దెయ్యాలకు, ఆత్మలకు కొలువైన ఉన్న ఆ ఇళ్లను, భవనాలను ఒక్కసారి చుట్టొద్దామా..

Posted By: Bharath Reddy
Subscribe to Boldsky

దెయ్యాలు ఇంకా ఉన్నాయా? అవి కూడా నివాసాలు ఏర్పరుచుకుంటాయా? అంటే అవుననే చెప్పాల్సి వస్తుందేమో. ప్రపంచవ్యాప్తంగా అనేక హంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కొన్ని అడవులు, కొన్ని స్మారక చిహ్నాలు, కొన్ని ఇళ్లు ఉన్నాయి.

ఒకప్పుడు ప్రజల నివాసాలుగా ఉన్న భవనాలు ప్రస్తుతం హంటెడ్ ఇళ్లుగా మారాయి. గతంలో ఒక సమయంలో అక్కడ జరిగిన హింసాత్మక హత్యలు, ఆత్మహత్యలు, శిరచ్ఛేదనాలు వంటి వల్ల ఇవి హంటెడ్ ఇళ్లుగా మారాయి. ఉదాహరణకు జమైకాలోని రోజ్ హాల్ లో అన్నీ పాల్మెర్ తన లైంగిక సంతృప్తి కోసం బ్లాక్ బానిసలను హింసించి చంపేసింది.

భారతదేశంలో భయానికి గురిచేసే టాప్ 8 ప్రదేశాలు

మైర్టల్స్ ప్లాంటేషన్ అనే ప్రాంతం నల్ల జాతీయుల రక్తంతో నిండిపోయిన ఇళ్లు. ఇందులో అతిక్రూరంగా హత్యలు జరిగాయి. అతి దారుణంగా వేధించి ఇక్కడ నల్లజాతీయులను చంపేశారు.

అలాగే లండన్ టవర్ అనేది అప్పట్లో చాలా అన్యాయమైన మరణశిక్షలు విధించే ప్రాంతంగా పేరుగాంచింది. ఇక్కడ శిరచ్ఛేదనాలు విధించేవారు. ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలు లండన్ టవర్ చుట్టూ తిరుగుతుంటాయని చాలామంది నమ్ముతారు.

ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. దెయ్యాలకు, ఆత్మలకు కొలువైన ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆ ఇళ్లను, భవనాలను ఒక్కసారి చుట్టొద్దామా....

లాలోరీ మాన్షన్

లాలోరీ మాన్షన్

ఇది లూసియానాలో ఉంది. ఇది సీరియల్ కిల్లర్ అయిన డెల్ఫిన్ మేరీ లాలోరీకి చెందినది. ఆమె ఈ ఇంటిలో నల్లజాతి బానిసలను అనేకమందిని హింసించి చంపింది. అయితే పోలీసులు చివరకు ఆ మృతదేహాలను కనుగొన్నారు. కానీ లేడీ లాలోరీ మాత్రం పారిపోయారు.

తర్వాత చాలామంది ఈ ఇంటిలో ఉండేందకు ప్రయత్నించారు. కానీ ఎవరూ ఉండలేకపోయారు.

జమైకాలో రోజ్ హాల్

జమైకాలో రోజ్ హాల్

జమైకాలోని రోజ్ హాల్ అనే భవనంలో అన్నీ పాల్మెర్ ఆమె నివసించింది. ఈ ఇంటి ప్రాగణం ఒక ఉద్యానవనం మాదిరిగా ఉంటుంది. ఆమె తన చిన్నతనంలో వూడూ అనే విద్యను నేర్చుకుంది. అయితే ఆమెను సంతృప్తి పరచని పురుషులను ఆమె ఆ విద్యతో శిక్షించేది. అలాగే తన భర్తల్లో ముగ్గురిని చంపేసింది. అనేకమంది నల్లజాతి బానిసలను కూడా చంపింది. నేటికి కూడా ఈ భవనం నుంచి మగవారు భయపడుతూ అరుస్తున్నట్లుగా శబ్దాలు వస్తాయి.

