మీ రాశి ప్రకారం మీకు అదృష్టాన్ని తీసుకొచ్చేవి ఇవే

Written By: Bharath
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్కీ ఛార్మ్ (కలిసొచ్చే విషయం) ఉంటుంది. కొందరు వాళ్లంతకు వారే వాళ్లకు అదృష్టాన్ని తీసుకొచ్చే వాటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాటిని వాళ్ల వెంట ఉంచుకుని విజయపథంలో నడుస్తుంటారు. అలాంటి సెంటిమెంట్లు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కొంతమంది ఇష్టమైన దేవుడి ఫొటో, అమ్మనాన్నల ఫొటోలోను పర్స్ లో ఉంచుకుంటారు. మరికొందరు మరికొన్ని సెంటిమెంట్స్ పాటిస్తుంటారు. అయితే మీ రాశిని బట్టి మీకు కొన్ని లక్కీ ఛార్మ్స్ ఉంటాయి. వీటిని ఫాలో అయితే మీకు జీవితంలో తిరుగుండదు.

లక్కీ ఛార్మ్

లక్కీ ఛార్మ్

లక్కీ ఛార్మ్ అంటే మీకు అదృష్టం తీసుకొచ్చే దాన్ని ఎప్పుడూ మీతోనే ఉంచుకోవడం. ఎప్పుడూ దాన్నే ఫాలోకావడం. చాలామంది ఈ విధానాన్ని పాటించి సక్సెస్ అయ్యారు. మరి మీ రాశి ప్రకారం మీ లక్కీ ఛార్మ్ ఏమిటో తెలుసుకోండి. దాన్ని పాటించండి. విజయాలను మీ దగ్గరకు తెచ్చుకోండి.

2. మేషరాశి రాశి వారు ఇలా చేస్తే కలిసొస్తుంది

2. మేషరాశి రాశి వారు ఇలా చేస్తే కలిసొస్తుంది

మేషరాశి వారు చాలా హార్డ్ వర్కర్స్. వీరు వారి రాశి ప్రకారం కొన్ని పాటిస్తే దిశ తిరుగుతుంది. జీవితం విజయవంతంగా సాగుతుంది. ఈ రాశి వారికి లక్కీ ఛార్మ్ ఒకటుంది. దాన్ని పాటించి దాని ప్రకారం వెళ్తే ఇక వీరికి తిరుగుండదు. జీవితంలో వచ్చే అడ్డంకులన్నింటినీ అధిగమించగలరు. వీరి బాగా కలిసిరావాలంటే వీరు వారి వెంట తాళం చెవిని ఉంచుకోవాలి.

తాళం చెవి

తాళం చెవి

ఏ తాళం చెవినైనా చూసి వీరు పని ప్రారంభిస్తే తిరుగుండదు. వీళ్లు దీన్ని సెంటిమెంట్ గా భావించాలి. అలాగే తాళం చెవిని వారి అదృష్టంగా భావించాలి. పురాతన రోమన్లు తాళం చెవిని బాగా సెంటిమెంట్ గా భావించేవారు. కాబట్టి మేషరాశి వారు చేసే పనులు విజయంకావాలంటే వారి వెంట ఎప్పుడూ ఒక కీ తీసుకెళ్లడం లేదంటే .. తాళం చెవిని చూసి పని ప్రారంభించడం వంటివి చేయాలి.

3. వృషభం

3. వృషభం

వృషభం వారి లక్కీ ఛార్మ్ 7 అనే సంఖ్య. 7 వీరికి కలిసొచ్చే అంశం. దీన్ని వీరు సెంటిమెంట్ గా భావించాలి. అలాగే 7 అనేది ఆధ్యాత్మికంగా పరంగా కూడా చాలా పరవ్ ఫుల్.

7 కు చాలా పవర్

7 కు చాలా పవర్

7 కు చాలా పవర్ ఉంది. గతంలో 'గ్రీకులు' 7ను చాలా శక్తివంతమైన సంఖ్యగా భావించేవారు. అందువల్ల వృషభరాశి వారు జీవితంలో అన్ని విజయాలే కావాలని కోరకుంటే దీన్ని సెంటిమెంట్ గా పెట్టుకోవాలి.

