మదర్స్-డే నాడు అమ్మలకు ఇవ్వగలిగే ఉత్తమమైన బహుమతులు

Subscribe to Boldsky

ఒక మానవ మెదడు మల్టీ టాస్కింగ్ ప్రోగ్రామ్ చేయబడిందని తెలిసిన ఒక వాస్తవం, అయినా కూడా మన మెదడు ఒకే సమయంలో ఒకే ఒక్క పనిపై దృష్టి పెడుతుంది. కానీ భూమి పుట్టుక నుండి తల్లులు మాత్రం ఈ మల్టీ టాస్కింగ్ ప్రోగ్రాంకు కట్టుబడి ఉన్నారు. వారు ఎన్ని భాధ్యతలున్నా, మనసులో ఏదో ఒక మూలైనా పిల్లలు అనే నేపధ్యం ఉండి తీరాల్సిందే. కుటుంబంపై అంతటి నిబద్దత కలిగిన వారు ఈ తల్లులు.

మన జీవితాల్లో ప్రత్యేకమైనదoటూ ఏదైనా ఉంటే, మొదట తల్లే. తర్వాతే ఎవరైనా. ఆమె బలమైన పునాది మరియు మార్గదర్శక శక్తి. మంచి చెడుల గురించి మనకు బోధిస్తుంది మరియు మనకు వాటితో పోరాడగలిగే ధైర్యాన్ని ఇస్తుంది కూడా. అంతే కాకుండా, మన కడుపు నిండే ప్రయత్నంలో తన కడుపు సైతం మాడ్చుకోగలిగిన ఎటువంటి స్వార్ధం లేని నిస్వార్ధ జీవి అమ్మ. మన బట్టలు ఉతకడం దగ్గర నుండి, మనకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించే దిశగా ఒక నిరంతర శ్రామికురాలిగా తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మీ పరీక్షలకి, మీ ఉద్యోగాలకు, మీ ఉన్నతికి .. అంశాలు ఏవైనా మీ సంతోషాన్ని తన సంతోషంగా భావించే వ్యక్తి అమ్మ. మీ మీద అంత శ్రద్ద తీసుకునే అమ్మ, మీ సంతోషం తను దూరమవడం అంటే, అందుకు కూడా సిద్దపడే ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎందరు కవులున్నా, ఒక్క అమ్మని వర్ణించడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పవచ్చు. అమ్మ గురించి ఎంత రాసినా, తక్కువే అవుతుంది మరి.

List Of Unique Best Gifts That You Can Gift Your Mother On Mother’s Day

ఒక తల్లి మాత్రమే నిస్వార్థoగాపిల్లల పట్ల ప్రేమను, జాగ్రత్తను మరియు భవిష్యత్తు ఆలోచనలు చేస్తూ మల్టీ టాస్కింగ్ లో ఉంటుంది. కానీ ప్రతిఫలాన్ని ఆశించకుండా మన పట్ల తమ జీవితాలనే అంకితం చేస్తుంది. కానీ ఒక మహిళమాత్రం తన తల్లికి తిరిగి ఏదైనా ఇవ్వాలని నిర్ణయించింది.

అమెరికన్ సివిల్ వార్ సమయంలో అన్నాజార్విస్ అనే ఒక యువ అమెరికన్ శాంతి కార్యకర్త ఉండేది. అందరు తల్లులు గౌరవించబడటానికి మదర్స్-డే ను విస్తృతంగా జరుపుకుంది. ఈ భావన నెమ్మదిగా ఇప్పుడు మన పితృస్వామ్య సమాజంలోకి కూడా వచ్చింది.ప్రతి మే నెల రెండవ ఆదివారం నాడు అంతర్జాతీయ మదర్స్ డే జరుపుకుంటారు. ఒకరోజు మాత్రమే ప్రేమను చూపి, మిగిలిన రోజులు సైలెంట్ గా ఉండమని అర్ధం కాదు. ఈరోజు వారికి కొంత ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వడం భాద్యతగా తీసుకోవాలి.

మీ అమ్మ ప్రపంచంలోనే గొప్ప అనుభూతిని పొందాలనుకుంటున్నారా? మా నుండి ఒక క్యూ తీసుకోండి. మదర్స్-డే ను ప్రత్యేకమైనదిగా చేయడానికి మీ తల్లికి ఇవ్వగలిగే బహుమతుల ప్రత్యేక జాబితాను మేము పొందుపరుస్తున్నాం.

