ప్రపంచ అతిపెద్ద మొసళ్ళ నివాస స్ధలాలు & కబేళాల చిత్రాలు!

By Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ప్రజలు అచ్చంగా తోలుతో చేసిన ఏ వస్తువునైనా ఇష్టపడతారు! అది ఎంత ఖరీదు చేస్తుంది అనేది నేటి ఫ్యాషన్, జంతువుల చర్మం మీద ఆధారపడి ఇలాంటి స్టైలిష్ ఉత్పత్తులను తయారుచేయడానికి ఉపయోగిస్తారు!

జంతువులు ఉండే ప్రదేశం, కబేళాల చిత్రాలు కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ చిత్రాలలో ఆ జంతువుల, సరీసృపాల ద్వారా తోలు తయారుచేసే విధానంలో వాటి బాధ కనపడుతుంది.

కలలో ఏ జంతువు కనిపిస్తే దేనికి సంకేతం..!?

ఇక్కడ ఎన్నో కబేళాలతో నిండి ఉన్నప్రపంచంలోనే అతిపెద్ద మొసళ్ళ నివాస స్ధలాల ఆందోళన పరిచే కొన్ని చిత్రాలు, మరికొన్ని ఉన్నాయి....

ఈ ప్రదేశం గురించి మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి!

ఇది కేవలం ఒక ఫామ్ మాత్రమే కాదు!

ఇది కేవలం ఒక ఫామ్ మాత్రమే కాదు!

థాయిలాండ్ మొత్తంలో 1000 జంతువుల ఫామ్స్ ఉన్నాయి, ఈ ఫార్మ్స్ లో దాదాపు 1.2 మిలియన్ మొసళ్ళు ఉన్నాయి. ఈ ఫార్మ్స్ లో కబేళాలు కూడా ఎక్కువే ఉన్నాయి, వ్యాపారం విజయవంతంగా నడవడానికి ఇవి సహాయపడతాయి.

శ్రీ ఆయుతయ ఫామ్...

శ్రీ ఆయుతయ ఫామ్...

శ్రీ అయుతయ అనేది అతిపెద్ద ఫామ్స్ లో ఒకటి, "మా వద్ద అన్ని రకాల ఫామ్స్ ఉన్నాయి, ప్రజల కోసం ఉద్యోగాలు కల్పించాము, దేశం కోసం ఆదాయాన్ని సృష్టించము," అని దీని యజమాని విచియన్ రాన్జ్నేట్ చెప్పారు. ఈ ఫామ్ లో మొత్తం 1,50,000 మొసళ్ళు ఉన్నట్టు అంచనా వేసారు.

నమ్మశక్యం కానీ ఆశ్చర్యం కలిగించే అరుదైన బ్లాక్ అనిమల్స్ ..!!

ఈ ఫామ్స్ ఎన్నో సదుపాయాలను కలిగి ఉన్నాయి!

ఈ ఫామ్స్ ఎన్నో సదుపాయాలను కలిగి ఉన్నాయి!

ఈ ఫామ్స్ లో ఎక్కువ సరీసృపాలను పెంచడం, చంపడం, చర్మం శుద్ధిచేసి, వాటిని ఎగుమతి చెయడ౦ ప్రతిదీ చేస్తాయి. మొసళ్ళ తోలు ఉత్పత్తులలో అనేక రకాలు ఉన్నాయి, ఇందులో అతి ప్రాముఖ్యత కలిగిన వస్తువు బిర్కిన్-శైలితో కూడిన హాండ్ బాగ్ లు, దీని ధర చాలా ఎక్కువ ఉంటుంది!

ఈ ఫామ్స్ చంపడానికి అనుమతి పొంది ఉంటాయి!

ఈ ఫామ్స్ చంపడానికి అనుమతి పొంది ఉంటాయి!

