For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ

ఏ రాశివారు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారనేది చాలా ఆసక్తికరమైన విషయం. అన్ని రాశుల్లో ఇక్కడ మొదట ఇచ్చిన నాలుగు రాశుల వారు కాస్త వినూత్నంగా ఉంటారు.

By Bharath
|

జ్యోతిష్యశాస్త్రం రాశుల ప్రకారం ఒక్కో వ్యక్తి ఒక్కోరకమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కొన్ని రాశుల వారు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ రాశివారు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారనేది చాలా ఆసక్తికరమైన విషయం. అన్ని రాశుల్లో ఇక్కడ మొదట ఇచ్చిన నాలుగు రాశుల వారు కాస్త వినూత్నంగా ఉంటారు.

వీరు ఎంత పెద్ద సమూహంలో ఉన్న వారి లీడర్ షిప్ క్వాలిటీని ప్రదర్శిస్తుంటారు. ఆ నాలుగు రాశుల్లో నాయకత్వ లక్షణాలను మీరూ తెలుసుకోండి. మీరూ కూడా ఆ రాశికి చెందిన వారై ఉండొచ్చు కూడా. అలాగే మిగతా రాశుల వారి గుణగణాలు కూడా మీరూ తెలుసుకోవొచ్చు.

these zodiac that are so good at leadership
2. మేషం

2. మేషం

మేషరాశి వారు అందరితో మాట్లాడే గుణం కలిగి ఉంటారు. వీరు కలవిడగా ఉంటారు. వీరు తమ తోటి వారు, తెలిసిన వారు, స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలుస్తారు. వారిలో విశ్వాసాన్ని కలగిస్తారు. వారికి మంచి భరోసానిస్తారు. దీంతో వీరు ఎక్కడున్నా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వీరికి అందరి దగ్గరి మంచి పేరు ఉంటుంది. వీరిలో మంచి నాయకత్వ లక్షణాలుంటాయి. అందరి మన్ననలు పొందేలా వీరి ప్రవర్తన ఉంటుంది.

3. వృషభం

3. వృషభం

వృషభరాశి వారు కూడా ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఎక్కడైనా ఇన్ చార్జి గా ఉన్నట్లయితే వారి కింద ఉండేవారితో స్నేహితులుగానే వ్యవహరిస్తారు గానీ బాస్ లుగా ప్రవర్తించరు. వీరు సహజంగానే మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వారి వల్ల ఎలాంటి తప్పు జరగకూడదని భావిస్తారు. అన్ని విషయాలకు బాధ్యత వహించడంలో ముందుంటారు. వీరు మంచి సలహాలు కూడా ఇవ్వగలరు. పక్కవారు ఆపదలో ఉంటే మంచి ఐడియా ఇచ్చి వారిని కష్టాల నుంచి గట్టెక్కిచ్చే గుణం వీరిలో ఉంటుంది.

MOST READ:ఇలా చేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చుMOST READ:ఇలా చేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు

4. సింహరాశి

4. సింహరాశి

సింహరాశి వారు పుట్టుకతోనే మంచి నాయకులుగా ఉంటారు. వీళ్లకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించకున్నా కూడా వాళ్లు ఉండే చోట కచ్చితంగా లీడర్స్ గా ప్రవర్తిస్తుంటారు. పక్కవారికి ఏ కష్టమొచ్చినా దాన్ని నుంచి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తుంటారు. సాధారణంగా సింహరాశి వాళల్లో గొప్ప నాయకులు చాలా మందే ఉంటారు. వీళ్లు బాధ్యత వహించే సమూహం మంచి మార్గంలో వెళ్తుంది. వీరు మంచి నాయకులుగా అందరితో ప్రశంసలు పొందుతారు.

5. మకరం

5. మకరం

మకరరాశి వారు ఎక్కువగా స్వీయ-నియంత్రణ కలిగి ఉంటారు.

వీరిలో మంచి నాయకత్వ లక్షణాలుంటాయి. వీరు కాస్త డిఫరెంట్ గా ఆలోచించేతత్వం కలిగి ఉంటారు. వీరు తాము ఎక్కడ కూడా తగ్గకూడదని భావిస్తూ ఉంటారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంటారు.

6. ఇతర రాశుల వారు

6. ఇతర రాశుల వారు

పైన పేర్కొన్న నాలుగు రాశుల వారు మంచి న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఎక్కడైనా తమ లీడర్ షిప్ ను ప్రదర్శించగలరు. అలాగే మిగతా రాశుల వారు కూడా చాలా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. మరి ఆ రాశుల్లో మీది ఉంటే వాటి గురించి కూడా తెలుసుకోండి.

7. మిథునరాశి

7. మిథునరాశి

ఈ రాశి వారు కూడా ఇంట్లో చక్రం తిప్పుతుంటారు. వీరు జాక్ ఆఫ్ ఆల్ గా అంటే అన్నింట్లో ఆరితేరి ఉంటారు. వీరు జీవితంలో సక్సెస్ ఫుల్ గా వెళ్లేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళిక రూపొందించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరినీ అంచనా వేయగల గుణం వీరికి ఉంటుంది.

