చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మృతదేహాలుగా దొరికిన దురదృష్టవంతులు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఈ ప్రపంచం చాలామంది ఒంటరిగా జీవిస్తుంటారు. కొంత మంది వారి జీవితాలను ఒంటరిగా గడపడానికి అలవాటుపడి స్నేహితులు మరియు కుటుంబంతో సంబంధం లేకుండా ఒంటరిగా గడుపుతుంటారు. ఇలాంటి వారికి చివరి క్షణంలో వారి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ వుండరు.

వీరిలో కొందరు ఒంటరిగానే చనిపోతారు. ఇక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే, సంవత్సరాల తరబడి వారు కనిపించకపోయినా వారి గురించి పట్టించుకునే నాధుడు లేకపోవడం!

వారి మరణం తరువాత కూడా, వారి మృతదేహాలు కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే కనుగొన్నారు. వారి మరణం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం వారి పొరుగువారిలో కొందరు వారి గృహాల నుండి దుర్వాసన వస్తున్నా ఎవరూ దాని మీద శ్రద్ధ చూపలేదు.

దురదృష్టవశాత్తు చనిపోయిన కొన్ని సంవత్సరాల తరువాత బయటబడ్డ మృతదేహాలు.. వంటి వార్తలను వింటుంటే మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామో తెలుస్తుంది!

ఇక్కడ ఫోటోలను మంచి ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించడం జరిగింది!

ఆమె డెడ్ బాడీ ఒక సంవత్సరం తరువాత వెలికి తీశారు

ఆమె డెడ్ బాడీ ఒక సంవత్సరం తరువాత వెలికి తీశారు

బార్బరా సాలినాస్-నార్మన్ ఒక కార్యకర్త, రచయిత మరియు ప్రచురణకర్త. 70 సంవత్సరాల వయస్సులోనే ఆమె మరణించింది. ఆమె ఇంటిలో తన శరీరాన్ని కనుగొనేముందు ఆమె శరీరం తన ఇంటిలోనే ఏడాది పాటు వుంది.

అతని మృతదేహం 3 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు

అతని మృతదేహం 3 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు

సైమన్ అలెన్ అనే ఈ వ్యక్తి ఒక ఒంటరివాడు, అతని శరీరం 2013 లో క్లీనర్లచే కనుగొనబడింది, అది కూడా అతను మరణించిన మూడు సంవత్సరాల తర్వాత. అతను ఒక జత సాక్స్ మాత్రమే ధరించాడు, మరియు అతను చేతి కుర్చీ వెనుక కుప్పకూలి ఉండటం జరిగింది.

ఆమె మరణించిన 3 సంవత్సరాల తరువాత బయటపడింది!

ఆమె మరణించిన 3 సంవత్సరాల తరువాత బయటపడింది!

జెనీవా ఛాంబర్స్ అకస్మాత్తుగా మరో ఇంటికి మారి ఉండొచ్చని ఇరుగు పొరుగు వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి ఈ మహిళ 3 సంవత్సరాల పాటు ఆమె ఇంటిలోనే చనిపోయి పడి ఉంది! ఆస్తిని బ్యాంక్ జప్తు చేసినప్పుడు కేవలం ఆమె మృతదేహం మాత్రమే కనుక్కొన్నారు.

3 సంవత్సరాల పాటు చనిపోయి పడున్న ఇద్దరు కవలలు!

3 సంవత్సరాల పాటు చనిపోయి పడున్న ఇద్దరు కవలలు!

ఆండ్రూ మరియు ఆంథోనీ జాన్సన్ 63 ఏళ్ల కవలలు వుండేవాళ్ళు, వారు చేతికి ముసుగులు వేసుకొని తోటపని చేయడం వారి చుట్టుపక్కలవారు గమనించేవాళ్ళు. కానీ అదృశ్యమైన తర్వాత దురదృష్టవశాత్తూ వారిని ఎవరూ చూడలేదు. వారి మృతదేహాలను పోలీసులు 3 సంవత్సరాల తరువాత కనుగొన్నారు. ఇద్దరి కవలల చేతులు కుర్చీలో ఆనుకొని ఉన్నాయి.