వీటిలో ఎక్కువ ఫామ్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండాన్జేరేడ్ స్పెసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా (CITES) తో నమోదు పొంది ఉంటాయి. ఇది చైనా లోని అతిపెద్ద కొనుగోలుదారుతో సహా, అంతరించిపోతున్న సియమీస్ మొసలి జాతుల లోని ఉత్పత్తులను చట్టబద్ధంగా ఎగుమతి చేయడానికి అనుమతిస్తుంది.

ప్రజలు ఈ ఫామ్స్ ని సందర్శించవచ్చు!

ప్రజలు ఈ ఫామ్స్ ని సందర్శించవచ్చు!

ప్రపంచంమొత్తంలోని ప్రజలు ఈ మూడు పెద్ద ఫామ్స్ ని చూడవచ్చు, ఇక్కడ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి కొన్ని క్రాక్ షోస్ కూడా జరుగుతాయి. అంతేకాకుండా, పర్యాటకులు మొసళ్ళకు ఆహారాన్ని కూడా తినిపించడానికి అనుమతిస్తారు. వారు అక్కడ ప్రశాంతంగా కూర్చుని పెద్ద పెద్ద రేప్తిల్స్ ని కూడా చూడవచ్చు.

మనుష్యులు కుక్కలంటేనే ఎక్కువగా ఇష్టపడుతారెందుకు..?

క్రాక్స్ గురించి ప్రతిదీ విలువైనదే!

క్రాక్స్ గురించి ప్రతిదీ విలువైనదే!

మొసళ్ళ మాంసం కిలో 300 భట్ వరకు విక్రయించబడుతుందని చెప్పబడింది! ఇది మాంసానికి మాత్రమే ఉపయోగకరమైనది కాదు, దాని పిత్తం, రక్తాన్ని కూడా మాత్రలు చేయడానికి ఉపయోగిస్తారు, ఈ మాత్రలు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని నమ్మకం!

ఆ మాంసం చాలా మృదువుగా ఉంటుంది!

ఆ మాంసం చాలా మృదువుగా ఉంటుంది!

క్రాక్స్ చాలా మృదువుగా ఉంటుంది, ఇవి చికెన్ తల రుచితో ఉంటుంది. ఇది చాలా సాధారణ విషయాలలో ఒకటి, అధికారులు వారి అన్ని ఉత్పత్తులలో అత్యంత ఆరోగ్యకరమైన మొసళ్ళను ఉపయోగించి మంచివి తయారుచేస్తారు. అది మాంసం, చర్మం లేదా దాని రక్తమైనా, ఇది భారీమోత్తంలో లాభాలను ఇచ్చి, నాణ్యతలో విలువలతో కూడుకొని ఉంది!

కొత్తగా పొదగబడిన మొసళ్ళు!

కొత్తగా పొదగబడిన మొసళ్ళు!

మొసళ్ళ గుడ్లను చాలా జాగ్రత్తగా పొదుగుతారు, అక్కడ పనిచేసేవారు మొసళ్ళు తమ షెల్ నుండి శుభ్రంగా బైటికి రావడానికి కూడా సహాయపడతారు. కానీ చివరికి, వారి స్వలాభం కోసం వాటిని పెంచడం అనేది నిజంగా స్వార్ధంతో కూడినది, అమానుషం!

వారు తయారుచేసే తోలు ఉత్పత్తులు...

వారు తయారుచేసే తోలు ఉత్పత్తులు...

పర్యాటకులు మొసళ్ళ పొడి చర్మాన్ని అలాగే డై చేసిన తోలు జాకెట్లు, వాలేట్లు, ప్రపంచం మొత్తం ప్రసిద్ది చెందిన బాగ్ లు కొనడానికి ఎంతో ఇష్టపడతారు, ఇవన్నీ రేప్టైల్ చర్మం ఉపయోగించి తయారుచేసినవి.

వీటిపై మీ అభిప్రాయాలను ఈ కింది వ్యాఖ్యన విభాగంలో తెలియచేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Pictures Of World's Biggest Crocodile Farms & Slaughter Houses!

    This is what happens in a slaughter house and crocodile farm! Check it out!
    Story first published: Sunday, July 9, 2017, 16:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more