మిస్ట‌రీ పెయింటింగ్ ఇళ్ల‌ను త‌గ‌ల‌బెట్టేసింది! ఎక్క‌డ‌? !

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

ప్ర‌పంచంలో ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. వాటికి స‌రైన వివ‌ర‌ణ‌, స‌మాధానాలు దొర‌క‌వు. అవి అలాగే మిస్ట‌రీగా మిగిలిపోతుంటాయి.

అలాంటి మిస‌ర్టీ కేసునే ఇప్పుడు మ‌నం చ‌ద‌వ‌బోతున్నాం. ఒక ఏడిచే బాలుడు ఉన్న‌పెయింటింగ్ గురించే ఇప్పుడు మ‌నం మాట్లాడ‌బోతున్నాం. దీని వ‌ల్ల ఇట‌లీలో ఎన్నో ఇళ్లు కాలిపోయాయి.

cursed paintings

ఈ పెయింటింగ్ ఎంత ఫేమ‌స్ అయిందంటే చిత్ర‌కారుడు ఇలాంటి ల‌క్ష‌ల పెయింటింగ్ల‌ను గీయాల్సి వ‌చ్చింది. విచిత్ర‌మేమిటంటే అత‌డు గీసిన ప్ర‌తిసారీ అది కాలిపోయేది.

అస‌లీ మిస్ట‌రీ పెయింటింగ్ వెనుక క‌థేమిటో చూద్దాం ప‌దండి...

1985లో త‌యారైంది

1985లో త‌యారైంది

ఈ మిస్ట‌రీ పెయింటింగ్‌ను ఇట‌లీకి చెందిన ఆర్టిస్టు గియోవ‌రీ బ్ర‌గోలిన్ సెప్టెంబ‌ర్ 1985న వేశాడు. చిన్న బేబి మొహాన్ని వేశాడు. అది ఏడుస్తుంది. ఈ పెయింటింగ్ ఎంత‌లా ఫేమ‌స్ అయిందంటే అత‌డు కొన్ని ల‌క్ష‌లు అలాంటివి గీయాల్సి వ‌చ్చింది. అంత‌గా డిమాండ్ ఏర్ప‌డింది.

ఏడిచే బాబు..

ఏడిచే బాబు..

పెయింటింగ్ సిరీస్‌కు ఏడిచే బాబు అని పేరు పెట్టారు. ఇంగ్లిష్‌లో ద క్రైయింగ్ బాయ్ అని అర్థం. అయితే ఇది కొన్న‌వారు వాళ్లింటికి తీసుకెళ్లిన కొన్ని రోజుల‌కు వారి ఇల్లు త‌గ‌ల‌బ‌డిపోయేదిట‌.

ఇళ్లు త‌గ‌ల‌బ‌డిపోయేవి..

ఇళ్లు త‌గ‌ల‌బ‌డిపోయేవి..

ఇది చాలా విచిత్రంగా అనిపించినా... పెయింటింగ్ ఉన్న ఇళ్లు మాత్రం కొన్ని రోజుల త‌ర్వాత ఎటువంటి కార‌ణాలు లేకుండా త‌గ‌ల‌బ‌డి పోయేవ‌ట‌. షాకింగ్ నిజ‌మేమిటంటే మొత్తం ఇల్లంతా కాలిపోయినా పెయింటింగ్ మాత్రం చెక్కుచెద‌ర‌కుండా ఉండేదిట‌.

మిస్ట‌రీని క‌నుగొన్న‌ది...

మిస్ట‌రీని క‌నుగొన్న‌ది...

దిన‌ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన నివేదిక‌ల ప్ర‌కారం అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చిన ప్ర‌తిసారి వాళ్లు మంట‌ల‌ను ఆర్పివేయ‌గా ఈ ఫొటో మాత్రం చెక్కు చెద‌ర‌కుండా ఉండ‌డాన్ని గ‌మ‌నించారు.

శాప‌గ్ర‌స్తంగా...

శాప‌గ్ర‌స్తంగా...

అగ్నిమాప‌క సిబ్బంది ఇలా ఆ నోటా ఈ నోటా చెప్పేస‌రికి వార్త దావానంలా వ్యాపించింది. ఐతే మొద‌ట్లో ఇదో మూఢ‌న‌మ్మ‌క‌మ‌ని కొట్టిపారేసేవారు. త‌ర్వాత వ‌రుస సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో న‌మ్మ‌క త‌ప్ప‌లేదు. ఆ త‌ర్వాత ఈ పెయింటింగ్ శాప‌గ్ర‌స్తం చెందిందని భావించారు.

దావానంలా...

దావానంలా...

వార్త దావానంలా వ్యాపించాక అంద‌రి ఇళ్ల‌లో ఉన్న ఈ పెయింటింగ్‌ను బ‌య‌ట‌కు ప‌డేయ‌డం మొద‌లుపెట్టారు. విచిత్రంగా ఆ త‌ర్వాత క్ర‌మంగా ఇళ్లు కాలిపోవ‌డాలు త‌గ్గిపోయాయి.

నిషేధించారు..

నిషేధించారు..

ఈ పెయింటింగ్ వ‌ల్ల కాలిపోయాయో లేదో తెలీదు కానీ .. మొత్తానికి ఈ చిత్త‌రువును ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిషేధించారు.

ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ గురించి మీరేమంటారు. నిజ‌మేనా ... క‌ల్పిత‌మా...మీ అభిప్రాయాల‌ను కామెంట్ సెక్ష‌న్‌లో రాయ‌గ‌ల‌రు.

English summary

This Cursed Painting of A Small Kid Burnt Many Houses In Italy

Will you ever dare to purchase a painting that can destroy your house instead of enhancing its beauty? Well not really, right? But people unknowingly bought a painting which burnt houses down...