అతని మరణం గురించి 4 ఏళ్ళ పాటు తన ఇరుగు పొరుగు వాళ్లకు తెలియదు!

అతని మరణం గురించి 4 ఏళ్ళ పాటు తన ఇరుగు పొరుగు వాళ్లకు తెలియదు!

డేవిడ్ వాకర్ ఫ్రెండ్స్ మరియు పొరుగువారిచే బాగా తెలిసిన మరియు అందరూ ఇష్టపడే వక్తి. అతను తాను స్టేట్స్ వెళ్తున్నానని స్పష్టంగా చెప్పాడు. దానికి బదులుగా, అతను తన ఇంటిలో తనని తాను కాల్చుకొని మరణించాడు. మరియు తన శరీరాన్ని కనుగొనేముందు నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు!

అతని దేహం 15 సంవత్సరాల తర్వాత కనుగొనబడింది!

అతని దేహం 15 సంవత్సరాల తర్వాత కనుగొనబడింది!

ఫ్రాన్సులోని లిల్లేలో ఒక వ్యక్తి 2012 లో చనిపోయాడని చెప్పబడింది. అతను మరిణించిన 15 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అతని మృతదేహం బయటకు తీయడం జరిగింది. ఆధారాల ప్రకారం, ఆయనకు బంధువులు ఎవరూ లేరనిమరియు ఒంటరిగా నివసించే వాడని తెలిపారు.

7 సంవత్సరాల తరువాత, ప్రజలు అతని మృతదేహాన్ని కనుగొన్నారు....

7 సంవత్సరాల తరువాత, ప్రజలు అతని మృతదేహాన్ని కనుగొన్నారు....

జర్మనీ లో ఒక 59 ఏళ్ల శరీరం బయటపడింది .అతను మరణించి ఏడు సంవత్సరాల పాటు కళేబరం మంచం మీద పడివుండటం గమనించారు. నివేదికల ప్రకారం, వారు కొన్ని సిగరెట్లు, పాత TV గైడ్ మరియు అతని యొక్క బెడ్ పక్కన కొన్ని డ్యుయిష్ మార్క్ నాణేలు కనుగొన్నారు.

8 సంవత్సరాల తరువాత, ఆమె మృతదేహం దొరికింది....

8 సంవత్సరాల తరువాత, ఆమె మృతదేహం దొరికింది....

ఒక ఆస్ట్రేలియా మహిళ, నటాలీ వుడ్, మానసిక స్థితి బాగాలేని ఆమె సోదరుడితో ఉండేది. ఆమె మెదడు కణితితో బాధపడుతుందని ఆమె సోదరుడితో చెప్పినప్పటికీ, 2011 లో ఆమె ఇంటిలో ఆమె శవం కనుగొనబడింది, అంటే ఆమె మరణించి 8 ఏళ్ళు అయుండొచ్చని భావిస్తున్నారు.

ఆమె మృతదేహం 5 సంవత్సరాల తర్వాత కనుగొనబడింది...

ఆమె మృతదేహం 5 సంవత్సరాల తర్వాత కనుగొనబడింది...

పియా ఫారెన్కోప్ఫ్ పూర్తిగా ఒక దేశదిమ్మరి జీవితాన్ని గడిపింది. ఆమె కుటుంబం అప్పుడప్పుడు ఆమెను కలవడం కుదరలేదు. తన మృతదేహాన్ని 5 సంవత్సరాల తరువాత మాత్రమే కనుగొన్నట్లు తెలుసుకొని ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు!

English summary

Unfortunate People Whose Bodies Were Found After Years

These are some of the people who were left to die alone. And the sad part is, nobody cared to even check on them for years!
Subscribe Newsletter