4. మిథునరాశి

4. మిథునరాశి

ఫజ్జీ డైస్ వీరికి లక్కీ ఛార్మ్. దీన్ని వీరు సెంటిమెంట్ గా భావించాలి. దీన్ని చాలామంది బెడ్ రూముల్లో, కార్లలో షోకెస్ కోసం పెట్టుకుంటూ ఉంటారు.

ఫ్యాన్నీ షాపుల్లో లభిస్తుంది

ఫ్యాన్నీ షాపుల్లో లభిస్తుంది

మీరు దీన్ని పేరు తెలియకుంటే ఫాన్సీ షాపులు లేదా గిఫ్ట్స్ అండ్ ఆర్టికల్ షాపులకు వెళ్లి అడిగితే ఇస్తారు. మిథునరాశి కచ్చితంగా దీన్ని వాళ్ల దగ్గర ఉంచుకుంటే వారికి కలిసి వస్తుంది. ఫజ్జీ డైస్ అనేది రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం నుంచి తయారవుతూ వస్తుంది.

5. కర్కాటకరాశి

5. కర్కాటకరాశి

కర్కాటకరాశి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వీరి తోటివారు కూడా సంతోషంగా ఉండేలా చేస్తుంటారు. వీళ్లు అందరితో కలిసిమెలిసి ఉంటారు.

వీరు చాలా నమ్మకస్తులు.. అలాగే డిపెండబుల్ గా ఉంటారు. వీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరికి అదృష్టం తీసుకొచ్చేది ఏదైనా జంతువు లేదా వాళ్లకు ఇష్టమైన పెట్.

వాటితో గడుపుతూ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. వీరు అన్ని జీవరాశుల విషయంలో సఖ్యంగా ఉంటారు. వీరికి లక్కీ ఛార్మ్ లేడీబగ్. వీరికి దీని ద్వారా చాలా కలిసి వస్తుంది. లేడీబగ్ ను చూసి వెళ్తే వీరి పని విజయవంతం అవుతుంది.

6. సింహరాశి

6. సింహరాశి

సింహరాశి వారికి జెమ్ స్టోన్స్ (రత్నాలు) బాగా కలిసి వస్తాయి. వీళ్లు చేసే ప్రతి పని సక్సెస్ కావాలంటే మీ రాశి, జన్మ నక్షత్రానికి తగ్గట్లుగా మీరు రత్నంతో రింగ్ చేయించుకుని ధరిస్తే చాలా మంచిది. ఇది మీ వెంట ఉంటే మీకు అన్నీ విజయాలే కలుగుతాయి.

7. కన్యరాశి

7. కన్యరాశి

కన్యరాశి వారికి ఈవిల్ ఐని అనేది బాగా కలిసి వచ్చే అంశం. వీరి చుట్టు ఉన్న దుష్ట శక్తుల నుంచి ఇది కాపాడుతుంది. వీరి చుట్టూ ఎక్కువగా దుష్ట శక్తులుంటాయి. అందువల్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవిల్ ఐని చూసి పని ప్రారంభిస్తే ఆ పని కచ్చితంగా విజయం అవుతుంది.

8. తులరాశి

8. తులరాశి

ట్రైయాంగిల్స్, త్రిభుజాలు, త్రికోణాలు వంటివి వీరు సెంటిమెంట్ గా భావించాలి. త్రిభుజాకారంలో ఉండే వాటిని వీళ్లు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. త్రిభుజాకరంలో ఉండే వాటిని చూసి పని ప్రారంభించినా లేదంటే అలాంటి ఆకారంలో ఉన్న వాటిని ఎప్పుడూ వెంటే పెట్టుకున్నా మీకు తిరుగుండదు. త్రిభుజాలకు చాలా పవర్ ఉంటుంది. మీరు దీన్ని అదృష్టంగా భావించారు. ఏ విషయంలోనైనా మీకు త్రిభుజం అనేది బాగా కలిసి వస్తుంది.

9. వృశ్చికరాశి

9. వృశ్చికరాశి

వృశ్చికరాశి వారు సెంటిమెంట్ ను కచ్చితంగా పాటిస్తే వీళ్లకు తిరుగుండదు.

