ఈ రాశుల వారు భార్యల చేతిలో చాలా బాధలు అనుభవిస్తారు

Written By:
Subscribe to Boldsky

కొన్ని రాశుల వారు వారి జీవిత భాగస్వామితో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అనవసరమైన అనుమానాలు మీపై మీ జీవితభాగస్వాములు వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో మీరు మీ సహనాన్ని కోల్పొతారు. ఫలితంగా ఇద్దరూ పోట్లాడుకోవడం వంటివి జరుగుతాయి.

మూడు రాశులు

మూడు రాశులు

దీంతో మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మూడు రాశుల వారు చాలా సందర్భాల్లో జీవిత భాగస్వాములతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ఆ మూడు రాశుల వారు ఎవరో మీరు చూడండి. అందులో మీ రాశి కూడా ఉంటే మీరు మీ భాగస్వామి (భర్త లేదా భార్య) తో జాగ్రత్తగా ఉండండి.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వారు భాగస్వాముల ద్వారా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని విషయాల్లో వీరు భాగస్వాముల నమ్మకాన్ని కోల్పొతారు. ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తారు. దీంతో చాలా ఇబ్బందులుపడుతారు. అందువల్ల ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరు భాగస్వామితో వీలైనంత వరకు ఎలాంటి అబద్దాలు చెప్పకపోవడమే మంచిది. ప్రతి విషయంలో ఓపెన్ గా ఉంటేనే మంచింది. లేదంటే చాలా సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.

కన్యరాశి

కన్యరాశి

ఈ రాశివారు కూడా వారి భాగస్వామి ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎంతో ప్రేమగా మెలిగే క్రమంలో కొన్ని కారణాల వల్ల భాగస్వామి ద్వారా సమస్యల్ని ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాన్ని గౌరవించే భాగస్వామి కన్యరాశి వారు కలిగి ఉంటాయి.

అయితే ఒక్కో సందర్భంలో మీ భాగస్వామి మీ మాట వినకపోవొచ్చు. తను చెప్పిందే వేదం అన్నట్లు ప్రవర్తించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు ఓపికతో ఉండాలి. అలా కాదని భాగస్వామితో గొడవ పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అనవసరంగా అనుమానించే అవకాశం కూడా ఉంది. అందువల్ల మీరూ జాగ్రత్తగా ఉండండి.

వృషభ రాశి

వృషభ రాశి

ఈ రాశి వారు కూడా తమ భాగస్వామి విషయంలో కాస్త సమస్యలు ఎదుర్కొంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే మీ దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. మీరు మీ భార్యతో సెక్స్ వల్ కాస్త ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అలాగే మీ భార్య మీతో దురుసుగా వ్యవహరించే అవకాశం ఉంది. అందువల్ల మీరు మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

English summary

Men of these 3 zodiac signs turn out to be WORST life partners!

Men of these 3 zodiac signs turn out to be WORST life partners!