2018లో రాశులను బట్టీ అదృష్టాలు, దురదృష్టాలు

Written By:
Subscribe to Boldsky

జ్యోతిష్యుల ప్రకారం ఇలా గ్రహాలు స్థానాలు మారడం వల్ల కొన్ని రాశుల వారికి 2018 లో మంచి జరుగుతుంది. కొన్ని రాశుల వారు ఈ ఏడాది చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో అలాంటివేమీ ఉండకపోవొచ్చు. అయితే ఒక్కసారిగా అలా కాకపోవొచ్చు గానీ దశల వారీగా కష్టాలు తొలగి అన్నీ శుభాలే చూస్తారు.

గ్రహాలు మారడం

గ్రహాలు మారడం

ఆయా రాశుల వారికి కష్టాలుంటాయా.. అన్నీ విజయాలే ఉంటాయా అనే విషయం గ్రహాల స్థానం బట్టి మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, కుజులు, వృశ్చికంలో రవి, శుక్రులు, ధనుస్సులో శని, వక్రి బుధులు, మకరంలో కేతువు. సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడున్నారు. కొన్ని రాశుల వారికి అనుకూలంగా గ్రహాలుంటాయి. మరొకొంతమందికి వ్యతిరేకంగా గ్రహాలుంటాయి. గ్రహాల స్థానాల బట్టి ఆయా రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. గ్రహాలు అనుకూలంగా ఉంటే అన్నీ విజయాలే చేకూరుతాయి.

శని, బృహస్పతి స్థాన చలనం

శని, బృహస్పతి స్థాన చలనం

బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి స్థాన చలనం కావడం వల్ల కొన్ని రాశుల వారికి కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే శని కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు, కొన్ని రాశుల వారికి నష్టాలు చేకూరనున్నాయి. శని ప్రభావం కొన్ని రాశులపై ఎక్కువగా ఉండనుంది.

2018లో ఈ రాశుల వారు అదృష్టవంతులు

2018లో ఈ రాశుల వారు అదృష్టవంతులు

జ్యోతిష్కుల ప్రకారం వచ్చే ఏడాది తుల, కుంభం, సింహ, మిథునం, వృశ్చికం, కర్కాటకం, మీన రాశుల వారికి అన్ని రకాలుగా కలిసొస్తుంది. దీర్ఘకాలంగా వీరిని వేధించే సమస్యలు అన్నీ దూరం అవుతాయి. వీరికి రాబోయేదంతా మంచికాలమే.

అన్ని రకాలుగా

అన్ని రకాలుగా

పైన పేర్కొన్న రాశుల వారు అన్ని రకాలుగా విజయాలు సాధిస్తారు. వీరు వ్యక్తిగత జీవితంలో , భవిష్యత్తుపరంగా ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులుండవు. వివాహంకానీ వారికి వచ్చే ఏడాది వివాహం అయ్యే సూచనలున్నాయి.

కాస్త జాగ్రత్త అవసరం

కాస్త జాగ్రత్త అవసరం

తుల, కుంభం, సింహ, మిథునం, వృశ్చికం, కర్కాటకం, మీన రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అలా చేయడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

ఆదాయం బాగా ఉంటుంది

ఆదాయం బాగా ఉంటుంది

తుల, కుంభం, సింహ, మిథునం, వృశ్చికం, కర్కాటకం, మీన రాశుల వారికి 2018లో ఆదాయం బాగా ఉంటుంది. మీరు ఏ రంగంలోనైనా పెట్టుబడిపెడితే మంచి ఆదాయాలు చూస్తారు. అయితే కాస్త ఆలోచించి ఆ రంగంలోకి దిగాలి. ఆరోగ్యపరంగా బాగా ఉంటారు. అయితే మీరు కొన్ని అనవసర విషయాల్లో తలదూర్చి ప్రాణహాని వంటి సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి.

ఈ రాశుల వారిని దురదృష్టం వెంటాడుతుంది

ఈ రాశుల వారిని దురదృష్టం వెంటాడుతుంది

2018లో కొన్ని రాశుల వారిని దురదృష్టం వెంటాడుతుంది. వృషభం, ధనుస్సు, మేషం, కన్యరాశుల వారు 2018లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఆశించే పనులుకావు. 2018లో కాలం మీకు కలిసిరాదు.

ఇబ్బందులు

ఇబ్బందులు

వృషభం, ధనుస్సు, మేషం, కన్యరాశుల వారు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీరు కష్టానికి తగ్గ ఫలితం రాదు. వీరికి రావాల్సిన అవకాశాలు చేతి వరకు వచ్చి వెనక్కి వెళ్తాయి. వీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయి. మీరు ధైర్యంగా వీటిని ఎదుర్కొంటే చాలు. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యపరంగా

ఆరోగ్యపరంగా

వృషభం, ధనుస్సు, మేషం, కన్యరాశుల వారు 2018లో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరం. అంటువ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మీరు పుట్టిన సంవత్సరం బట్టీ

మీరు పుట్టిన సంవత్సరం బట్టీ

ఇక రాశులతో సంబంధం లేకుండా మీరు పుట్టిన సంవత్సరాలను బట్టీ కూడా 2018లో మీ భవిష్యత్తు ఉంటుంది. 1993, 1981, 1969, 2000, 1988, 1976, 1964, 1994, 1982, 1970 లో జన్మించిన వారికి 2018 సంవత్సరం బాగా కలిసొస్తుంది.

వ్యాపారపరంగా..

వ్యాపారపరంగా..

1990, 1978, 1966, 1994, 1982, 1970,1998, 1986, 1974, 1962 లో జన్మించిన వారు 2018లో వ్యాపారపరంగా మంచి లాభాలు పొందుతారు.

వీరికి కొన్ని ఇబ్బందులు

వీరికి కొన్ని ఇబ్బందులు

1991, 1979, 1967, 1995, 1983, 1971, 1996, 1984, 1972, 1960 లో జన్మించిన వారు చిన్నచిన్న సమస్యలు ఎదుర్కొంటారు. వీరు పరువు నష్టం లేదా వీరు పని చేసే ఆఫీసుల్లో వీరిపై లేనిపోని పుకార్లు పుడుతాయి.

వివాహం, దాంపత్యం

వివాహం, దాంపత్యం

1988, 1976, 1990, 1978, 1996, 1984, 1972లలో జన్మించిన వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఒకవేళ వీరికి పెళ్లికాకపోతే 2018లో వివాహం అవుతుంది.

ఆరోగ్యపరంగా

ఆరోగ్యపరంగా

2009, 1997, 1985, 1973, 1961, 2011, 1999, 1987, 1975, 1963, 2016, 2004, 1992, 1980, 1968లలో పుట్టిన వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.

English summary

Know if your Zodiac Sign will be Lucky or Unlucky in 2018

Know if your Zodiac Sign will be Lucky or Unlucky in 2018
Story first published: Thursday, December 14, 2017, 12:30 [IST]