ఒరంగుటాన్ ( కోతి) ని శృంగార బానిస గా ఆ గ్రామ ప్రజలు ఎలా వాడుకున్నారో తెలుసా..?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కొంత మంది మనుషులు ఈ ప్రపంచంలో డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు , అనే విషయాన్ని రుజువు చేస్తూ ఒక ప్రదేశంలో చోటుచేసుకున్న సంఘటన ప్రపంచాన్నే విస్తుపోయేలా చేసింది. చాలా మంది ప్రజలు ఈ మధ్య కాలంలో మూగ జీవాల హక్కులను కాపాడటానికి వివిధ సంస్థలను స్థాపించి మరి పోరాడుతున్నారు.

జంతువులను హింసించకూడదని, వాటికి మనస్సు ఉంటుందని ఎంతగా చెప్పినా , కొంత మంది మనుషుల్లో ఉన్న రాక్షసులకు ఈ విషయం అర్థం కావటం లేదు.ఈ భూ ప్రపంచంలో అందరి కంటే నీచమైన జాతి మానవ జాతి అని కొంత మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. దానికి కారణం మనుషుల్లో చాలా మంది స్వార్థంతో తన గురించి , తప్ప మిగతా ఏ ఒక్క ప్రాణి గురించి ఆలోచించకుండా మిగతా ప్రాణుల వినాశనానికి కారణం అవుతున్నాడు కాబట్టి.

కొన్ని ఫోటోలు మనల్ని ఎమోషనల్ చేస్తాయి

ఇప్పుడు మీరు చదవ బోయే సంఘటన ఇంతకముందెప్పుడూ విని ఉండరు, ఊహకు కూడా అందని వికృత చేష్టలతో మనిషి డబ్బు కోసం ఎంత నీచానికి దిగజారుతాడో తెలియ చెప్పే సంఘటన ఇది.

వ్యభిచారం ద్వారా డబ్బుని సంపాదించటానికి ఒరంగుటాన్ (కోతుల సంతతిలో ఒక జాతి)ని ఎలా వాడుకున్నారంటే....

ఒరంగుటాన్ గురించి:

ఒరంగుటాన్ గురించి:

దగ్గర్లో ఉన్న అడవి నుండి బోర్నెయో అనే ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక మహిళ ఒక ఒరంగుటాన్ ని తెచ్చుకొని , పోనీ అనే పేరుతో తన ఇంటిలో నిర్బంధించింది . ఆ కోతి ని ప్రేమ తో ఒక ఇంటి జంతువు లా పెంచుకుందామని తెచ్చుకోలేదు , ఆ కోతితో వ్యభిచారం చేయించడం ద్వారా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఆ కోతి ని తన ఇంటికి తెచ్చుకుంది.

Image Source

భారీగా డబ్బులు దోచుకోవడానికి ఇదో మార్గం అనుకుంది

భారీగా డబ్బులు దోచుకోవడానికి ఇదో మార్గం అనుకుంది

ఆ ఒరంగుటాన్ తో శృంగారం చేయటానికి ఆ గ్రామ ప్రజలు విపరీతమైన ఆసక్తి కనబరిచేవారు . భారీగా డబ్బులు ఇచ్చి మరి ఆ కోతి తో శృంగారం జరిపేవారు . ఆ కోతి ఎంతలా శృంగారానికి బానిసగా మారిపోయిందంటే, ఎవరైనా మగవాడు వస్తే చాలు శృంగారం చేయమని వెన్నక్కి తిరిగి నిల్చునేది.

Image Source

నరకం అనుభవించిన పోనీ :

నరకం అనుభవించిన పోనీ :

పోనీ అందంగా కనపడాలనే ఉద్దేశ్యంతో తన శరీరం పై ఉన్న వెంట్రుకలను తొలగించారు. ఇలా చేయటం వల్ల పోనీకి అనేకరకమైన చర్మ వ్యాధులు సోకాయి. అంతే కాకుండా రక రకాల పురుగులు , దోమలు కుట్టడం ద్వారా తరచూ అనారోగ్యం బారిన పడేది.

Image Source

స్టిప్పర్స్ (బార్ గర్ల్స్) మీద షాకింగ్ నిజాలు, అవి తెలిసాక మీరు వారిని గౌరవిస్తారు.

ప్రాణాలకు తెగించి పోనీని కాపాడారు:

ప్రాణాలకు తెగించి పోనీని కాపాడారు:

ఆ గ్రామంలో నరకం అనుభవిస్తున్న పోనీని కాపడటానికి ఎన్నో సార్లు పోలీస్ లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోలీస్ లు వచ్చిన ప్రతి సారి ఆ గ్రామస్తులు విష పూరితమైన కత్తులు, తుపాకులతో బెదిరించి తీవ్రంగా ప్రతిఘటించేవారు.

Image Source

చివరకు విడిపించగలిగారు

చివరకు విడిపించగలిగారు

ఎంతో మంది జంతు సంస్థల సభ్యులు ఆ గ్రామస్థులకు నచ్చచెప్పాలని చూసిన ఫలితం లేదు. దీంతో విసిగిపోయిన జంతు సంరక్షణ సభ్యులు , చాలా మంది అత్యాధునిక ఆయుధాలను కలిగిన పోలీసులను వెంటబెట్టుకొని ఎంతో సాహసంతో , తెగువ చూపించి ఆ నరకకూపం నుండి పోనీని రక్షించారు . అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనం సృష్టించింది.

Image Source

పోనీ గతాన్ని మరచిపోయి మాములు కోతిగా మారటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే:

పోనీ గతాన్ని మరచిపోయి మాములు కోతిగా మారటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే:

ఈ సంఘటన 2003 లో చోటుచేసుకుంది. ఇన్ని సంవత్సరాలు ఆ నరక కూపంలో ఉండటంతో పోనీ లో ఒరంగుటాన్ ( కోతి సంతతిలో ఒక జాతి ) కి ఉండవలసిన సహజ సిద్ధమైన లక్షణాలు కోల్పోయింది. ఎవరన్నా ఇస్తే తినటం తప్ప, తనకు తానుగా చెట్లు ఎక్కి ఆనందంగా బ్రతకటానికి, తన ఆహారాన్ని తనే సంపాదించుకోవడం మరచిపోయింది. తన సహజ లక్షణాలతో ఒక ఒరంగుటాన్ గా మారటానికి 10 సంవత్సరాలు పట్టింది .

డబ్బు కోసం మనుషులు ఎంత చెండాలమైన పని అయినా చేస్తారు , తమ ఆనందం కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడతారు అనే విషయాన్ని తెలియజేస్తూ , మనిషి కంటే కూడా కొన్ని విషయాలలో జంతువులే నయం అని అనిపించేలా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం .

Image Source

English summary

The Story Of An Orangutan Who Was Used As A Sex Slave!

The Story Of An Orangutan Who Was Used As A Sex Slave! ,Poor orangutan was used as a sex slave and being abused. Every time a man went near her, she would turn around, present herself and wait for the man to hav
Story first published: Thursday, August 3, 2017, 20:00 [IST]
Subscribe Newsletter