన్న సమస్యలే పెద్దగా అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.

సింహరాశి (23 జూలై -21 ఆగస్టు)

సింహరాశి (23 జూలై -21 ఆగస్టు)

ఈ రాశిలో ఆరో స్థానంలో కేతువు ఉంటాడు. అయితే కేతువు ఇలా ఉండడం చాలా ప్రమాదకరం. వీరు వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీరు ఏదైనా పనిలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. మీకు విజయం అనేది అంత ఈజీగా రాదు.

కన్య (22 ఆగస్టు-23 సెప్టెంబర్)

కన్య (22 ఆగస్టు-23 సెప్టెంబర్)

కేతువు ఐదో స్థానంలో ఉంటాడు. వీరు భార్య లేదా భర్త విషయంలో కాస్త ఇబ్బందులుపడతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా కూడా కొన్ని రకాల నష్టాలు వస్తాయి.

తుల (24 సెప్టెంబర్-23 అక్టోబర్)

తుల (24 సెప్టెంబర్-23 అక్టోబర్)

కేతువు 4 వ స్థానంలో ఉంటాడు. వీరు కూడా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. వీరి జీవితంలో నిత్యం కేతువు ప్రతికూలంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలి. నిరాశకు లోను కావొద్దు.

వృశ్చికం (24 అక్టోబర్ -21 నవంబర్)

వృశ్చికం (24 అక్టోబర్ -21 నవంబర్)

కేతువు 3 వ స్థానంలో ఉంటాడు. అయితే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అయితే కాస్త ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. దీంతో వీరు కొన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటారు. అయితే వీరు కాస్త కష్టపడితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

ధనుస్సు (22 నవంబర్-డిసెంబర్ 22)

ధనుస్సు (22 నవంబర్-డిసెంబర్ 22)

ఈ రాశిలో రెండో స్థానంలో కేతువు ఉంటాడు. వీరు ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యక్తిగతంగా, సంసారపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మకరం (23 డిసెంబర్ - 20 జనవరి)

మకరం (23 డిసెంబర్ - 20 జనవరి)

కేతువు ప్రథమస్థానంలో ఉంటాడు. ఈ రాశిపై కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్లు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్తే చాలు. అంతా మంచే జరుగుతుంది.

కుంభం (21 జనవరి - 19 ఫిబ్రవరి)

కుంభం (21 జనవరి - 19 ఫిబ్రవరి)

కేతువు 12 వ స్థానంలో ఉంటాడు. వీరు జీవితంలో ఖర్చులు పెరుగుతాయి. అలాగే వీరి వైవాహిక బంధంలోనూ కాస్త ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతువు మిమ్మల్ని ఇబ్బందులుపెడతాడు.

మీనం (20 ఫిబ్రవరి -20 మార్చి)

మీనం (20 ఫిబ్రవరి -20 మార్చి)

కేతువు 11వ స్థానంలో ఉంటాడు. 2018 వీరికి అనుకూలంగా ఉండొచ్చు. మీరు కొత్తకొత్త విషయాలను నేర్చుకుంటారు. అలాగే ఆధ్యాత్మికత భావాలను పెంపొందించుకుంటారు. వృత్తిపరంగా కూడా మీ జీవితం ముందజంలో ఉంటుంది.

English summary

how ketu transit in 2018 affects on all zodiac signs

2018: Ketu Transit In 2018 And Its Effects On All Zodiac Signs
Story first published: Tuesday, January 2, 2018, 17:30 [IST]