1)స్పా:

1)స్పా:

మహానగరాల్లో దీని ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. వారికి నచ్చే సెలూన్లలో వీరికై వోచర్ తీసుకోవడం ద్వారా, తెలీకుండానే ఎంతో ఆనందానికి లోనవుతారు. కొందరు దీనిని పెద్దగా తీస్కోకపోవచ్చు. కానీ, వారికంటూ ఒక సమయం కేటాయించుకోకుండా, పిల్లలకి నిరంతర శ్రామికులుగా మారిన తల్లులు, తమ శారీరిక శ్రమకు కాస్త ఉపశమనం లభిస్తుంది అంటే ఎంతో ఆనందిస్తారు . మీరు స్పా వోచర్ తీసుకోవడం ద్వారా, తమ కష్టాన్ని గుర్తించారు అన్న అనుభూతికి లోనవుతారు.

2)తాజా వంటగది గాడ్జెట్లు :

2)తాజా వంటగది గాడ్జెట్లు :

ఇంటిలో ఏ ఇతర ప్రదేశాలకన్నా వంటగదిలోనే మన తల్లులు ఎక్కువ కాలం గడుపుతుంటారు. కానీ కొందరు వారి శ్రమను గుర్తించరు సరికదా, ఇది చెయ్యలేదు అది చెయ్యలేదంటూ దెప్పి పొడుస్తుంటారు. అందరూ కాదులెండి. మీరు ఎటువంటి ప్రత్యామ్నాయాలను చూపించినా వారు చివరికి వంటింటికే వెళ్తుంటారు. ఎందుకంటే తల్లి చూసేది ప్రధానంగా పిల్లల కడుపే మరి. కావున ఆమె ఏ పనిలో ఎక్కువ కష్టపడుతుందో తెలుసుకుని, దానికి తగ్గట్లుగా కిచెన్ గాడ్జెట్స్ కొనివ్వడం ఎంతో ఉత్తమమైన చర్యగా ఉంటుంది. ఇది వారికి ఉపయుక్తంగా కూడా ఉంటుంది.

3)కొత్త కర్టెన్లు :

3)కొత్త కర్టెన్లు :

కొత్త కర్టెన్లను కొనుగోలు చేయాలని మీ తల్లి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తారా? నిధుల కొరత కారణంగా కర్టెన్ల విషయం కాస్త పక్కన పెడుతూ వస్తున్నారా? ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉన్న పక్షాన, ఇది ఖచ్చితంగా పునరుద్ధరణ సమయం. ఆమె ఎల్లప్పుడూ కోరుకునే కొత్త కర్టన్ల కొనుగోలు ఆమెని నిజంగా సంతోషానికి గురిచేస్తుంది. ప్రత్యేకించి ఇది ఆమె కోసం కాకపోయినా, ఇల్లే దేవాలయంగా భావించే తల్లులకు వారి కోరికలు తీర్చిన వారవుతారు. ఇక్కడ కర్టెన్లనే కాదు, మీ అమ్మ మనసులో ఉండే కోరిక తెలుసుకుని ప్రవర్తించడం మేలు అని ఉద్దేశం.

4) బుక్స్ లేదా మేగజైన్లు :

4) బుక్స్ లేదా మేగజైన్లు :

మీ తల్లికి పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి ఉందా, లేదా తన ఫేవరేట్ మాగజైన్ ఏమైనా ఉందా ? మీ తల్లితండ్రులు ఎల్లప్పుడూ మీకోసం వారి కోరికలను అణిచివేస్కుని బ్రతుకుతుంటారు. వారి అభిమాన రచయిత నుండి ఒక పుస్తకాన్ని బహుమతిగా లేదా వారి అభిమాన పత్రికకు చందా ఇవ్వడం ద్వారా వారు మిక్కిలి సంతోషానికి గురవుతారు. మీరు కోట్లు పెట్టి డైమండ్ నెక్లెస్ ఇచ్చినా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న చిన్ని కోరికను మీరు నెరవేర్చగలిగితే వారి ఆనందానికి అవధులు ఉండవు.