టేనస్సీలో బెల్ ఫార్మ్

టేనస్సీలో బెల్ ఫార్మ్

టెన్నెస్సీలోని బెల్ ఫామ్ హౌస్ వద్ద దెయ్యం వేయబడిన కారణంగా మరణించినట్లు మాత్రమే నివేదించబడింది. బెల్ కుటుంబానికి చెందిన వారి నివాసం 'బెల్ విచ్' వారి పిల్లలను పించిందని, పితరుడిని నిందించి తన మరణానికి దారితీసింది.

అమిటీవిల్లె హౌస్

అమిటీవిల్లె హౌస్

అమిటీవిల్లెలో ఉన్న ఈ ఇల్లు డీఫెయో కుటుంబానికి చెందినది. ఈ కుటుంబానికి చెంిన పెద్ద కొడుకు మొత్తం కుటుంబాన్ని వధించాడు. తర్వాత ఇక్కడికి వెళ్ళిన లుట్జ్ కుటుంబం ఇక్కడ ఒక నెలపాటు కూడా ఉండలేదు. కాథీ లుట్జ్ కు ప్రతి రోజు రాత్రి హత్యలకు సంబంధించిన భయంకరమైన పీడకలలు వచ్చేవి. దీంతో వారు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.

టవర్ ఆఫ్ లండన్

టవర్ ఆఫ్ లండన్

ఒకప్పుడు లండన్ టవర్ బ్రిటీష్ రాజ కుటుంబానికి నివాసం. కానీ, ఇక్కడ అనేక శిరచ్ఛేదనాలు జరిగాయి. ఇప్పటి ఈ భవన గోడలపై దెయ్యం సంచరిస్తూనే ఉంటుందని జనాలు నమ్ముతారు. ఇంతకు దెయ్యంగా తిరుగుతన్న ఆమె ఎవరో కాదు.. క్వీన్ అన్నే బోలీన్. ఆమెను హెన్రీ VIII రాజు హత్య చేశాడు.

దుష్ట శ‌క్తులు మిమ్మ‌ల్ని వ‌దిలిపోవాలంటే...ఈ 10 ప‌నులు చేస్తే చాలు.!

మైర్టల్స్ ప్లాంటేషన్

మైర్టల్స్ ప్లాంటేషన్

ఈ ప్లాంటేషన్లో 10 మంది బానిసల హత్యలు జరిగాయి. ఇప్పటికీ ఇక్కడ దెయ్యం ఉందని అందరూ భావిస్తారు. చోలే అనే వ్యక్తిని ఇక్కడ ఉరి తీశారు. నేటికి కూడా ఇక్కడికి ఎవరైన గెస్ట్స్ వస్తే... మీకు ఎలాంటి సాయం కావాలి.. ఏమైనా కావాలంటే అడగండి అంటూ అరుపులు వినిపిస్తుంటుంటాయంట.

భంగర్ కోట

భంగర్ కోట

రాజస్థాన్ లో భంగర్ కోట ఉంది. సూర్యాస్తమయం తరువాత ఈ కోట సందర్శనకు భారత ప్రభుత్వం సందర్శకులకు అనుమతి ఇవ్వదు. ఈ కోటను నిర్మించిన రాజు అప్పట్లో శపించాడంట. దీని చుట్టు ఉన్నవాళ్లు ఎవరూ కూడా సంతోషంగా జీవించలేరన్నాడంట. అందువల్ల అప్పట్లో కోట చుట్టూ ఉన్న కుగ్రామం కరువుతో అల్లాడిపోయింది. అప్పటి నుంచి భంగర్ వెంట శాపం వెంటాడుతూనే ఉంది.

ఎడిన్బర్గ్ కోట

ఎడిన్బర్గ్ కోట

ఈ కోట 12 వ శతాబ్దం నుంచి స్కాటిష్ రాయల్ కుటుంబానికి నివాసంగా ఉంది. అయితే ఇక్కడ అనేక వ్యక్తులు మరణించారు. ఆధునిక సామగ్రితో పారానార్మల్ శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు కూడా చేపట్టారు. నిజంగానే కోటలో కొన్ని దెయ్యాలున్నాయని వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

English summary

Haunted Houses | Haunted Places | Ghost Stories

Haunted houses are there in this world for real. When haunted places are someone's residence, then it is very scary. These are the really haunted houses