ఏంటి? ఈ అందమైన ఆలయం జస్ట్ బీర్ సీసాలతో నిర్మించబడిందా!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఈ ప్రపంచం ఎన్నో వింత ప్రదేశాలు మరియు వస్తువులతో నిండి వుంది. మనిషి అన్నిసమయాలలో కొత్తదనాన్ని చూడటానికి ఇష్టపడతాడు. ఒక్కొక్కసారి మీరు వారి వింత పద్ధతి,చిత్తశుద్ధి స్థాయి గురించి తెలిస్తే ఆశ్చర్యానికి గురైవుతారు.

కేవలం బీరు సీసాలు ఉపయోగించడం ద్వారా థాయిలాండ్లోని ఒక ఆలయం తయారు చేయబడింది. ఇది ప్రజల మధ్య మిశ్రమ ప్రతిచర్యను సృష్టించింది. ఎందుకంటే ఇక్కడి స్థానికులు వారి మనోభావాలను దెబ్బతీశారని నమ్ముతారు, అయితే ఈ మొత్తం ఆలయం కేవలం కేవలం బీరు సీసాలుతో తయారు చేసి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

మీ మనఃశ్శాంతిని ప్రశ్నించే విచిత్ర ఆలయాలు

ఈ ప్రత్యేక అద్భుతమైన ఆలయం గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యం( ఆలోచన)

దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యం( ఆలోచన)

బీర్ సీసాలతో దేవాలయాన్ని నిర్మించాలనే (ఉద్దేశ్యం ) ఒక ఆలోచన 80'స్ మధ్యకాలం లో ఒక సన్యాసినికి కలిగింది. అతని స్నేహితులలో కొందరు ఖాళీ సీసాలతో వారి గుడిసెలను అలంకరించటానికి ఉపయోగించారు. ఆలోచన విస్తృతంగా ఆమోదించబడింది మరియు ప్రజలు వారి ఖాళీ సీసాలు దానం చేయడం ప్రారంభించారు; ఫలితంగా వారు కొత్త ఆలయాన్ని నిర్మాణానికి తగినన్ని సీసాలను పొందారు.

వారు ఖాళీ సీసాలను చాలా సేకరించారు

వారు ఖాళీ సీసాలను చాలా సేకరించారు

ఈ సన్యాసులు వేర్వేరు ఆకారాలు మరియు బ్రాండ్లు ఉన్న ఒక మిలియన్ ఖాళీ సీసాలను సేకరించారు. వారు సేకరించిన ఈ సీసాలను ఉపయోగించి ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు! తుది ఫలితం నిజంగా తప్పక చూడాల్సిన ఆలయం. అని చెప్పవచ్చు!

ఇండియాలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు!

ఈ ఆలయం లోపల దాదాపు ప్రతిదీ బీర్ సీసాలతో తయారుచేసారు..

ఈ ఆలయం లోపల దాదాపు ప్రతిదీ బీర్ సీసాలతో తయారుచేసారు..

ఈ దేవాలయాన్ని తయారుచేయడానికి ప్రతి దానిలో దాదాపు ఖాళీ సీసాలను వాడటం జరిగింది. మొత్తం సీసాలు ఉపయోగించి అద్దాలను పగలగొట్టి సాధ్యమైనంత వరకు ఉత్తమ రూపంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా అందంగా కనిపించే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది వాస్తుశిల్పికి గొప్ప సవాలుగా ఉండేది. స్నానపు గదులు నుండి శ్మశానం వరకు, మొత్తం ఆలయం బీర్ సీసాలతో తయారు చేయబడింది.

ఆలయంలో బుద్ధుని విగ్రహాలు...

ఆలయంలో బుద్ధుని విగ్రహాలు...

ఈ ఆలయంలో రెండు పెద్ద బుద్ధుని బొమ్మలు ఉన్నాయి. వారు ఖాళీ సీసాలను మాత్రం మే కాకుండా బంగారు గాజు మొజాయిక్ ని కూడా ఉపయోగించారు. మీరు ఈ స్థలాన్ని చూసినప్పుడు, మీరు అక్కడి బుద్ధుడిని చూస్తారు. ఇది ఉత్తమమైనది మరియు అతడిని బుదై అని పిలుస్తారు.

వ్యర్థాలను పునర్వినియోగించడం మరియు దాని ఉపయోగాలను తెలుపడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దిగువ వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను మాకు తెలియజేయగలరు.

All Images Source:

English summary

What? This Beautiful Temple Is Built With Just Beer Bottles!

What? This Beautiful Temple Is Built With Just Beer Bottles!,A Buddhist temple is made using just beer bottles, and this temple is located in Thailand. Check out the amazing pictures.
Story first published: Monday, July 24, 2017, 20:00 [IST]
Subscribe Newsletter