For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫ్రికాలోని 2500ఏళ్ళనాటి బయోబాబ్ చెట్లు అకస్మాత్తుగా ఎందుకు అంతరించే దశకు చేరుకుంటున్నాయి?

ఆఫ్రికాలోని 2500 సంవత్సరాల నాటి బయోబాబ్ చెట్లు అకస్మాత్తుగా ఎందుకు అంతరించే దశకు చేరుకుంటున్నాయి?

|

గ్లోబల్ వార్మింగ్ కారణంగా, ఈ ప్రపంచంలో అంతరించిపోతున్న విషయాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా జంతువులు లేదా వృక్షాలు ఎక్కువగా ప్రభావానికి గురవుతున్నాయి, ఇప్పుడు మిగిలి ఉన్న జాతులలో కూడా ఎక్కువ శాతం ప్రమాదం అంచున ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇవి అంతరించడానికి సగం ప్రకృతి ప్రకోపాలు కారణం అయితే, మరో సగానికి కారణం మనిషి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

నెమ్మదిగా అంతరించిపోతున్న చెట్ల జాతుల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచబడింది! ముఖ్యంగా అకస్మాత్తుగా అంతరించడానికి సిద్దంగా ఉన్న ఆఫ్రికాలోని 2500 ఏళ్ల బయోబాబ్ చెట్లు గురించిన వివరాలను పంచుకోబోతున్నాం.

2500 సంవత్సరాలకు పైగా జీవించి ఉన్న ఈ ప్రత్యేకమైన వృక్షాల గురించిన మరిన్ని వివరాలను తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి. ఇవి మానవుల నిరంతర జోక్యం కారణంగా అంతరించే దశకు చేరుకున్నాయి.

ఈ జాతులు మరియు మొక్కల చరిత్ర గురించి మరింత తెలుసుకోండి.

Africas Ancient Baobab Trees Are Dying Due To Climate Change

2500 సంవత్సరాల నాటి ఈ బయోబాబ్ చెట్లు అకస్మాత్తుగా ఎందుకు అంతరించే దశకు చేరుకుంటున్నాయి?

ఈ చెట్లు ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నాయి:

1,100 నుండి 2,500 సంవత్సరాల వయస్సు మధ్యగల ఈ బయోబాబ్ చెట్లు ఇటీవలే అంతరించిపోతున్నట్లు ప్రకటించబడ్డాయి. ఈ చెట్లు ప్రధానంగా ఆఫ్రికాలో కనిపిస్తాయి.

"తలక్రిందుల చెట్టు"

ఈ ప్రత్యేకమైన బయోబాబ్ చెట్లను "తలక్రిందుల చెట్టు"గా కూడా వ్యవహరిస్తారు. ఈ వినూత్నమైన పేరుకు కారణం ఏమనగా, ఈ చెట్టు యొక్క శాఖలు వేర్ల భాగాన ఉంటాయి. ఈ చెట్లు ఆఫ్రికాకే ప్రత్యేకమైనవి ఉన్నాయి. మరియు వేల సంవత్సరాల పాటు జీవించగలిగే చెట్ల జాతులలో ఒకటి. ఆఫ్రికాలో ఉన్న బయోబాబ్ చెట్లలో ఒకటి 6,000 సంవత్సరాలపాటు జీవించి ఉందని నివేదించబడింది కూడా!

బయోబాబ్ చెట్లు ఉపయోగాలు:

ఈ బయోబాబ్ చెట్లు 300 కంటే ఎక్కువ ఉపయోగాలను కలిగి ఉన్నాయి. ఆకులు ఐరన్లో పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు మిగిలిన ఆకుకూరలవలె వండుకుని తినవచ్చు. దీనితో పాటు కాల్చిన విత్తనాలు కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడతాయి. ఈ విత్తనాలు చమురు తయారు చేయడానికి లేదా సౌందర్య సాధనాల కోసం కూడా వినియోగించబడుతాయి. చెట్టులో అణువణువునా ప్రయోజనాలు ఉంటాయి.

ప్రస్తుతం ఈ చెట్లు కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలో ఉన్నాయి:

పరిశోధకులు కార్బన్ డేటింగ్ పద్ధతులను ఉపయోగించి వాటి వయస్సును మరియు వాటి జీవ చక్రాన్ని నాశనం చేసిన ఇతర లక్షణాలను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే చనిపోయిన అనేక చెట్లు ఉన్నాయి:

నివేదికల ప్రకారం, ఈ చెట్లు ఉన్న పదమూడు స్థానాలలో, ఇప్పటికే తొమ్మిది చెట్లు మృతి చెందాయి. కావున మిగిలిన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచి, వీటి వయసును నిర్ధారించే క్రమంలో మరియు వీటి నాశనానికి కారణమైన అంశాల గురించిన ప్రత్యేక పరిశోధనలు చేపడుతున్నారు.

ఈ మొక్కలు అసలు ఎందుకు అంతరిస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. నిజానికి ఎటువంటి మొక్కల ఆధారిత అంటువ్యాధి ఈ చెట్లకు సోకలేదు. అయినా వరుసగా చెట్లు మరణిస్తున్నాయి. ఎందుకిలా అంతరిస్తున్నాయో తెల్సుకోవలసిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఇది మానవాళికి ఒక హెచ్చరికగా చెప్పబడుతుంది. ప్రపంచ వాతావరణం అనూహ్యంగా వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ పెరగడం, అతినీలలోహిత కిరణాల ప్రభావాలు, కాలుష్య కోరల జీవనాలు ఎంతగా ప్రకృతి మీద ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకోవలసిన అవసరం మానవాళికి ఉంది. మరియు ప్రపంచాన్ని కాపాడుటకై ప్రతి ఒక్క మనిషి తమ భాద్యతను కలిగి ఉండాలన్న ఆలోచనను ఇస్తుంది.

ఇప్పటికీ దేశంలో అత్యధిక శాతం కాలుష్య ప్రామాణికాలు పాటించని వాహనాలు, యంత్రాలు అనేకం వాడకంలో ఉన్నాయి. అవసరానికి మించిన బాణాసంచా వాడకం, ధూమపానం, ఫాక్టరీల కాలుష్యం, కట్టెల పొయ్యి వాడకం, చెట్లను తెగనరకడం, పెరుగుతున్న టెక్నాలజీ వేస్టేజ్, ప్లాస్టిక్ వాడకం, అణు ప్రయోగాలు వంటివి అనేకం గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారకాలుగా ఉంటున్నాయి. తగ్గించాలని అనేక స్వచ్చంద సంస్థలు గగ్గోలు పెడుతున్నా, వారి నోళ్లను కట్టడి చేసేలా వితండవాదాలతో నెగ్గుకొస్తున్న కొందరి విధానాలు రేపు భవిష్యత్ తరాల ఉనికినే ప్రశ్నార్ధకం చేసేలా తయారయ్యాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాల కోసం బోల్డ్స్కీ పేజిని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను, క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Africa's Ancient Baobab Trees Are Dying Due To Climate Change

Baobab trees are dying due to climate changes in Africa. These trees can live upto 2,500 years and researchers have discovered these trees are dying in droves. A scientist named Aida Cuni Sanchez has explained that the gargantuan plants are dying after humans are interfering with them with scientific experiments that are killing them.
Desktop Bottom Promotion