ఆభరణాల కలలొస్తున్నాయా? అయితే ఇది మీకోసమే!

By: Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరికీ నిద్రలో దాదాపుగా కలలు వస్తుంటాయి. అయితే సైన్స్ ప్రకారం.. మనం మేల్కొన్న తర్వాత అవి ఏవి కూడా మనకు గుర్తుండవంట. మనకు వచ్చే కలలు దాదాపుగా భయంకరమైన విషయాలకు సంబంధించిగానీ, ఫన్నీ విషయాలుగానీ, కాస్త ప్రత్యేకమైన విగా ఉండొచ్చు. చాలామందికి ఎక్కువగా పీడకలలు వస్తుంటాయి.

అయితే కొందరికి మాత్రం కలలో ఆభరణాలు కూడా వస్తుంటాయి. మరి కలలో ఆభరణాలు కనిపించడానికి కారణాలు ఏమిటి? అలా కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకుందామా ?

ఖర్చులు, వ్యయం

ఖర్చులు, వ్యయం

మీకు ఆభరణాలకు సంబంధించిన కలలు వస్తే మీకు ఖర్చులు పెరగనున్నాయని అర్థం. భారీ వ్యయాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. ఈ ఖర్చులు మీకు కుటుంబానికి సంబంధించినవి కావొచ్చు. లేదంటే మీ ఇంట్లో జరగబోయే వివాహ వేడుకకు సంబంధించనవి కావొచ్చు.

సాధారణంగా మన ఇంట్లో చేపట్టబోయే వేడుకలకు సంబంధించి మనం పెట్టబోయే ఖర్చులు ఎక్కవ కావొచ్చు. మీకు కలలో ఆభరణాలు కనిపించనట్లయితే మీరు మరి ఖర్చులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.

ఆభరణాలను బహుమతిగా ఇస్తున్నట్లు కల వచ్చిందా?

ఆభరణాలను బహుమతిగా ఇస్తున్నట్లు కల వచ్చిందా?

ఒకవేళ మీకు కలలో ఎవరైనా ఆభరణాలను బహుమతిగా ఇస్తున్నట్లు కల వస్తే త్వరలోనే మీరు మంచి లాభాలను పొందనున్నారని అర్థం. మీరు చేస్తున్న పని లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు త్వరలోనే అత్యధిక ఆదాయాలు పొందే అవకాశం ఉంది.

బంగారం & వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి సులభమైన చిట్కాలు..!!

నగలు ధరించిన వారిని చూస్తున్నట్లు..

నగలు ధరించిన వారిని చూస్తున్నట్లు..

నగలకు సంబంధించిన కలలన్నీ కేవలం మంచివి మాత్రమే ఉండవు. కొన్ని కీడు చేసేవి కూడా ఉంటాయి. ఆభరణాలు ధరించి ఉన్న వ్యక్తిని చూస్తున్నట్లు మీకు కల వచ్చిందనుకో... ఇక మీ దగ్గరి బంధువు త్వరలోనే చనిపోతారంట. అలాగే మీకు తెలిసిన వ్యక్తి ఉద్యోగం కోల్పొయే అవకాశం కూడా ఉందట. అందువల్ల ఆభరణాలకు సంబంధించిన అన్ని కలలు మంచివి కావని మీరు గుర్తించుకోవాలి.

నగలు ధరించిన వివాహితను చూస్తున్నట్లు..

నగలు ధరించిన వివాహితను చూస్తున్నట్లు..

మీరు బాగా ఆభరణాలు అలంకరించుకున్న వివాహితను చూసినట్లుగా కల వచ్చిదంటే కాస్త సంతోషకరమైన విషయం. మీ కుటుంబంలో, మీకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని దీని అర్థం. అలాగే మీకు తెలిసిన వారికి త్వరలో పిల్లలు పుడతారనే విషయాన్ని కూడా ఈ కల తెలుపుతుంది.

ఆభరణాలకు సంబంధించి ఇంకొన్ని విషయాలు..

ఆభరణాలకు సంబంధించి ఇంకొన్ని విషయాలు..

ఆభరణాలు కలలో కనపడితే మాత్రమే ప్రయోజనాలు కలుగుతాయనేమీ లేదు. వీటి వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి.

ఇవి సమాజంలో హుందాతనాన్ని ఇస్తాయి. ఇక బాగా రిచ్ గా ఉండే ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలనేమీ లేదు. మీ తాకత్తుకు తగ్గట్లుగా సింపుల్ గా ఉండే ఆభరణాలును ధరించడమే మంచిది.

గోల్డ్ (బంగారం) గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!

ఈ సూచనలూ అవసరం

ఈ సూచనలూ అవసరం

మీకు ఆభరణాలు ధరించే విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత ఖరీదైన ఆభరణాలను ధరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ రద్దీ లేని, జనం లేని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఖరీదైన ఆభరణాలను ధరించొచ్చు. ఆభరణాలు అనేవి మీకు సమాజంలో కాస్త గౌరవాన్ని కూడా తెచ్చిపెడతాయి. అందువల్ల వాటిని ధరించే ముందు ఒక్కసారి ఆలోచించండి.

English summary

Seeing jewellery in dreams. What does it mean?

You will always have many kinds of dreams. In some dreams, if you feel good then you will also feel scared in some dreams. When we come to dream we see a lot of things and people in them.
Story first published: Tuesday, November 7, 2017, 10:50 [IST]
Subscribe Newsletter