2018లో ఈ రాశుల వారిని శని వెంటాడి వేధిస్తాడు!

Posted By: Bharath
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరి జీవితంలో శని ప్రభావం చాలా ఉంటుంది. శనిగ్రహం నెత్తిన ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా విజయవంతం కాదు. 2018లో కొన్ని రాశులపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. మరి మీ రాశిపై శని ప్రభావం ఎంత మేరకు ఉందో మీరే తెలుసుకోండి.

మేష రాశి వారిపై శని ప్రభావం

మేష రాశి వారిపై శని ప్రభావం

2018 లో మేషరాశి వారిపైనే శని ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా అడుగువేయాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ, వ్యాపార సంబంధిత విషయాల్లోనూ మేషరాశివారిపై శని ప్రభావం ఉంటుంది. మీ శత్రువులు మిమ్మల్నినష్టపరిచేందుకు, మిమ్మల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. అందువల్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. శని మిమ్మల్ని వెంటాడుతుంది.

వృషభ రాశి వారిపై శని ప్రభావం

వృషభ రాశి వారిపై శని ప్రభావం

వృషభ రాశివారు 2018లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరికి కొన్ని అడ్డంకులు ఎదరవుతాయి. మీ రంగంలో మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2018 లో మీరు మీ వ్యాపారంలో మరింత రాణించేందుకు, లేదా మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు అనువుగా ఉండదు. మీరు చేయదలచుకున్న చాలా పనులకు అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ఓపిక సహనం మీకు చాలా అవసరం. ఎందుకంటే శని మీపై ఎక్కువా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మిథునరాశిపై శని ప్రభావం

మిథునరాశిపై శని ప్రభావం

మిథునరాశిపై శని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. వీరికి కుటుంబసభ్యులు, ఆఫీసుల్లో వారి సహచరులు, బయట స్నేహితుల మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ మీకు పెళ్లి అయినట్లయితే మీరు కొన్ని రకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం మీరు తొందరపడకుండా ఉండాలి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ భాగస్వామిపై కోప్పడకుండా ఉంటే చాలు. 2018 లో మీ కుటుంబంలో ఒక గొప్ప వేడుక జరగనుంది. అలాగే మీరు వాహనం, భూమి లేదా ఆభరణాల విషయంలో పెట్టుబడి పెట్టొచ్చు. దీని వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

ఈ రాశి వారికి వచ్చే ఏడాది కాస్త కలిసొస్తుంది. వ్యాపారం బాగా ఉంటుంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురుచూస్తున్న సంపద మీకు చేరుతుంది. అయితే మీరు, మీ భాగస్వామి (భార్య లేదా భర్త) ఒక పెద్ద వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఉండే సమస్యలు మొత్తం 2018లో పరిష్కారం కానున్నాయి. మీపై శని ప్రభావం ఎక్కువ లేదు.

సింహరాశి మీద శని ప్రభావం

సింహరాశి మీద శని ప్రభావం

మీ కుటుంబంలో ఏర్పడ్డ ఎన్నో కలతలు 2018లో ముగిసిపోనున్నాయి. మీరు ఆనందంగా ఉండొచ్చు. మీరు ఇల్లు లేదా భూమిని కొనే అవకాశం ఉంది. అలాగే 2018లో భారీ పెట్టుబడులు పెడతారు. మీరు మీపై వారి చేత మెప్పు పొందుతారు. అయితే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీపై శని ప్రభావం ఎక్కువ లేదు.

కన్యపైరాశిపై శని ప్రభావం

కన్యపైరాశిపై శని ప్రభావం

మీరు వ్యాపారం, ఉద్యోగం, వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ విషయాల్లో మాత్రమే మీపై శని ప్రభావం ఉంటుంది. మిగతా విషయాల్లో ఎలాంటి భయం లేదు. మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి. మీకు 2018లో ఏదో ఒక రకంగా డబ్బు సులభంగా చేతికొస్తుంది. అయితే ఎలా వచ్చిందో అలానే మీ నుంచి వెళ్లిపోతుంది.

తులరాశిపై శని ప్రభావం

తులరాశిపై శని ప్రభావం

మీకు ఆరోగ్యపరంగా వచ్చే ఏడాది బాగుంటుంది. మీరు తగినంత డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు వస్తాయి. అయితే కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. మీరే చేసే పనులు అంతగా విజయవంతంకాకపోవొచ్చు. మీ భాగస్వామితో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయాల్లో మీపై శని ప్రభావం ఉంటుంది. అయితే మీ స్నేహితులు, సన్నిహితులు మీకు చాలా విషయాల్లో అండగా నిలుస్తారు.

వృశ్చిక రాశిపై శని ప్రభావం

వృశ్చిక రాశిపై శని ప్రభావం

వృశ్చిక రాశిపై కాస్త శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. మీరు చాలా విషయాల్లో విజయాలు సాధిస్తారు. అయితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. దీంతో మీరు పని చేసే ప్రాంతంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. మీరు కొన్ని ప్రయాణాల డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. బయటి వ్యక్తులను మీరు ఎట్టి పరిస్థితుతల్లో నమ్మవద్దు.

ధనుస్సురాశిపై శని ప్రభావం

ధనుస్సురాశిపై శని ప్రభావం

ఈ సంవత్సరం మీరు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీంతో మీరనుకునే లక్ష్యాలు పూర్తి కావు. చాలా పనుల్లో మీరనుకున్న ఫలితాలు సాధించలేరు. మీ వ్యాపార ప్రత్యర్థులు మీతో సన్నితంగా ఉండేవారితో మీ బలహీనతలు తెలుసుకుంటారు. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. శని మిమ్మల్ని వెంటాడుతుంది.

మకరరాశిపై శని ప్రభావం

మకరరాశిపై శని ప్రభావం

మీరు అనవసరమైన ప్రయాణాలు చాలా చేయాల్సి వస్తుంది. అలాగే మీ వ్యాపారాల్లో హెచ్చుతగ్గులు చాలా ఉంటాయి.మీరు ఒక కొత్త ఇంటిని కొంటారు. అయితే ఈ విషయంలో మీరు చాలా ఇబ్బందులుపడతారు. మీ శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. శని మీ వెంటనే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.

కుంభరాశి పై శని ప్రభావం

కుంభరాశి పై శని ప్రభావం

2018లో మీ పాత సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయి. సంపాదన కూడా బాగానే ఉంటుంది. అదనంగా. కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు అన్ని విషయాల్లో సహకారం అందిస్తారు. వచ్చే ఏడాది మీరు, మీ కుటుంబ సభ్యులు ఒక శుభవార్త వింటారు.

మీనరాశిపై శని ప్రభావం

మీనరాశిపై శని ప్రభావం

మీకు 2018లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరగవుతుంది. గతంలో కంటే మీరు ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. అయితే మిమ్మల్మి మీరు బాగా నమ్మిన దగ్గరి వ్యక్తి మోసం చేస్తాడు. మీకు ద్రోహం చేయవచ్చు. ప్రభుత్వ పనులకు సంబంధించిన విషయాల్లో మీరు సమస్యల్లో చిక్కుకుంటారు. అయితే ఆ సమయంలో మీరు కాస్త అనుభవం ఉన్న వ్యక్తులు, పెద్దవారితో చర్చించి ముందడుగు వేస్తే చాలా మంచిది.

English summary

Would Lord Shani trouble your zodiac sign in 2018?

Would Lord Shani trouble your zodiac sign in 2018?