వీరు హార్స్ షోయ్ ను ( గుర్రపు డెక్క) ను ఎప్పుడూ వాళ్ల వద్దనే ఉంచుకోవాలి.

హార్స్ షోయ్

హార్స్ షోయ్

హార్స్ షోయ్ ఇది U (యు) ఆకారంలో ఉంటుంది. దీన్ని మీ దగ్గర ఉంచుకుంటే మీకు తిరుగుండదు. ఇది మీ దగ్గర ఉంటే మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. మీ చుట్టూ ఉండే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడూ దీన్ని మీ వద్దే ఉంచుకోండి. మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు దీన్ని ఒక్కసారి చూడండి.

10. ధనుస్సురాశి

10. ధనుస్సురాశి

ధనుస్సు రాశి వారు చాలా ఎనర్జిటిక్ పర్సన్స్. అయితే వీరు కొన్ని చిన్నచిన్న విషయాలకు కూడా నిరాశచెందుతుంటారు. వీరికి వీరి చిన్ననాటి స్నేహితులే లక్కీ ఛార్మ్. వారు ఉంటే చాలు మీకు అన్నీ శుభాలే కలుగుతాయి. వాళ్లు మీ జీవితం ఆనందమయంగా ఉండేలా చూస్తారు. అందువల్ల మీరు వారిని సెంటిమెంట్ గా భావించాలి.

ఫాక్స్- రాబిట్ ఫుట్

ఫాక్స్- రాబిట్ ఫుట్

అలాగే ఫాక్స్- రాబిట్ ఫుట్ అనేది వీరికి లక్కీ ఛార్మ్. వీరు దీన్ని సెంటిమెంట్ గా భావించాలి. వీరు ఎప్పుడూ దీన్ని వాళ్ల దగ్గర ఉంచుకోవాలి. ఫ్యాన్సీ షాపుల్లో ఇది దొరుకుతుంది.

11. మకరరాశి

11. మకరరాశి

మకర రాశి వారు కాస్త ధైర్యవంతులు. వీరు ఏ పనినైనా చేయడానికి వెనకాడరు. ఒక కాండానికి నాలుగు ఆకులుంటాయి. దీన్నే ఫోర్ లీఫ్ క్లోవర్స్ అంటారు. అలాంటి ఆకులు వీళ్లు ఎప్పుడూ వీరి వెంట ఉంచుకోవాలి. కాప్రికార్న్స్ అనేవి ఇలాంటి ఆకులను కలిగి ఉంటాయి. వీటిని మీరు సెంటిమెంట్ గా భావించాలి. చాలా మంది ఎక్కువగా దీన్ని శరీరంపై టాటూగా వేయించుకుంటారు. దీన్ని ఎక్కువ సెంటిమెంట్ గా భావిస్తారు.

12. కుంభం

12. కుంభం

క్రికెటర్లకు సంబంధించిన ఫోటోలు వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. క్రికెట్ కు సంబంధించిన ఫోటోలను మీ ఇంట్లో లేదా మీ కప్ బోర్డ్ లో పెట్టుకుంటే మంచిది. కుంభ రాశి వారికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వీరికి నీరు కూడా లక్కీ ఛార్మ్.

13. మీనం

13. మీనం

మీన రాశి మీకు అదృష్టం తీసుకొచ్చేది డ్రీమ్ క్యాచర్. వీరు చాలా క్రియేటివ్ గా, ఇమ్యాజినేటివ్ గా ఉంటారు. మీ వెంట డ్రీమ్ క్యాచర్ ఉంటే చాలు.

మీకు ఇందులో కొన్ని రకాల వస్తువులు తెలియకపోవొచ్చు. అయితే ఇప్పుడంతా ఆన్ లైనే కదా. మీకు ఒక్కసారి ఆ పేరును ఆన్ లైన్ లో సెర్చ్ చేసి ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తే చాలు. అది నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఇక దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే మీకు తిరుగే ఉండదు.

English summary

what is your lucky charm your zodiac says

Lucky Charms based on your Zodiac Signs works wonders - once you have an idea what is your Lucky Charm, just get one for yourself and see if it can create some magic in your life. Here is the lucky charm you need according to your Zodiac sign..
Story first published: Friday, December 8, 2017, 17:00 [IST]
Subscribe Newsletter