ఆమె మహాత్మా గాంధీ "మోడ్రన్" మునిమనవరాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మన స్వాతంత్ర దినోత్సవం గడిచిపోయింది, ఈ ఆగస్టు నెలలో చాలా మంది భారతీయులు నిజమైన దేశభక్తిని కలిగి, ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులందరికీ తమ హృదయాలతో కృతజ్ఞతలను చెబుతారు వారిలో మనం ఎటువంటి స్వాతంత్రం సాధించలేకపోయినా సరే.

మన స్వాతంత్ర సమరయోధుల వారసులు గూర్చి మీరు ఎప్పుడైనా ఊహించారా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా ? మీకు గాంధీజీ కుటుంబ వంశం గురించి తెలుసా ?

మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం ఇదే...!

అవును, రికార్డుల ప్రకారం, గాంధీజీ కుటుంబ సభ్యులు మొత్తంగా 154 మంది ఉన్నారు, వీరంతా ప్రపంచ వ్యాప్తంగా ఆరు (6) విభిన్న దేశాలలో స్థిరపడ్డారు.

ఇప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరైన అలాగే బాగా పాపులరైన వ్యక్తి గురించి చూద్దాం. ఆమె ఎవరో కాదు 'మహాత్మాగాంధీ' మనవరాలు అయిన మేధా, ఈమె యుఎస్ఎ (USA) లో పుట్టి పెరిగింది.

ఈ క్రింది విషయాలను చదివి ఆమె గురించి మరింతగా తెలుసుకుందాం.

సామాజిక మాధ్యమాల్లో కనపడే మహాత్మా గాంధీ నకిలీ చిత్రాలు ఇవే !

ఆమె ఎం.కె. గాంధీ మనవరాలు :

"మేధా" మహాత్మగాంధీ వంటి గొప్ప వ్యక్తికి మునిమనవరాలు. ఆమె ఎం.కే.గాంధీ కుమారుడు హీరాలాల్, అతని కొడుకు (కాంటిలాల్) కి కుమార్తె. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె తండ్రి (కాంటిలాల్) యుఎస్ఎ (USA) కి వెళ్లిపోయారు.

ఆమె యుఎస్ (US) పౌరురాలు :

ఆమె తండ్రి 1948లో యుఎస్ఎ (USA) కి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిపోయారు కాబట్టి మేధా అక్కడే పుట్టి, పెరిగింది.

ఆమె బహుళ ప్రజ్ఞాశాలి :

మేధా గాంధీ బోస్టన్లో డీజే (DJ) గా పనిచేయడమే కాక ఆమె పలు టీవీ కార్యక్రమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. వారి పూర్వీకుల జన్యువులు ఈమెలో ఉండటంవల్ల ఆమె మంచి కోరికలను, నైపుణ్యాన్ని కలిగి ఉంది.

సామాజిక మాధ్యమాల్లో ఆమెది చురుకైన పాత్ర :

మేధా, ఆమె జీవితంలో గల మధురమైన క్షణాలను గూర్చి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ఖాతాల ద్వారా ఇతరులతో పంచుకుంటుంది. ఆమె సోషల్ మీడియా సైట్లలో తన జీవితంలోని సంఘటనలను, చేయవలసిన పనులలో ఆధునికత కొరకు సామాజిక మీడియా ద్వారా మంచి ఉనికిని కలిగి ఉంది.

ఆమెకు అందమైన జీవితం ఉంది :

ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా పేరు 'బేబీ హాట్ సాస్', ఆమె జీవనశైలి చాలా ఆకర్షణీయమైనదిగా ఉన్నట్లు - ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడవుతున్నాయి. ఇవన్నీ కాకుండా, యూఎస్ఏ (USA) లో ఆమె కామెడీ రచయితగా, పేరడీ నిర్మాతగా గుర్తింపు పొందారు.

All Images Source

English summary

She Is The Great Granddaughter Of Mahatma Gandhi

With Independence day just gone by, August is the month where most of the Indians feel truly patriotic and also thank those freedom fighters from the bottom of their hearts, without whom we could not achieve any independence. However, have you ever imagined or even tried to learn about the descendants of our freedom fighters? Do you know about Gandhijis' family lineage?
Story first published: Monday, August 28, 2017, 20:00 [IST]
Subscribe Newsletter