8. కర్కాటక రాశి

8. కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు కూడా మంచి నాయకత్వ లక్షణాలు కలగి ఉంటారు. వీరు సాధారణంగా ఇంట్లో కింగ్ ల్లా ఉంటారు. ప్రతి విషయాన్ని డీల్ చేసే లక్షణం వీరిలో ఉంటుంది. వీరు ఇతరులను అనుసరించడానికి ఎక్కువగా ఇష్టపడరు. వీరు నమ్మిన వారిపై మంచి విశ్వాసంతో ఉంటారు.

MOST READ:ఆస్త్మాకు కారణమయ్యే వీటికి దూరం..దూరం..MOST READ:ఆస్త్మాకు కారణమయ్యే వీటికి దూరం..దూరం..

9. కన్య

9. కన్య

వీరి మంచి టీమ్ లీడర్స్ ఉంటారు. వారి కింద ఉన్న టీమ్ మెంబర్స్ ని ఇబ్బందిపెట్టకుండా అన్ని రకాల పనులు చేయించగల సత్తా వీరిలో ఉంటుంది. అలాగే ఎలాంటి కష్ట సమయాన్ని అయినా వీరు ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వీరు ఏ సమస్య వచ్చినా సులువుగా దాన్ని పరిష్కరించుకోగలరు.

దాదాపుగా ఎక్కువగా ఈ రాశికి చెందిన వారే టీమ్ లీడర్లుగా ఉంటారు. వీళ్లకు ముందుచూపు కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించగల సత్తా వీరికి ఉంటుంది.

10. తులరాశి

10. తులరాశి

తులరాశి వారు న్యాయంగా ఆలోచిస్తారు. వీరు ప్రతి విషయాన్ని న్యాయంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. అంతేకాదు వీళ్లు పరిస్థితులకు అనుగుణంగా దేనికైనా సిద్ధమవుతారు. సంఘాలకు న్యాయకత్వం వహించే కెపాసిటీ వీరికి ఉంటుంది.

అవసరమైనప్పుడు కార్మికులందరినీ ఏకం చేసి కదం తొక్కేలా చేసే గుణం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఓ శక్తిలా ఉంటారు. వీరు తలుచుకుంటే అంతేసంగతులు. ఏ ఉద్యమాన్నైనా చాకచక్యంతో ముందుకు తీసుకెళ్లే గుణం వీరికి ఉంటుంది.

11. వృశ్చిక రాశి

11. వృశ్చిక రాశి

వీరు పుట్టుకతోనే న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అయితే వీరు అవసరమైతే తప్ప ఆ పాత్ర తీసుకోవడానికి ముందుకురారు. వీరు ఏ పనినైనా పూర్తి చేయగల సత్తా కలిగి ఉంటారు. వీరి న్యాయకత్వం చాలా బలంగా ఉంటుంది. వీరు సందర్భం వచ్చినప్పుడే మాట్లాడుతారు. మిగతా సమయంలో చాలా సైలెంట్ గా ఉంటారు. ఇంట్లో, వీరు పని చేసే ప్రాంతంలో వీరు చాలా చాలా కామ్ గా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు.

12. ధనుస్సు

12. ధనుస్సు

ధనుస్సురాశి వారు ఎక్కువగా తాత్విక భావాలు కలిగి ఉంటారు. వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు అహర్నిశలు కష్టపడే గుణం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సహోద్యోగులుగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పక్కన ఉండే వారికి వీరు ఎలాంటి హాని చేయరు. వీళ్లు ఎక్కువగా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు. ఎవరైనా వీరిపై ఆంక్షలు పెడితే సహించలేరు. చాలా హ్యాపీగా లైఫ్ సాగాలని కోరుకుంటారు.

13. కుంభం

13. కుంభం

కుంభరాశి వారు సలహాలు ఇవ్వడంలో సిద్ధహస్తులు. వీరికి బాగా ఆలోచించగల శక్తి ఉంటుంది. వీరు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బాగా ఆలోచించగల గుణం వీరు కలిగి ఉంటారు. వీరు టెక్నాలజీపరంగా మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు. తమకు తెలియని విషయాలను తెలుసుకుని వాటిని పాటిస్తారు.

MOST READ:సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీ బెటర్ అనడానికి గల 8 కారణాలుMOST READ:సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీ బెటర్ అనడానికి గల 8 కారణాలు

14. మీనరాశి

14. మీనరాశి

ఈ రాశి వారు మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వీరు అందరితో కలవిడిగా ఉండారు. అందరిలో అట్రాక్టివ్ గా ఉంటారు. వీరు ఒక టీమ్ ను ఈజీగా డీల్ చేసే గుణం కలిగి ఉంటారు.

English summary

these zodiac that are so good at leadership

These Zodiacs are a natural at leadership qualities - like a boss, really. This one quality makes them unforgettable. Their magnetism is such, you cannot ignore them in a crowd. Here are the four Zodiacs that are so good at leadership qualities, it hurts. Click on to know more...
Desktop Bottom Promotion