5) హాండ్ బాగ్ :

5) హాండ్ బాగ్ :

ఒకప్పుడు మీ అమ్మగారు ఫాషన్ మరియ ట్రెండ్ తగ్గట్లు ఉండేవారా? లేదా ఫాషన్ పరంగా ఏమైనా కోరికలు కలిగి ఉండేవారా? అయితే వారికి ఆ చిన్ని కోరిక తీర్చడానికి మీకు చక్కటి సమయం. ఒక చిన్న ట్రెండీ హాండ్ బాగ్ ను ఆమెకి బహుమతిగా ఇవ్వండి. ఆమె తన కిట్టి పార్టీ స్నేహితులకు చూపుటకు గర్వంగా ఉంటుంది. మీ మొత్తం వేతనాన్ని వెచ్చించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ విషయం మీ అమ్మ తట్టుకోలేదు. కాస్త అసౌకర్యానికి లోనవుతుంది. మరియు తప్పనిసరిగా మీ ఆర్థికవ్యవస్ధను నిర్వహించడంలో ఒక ఉపన్యాసం వినాల్సి రావొచ్చు.

6) చివరగా, మీకు మీరే బహుమతి అవ్వండి

6) చివరగా, మీకు మీరే బహుమతి అవ్వండి

మీరు మీ తల్లి నుండి దూరంగా ఉండేవారైతే, మీ మనసులో వారెప్పుడూ ఉన్నారు అని తెలియపరచేలా సడెన్ సర్ప్రైస్ గా వారి ముందు ప్రత్యక్షం కండి. మదర్స్-డే కోసం మీ తల్లిని కలుసుకోవటానికి వెళ్లండి, మరియు మీరు రోజంతా ఆమెతో ఉండేలా ప్లాన్ చేసుకోండి, ఆమెకి నచ్చినవి కొనివ్వడం లేదా ఇష్టమైన తినుబండారాలకై తీసుకెళ్లడం, లేదా మీరే ఏమైనా స్పెషల్ గా వంట చేయడం వంటి వాటి ద్వారా, మీ తల్లి ఆనందానికి అవధులు ఉండవు. మీ ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లను పక్కన పెట్టి ఆమెతో మాట్లాడుటకు సమయాన్ని కేటాయించండి. ఆవిడకై మీరు చూపే శ్రద్ద, ఆమెకి ఆనంద భాష్పాలను ఇవ్వాలి కాని భాదను కాదు. ఆమెని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఆమెకి తెలియజేసేలా మీ ప్రవర్తన ఉండాలి. వీలయితే మీ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను ఆమెకు బహుమతిగా ఇవ్వండి. ఇంతకన్నా వేరే బహుమతి ఉంటుందంటారా?

ఈనాడు మగవారితో సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్న స్త్రీలు, ఇంటా బయటా నిరంతర శ్రామికులుగా మారి తమ ఆకలిని సైతం పక్కన పెట్టి తమ కుటుంబ శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికురాలిగా జీవనాన్ని సాగిస్తున్న తల్లులకు కనీస గౌరవం ఇవ్వడం బిడ్డలుగా మన విధి. వారు రెండు మాటలు అన్నా అది మన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే అంటారు కానీ, వేరే ఏ ఇతర కారణాల చేతనూ కాదు. పెద్దలు అంటారు పిల్లల ప్రేమల్లో అయినా కల్తీ ఉంటుందేమో కానీ, తల్లి ప్రేమలో కాదు అని. అలాంటి తల్లిని, ఆశ్రమాలలో ఉంచడం, పాశవికంగా బయటకు తరమడం చేస్తున్న కొందరిని చూస్తుంటే సమాజం ఎటుపోతుందా అన్న అనుమానం కలుగక మానదు.

మీ తల్లికి ఇవ్వగలిగిన బహుమతుల్లో పైన చెప్పిన 5 మాత్రమే గొప్పవి అని మేము చెప్పడం లేదు, ఈ 5 ఆప్షన్లు మాత్రమే. అన్ని సంవత్సరాలు మీతో కలిసి మీ బాగోగులను చూసుకునే అమ్మ మనసులో ఏముంటుందో కనీస అవగాహన ఉండడం సహజం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీ వెంట మేమున్నామన్న భరోసాను మీ బహుమతి రూపంలో ఇవ్వడానికే ఈ మదర్స్ డే. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మీ అమ్మకు మరపురాని రోజుని బహుమతిగా ఇవ్వండి.

మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. మరియ మీ తల్లికి ఏ బహుమతిని ఇవ్వదలిచారో మా కామెంట్ సెక్షన్లో తెలుపండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    List Of Unique Best Gifts That You Can Gift Your Mother On Mother’s Day

    A mother is indeed very special in our lives. She is the strong pillar, a guiding force, someone who teaches us about the good and bad, and gives us the courage to fight against it. Gifting her on this Mother's day will surely make her realise on how much you love and respect her!Best Gifts for Mothers On Mother's Day
    Story first published: Sunday, May 13, 2018, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more