Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
పిల్లలతో చక్కీ-డాల్ ప్రాంక్ వీడియో
పిల్లలతో చక్కీ-డాల్ ప్రాంక్ వీడియో
భయంగొల్పే చక్కీ–డాల్(బొమ్మ) తో పిల్లలను భయపెడ్తున్న తండ్రి: ప్రాంక్ వీడియో ఓకే, కానీ ఇలా చేయడం సబబేనా?
ప్రాంక్ వీడియోలు చేయడం ఈకాలంలో సర్వసాధారణం, ప్రాంక్ ఇష్టపడని వ్యక్తులు కూడా ఈ కాలంలో అరుదనే చెప్పాలి. కానీ ఒక్కోసారి ప్రాంక్స్ ఏ మాత్రం వికటించినా, ఫలితాలు దారుణంగా ఉంటాయని మనకు తెలియనిది కాదు. ఇంతకుముందు తండ్రితో ప్రాంక్ చేయబోయి దారుణంగా దెబ్బలు తిన్న కొడుకు ప్రాంక్ వీడియో ఏ రేంజులో వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఒక్కోసారి ఫన్ జనరేషన్ సంగతి ఏమో కానీ, కొన్ని కొత్త సమస్యలను కూడా తెస్తుంటాయి. ఇక్కడ ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను భయపెట్టడానికో లేక, తమాషా చేయడానికో తెలీదు కానీ, ప్రాంక్ వీడియో చేసే నేపధ్యంలో చక్కీ డాల్ వినియోగించాడు. ప్రపంచ వ్యాప్తంగా, సినిమాల్లో హత్యలుచేసే పాత్ర కలిగిన చక్కీ-డాల్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఈ బొమ్మను వినియోగించి అనేక మందిని భయపెట్టిన ప్రాంక్ వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి కూడా.

ఈ వీడియోలో పిల్లలతో సరదాగా ప్రాంక్ వీడియోకి పూనుకున్న తండ్రిని చూడండి.
పిల్లలతో చక్కీ-డాల్ ప్రాంక్ వీడియోను చూడండి.
ఇక్కడ, తండ్రి తన చిన్న కుమారునితో ప్రాంక్ మొదలుపెట్టాడు. పెద్ద స్పైడర్ ఉందని, దానిని చంపాల్సిందిగా పిల్లవానికి చెప్పడంతో, ఎప్పుడూ లేనిది, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కాని ఆ పిల్లవాడు, నెమ్మదిగా తలుపు తీసి చూడడం మొదలుపెట్టాడు. కానీ ఆ రెడ్ హెయిర్ మరియు భయంకరమైన నవ్వుని కలిగి ఉన్న ఆ బొమ్మని తప్ప చుట్టూ ఉన్న అన్నిటినీ చూస్తున్నాడు. ఎప్పుడైతే హాంగర్ల మద్య ఉన్న చక్కీ-డాల్ చూశాడో, నెమ్మదిగా అక్కడ నుండి జారుకోవడం మొదలెట్టాడు, తిరిగి బొమ్మను చూడకూడదు అనుకుంటూ. నిజంగా స్మార్ట్ చైల్డ్ ఈ పిల్లవాడు.
తండ్రికి సహాయం చేయడానికి వచ్చిన ఆ పిల్లవాని అక్క, ఆ రాక్షస బొమ్మను చూసి నిశ్చేష్టురాలై గుండెల నిండా భయంతో అరిచి, డాడ్ అని పిలవడం కనిపిస్తుంది.
ఇక అందరికన్నా పెద్ద పాప, తండ్రి చేష్టలకు అలవాటు పడిన కారణంగా స్పైడర్ ను చంపమనగానే, కనీసం బొమ్మను కూడా చూడకుండా, షూ విసిరి వెళ్ళడం కనిపిస్తుంది.
కొందరు ఈ ప్రాంక్ వీడియోని ఫన్నీగా తీసుకున్నా, కొందరు పిల్లలను ఇంతలా భయపెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి చర్యలు అభద్రతా భావాలకు, ఆత్మన్యూనత వంటి సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతాయని సైకాలజిస్టులు చెప్తుంటారు కూడా.
పిల్లలతో ఆడుకోవచ్చు, కానీ అది వారి మానసిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూడదు. ఇక్కడ, ఈ వీడియో ప్రకారం ఫన్నీగా ఉన్నా కూడా, ఇటువంటి చర్యలు శ్రుతి మించకుండా చూసుకోవలసిన అవసరం ఉన్నది. భయం అనేక తీవ్రమైన పరిస్థితులకు కూడా దారితీయవచ్చు కూడా. ఏది ఏమైనా ఆ పిల్లల మనస్థితి మీద, తండ్రికి ఒక అవగాహన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రాంక్ వీడియోని అంత సీరియస్ తీసుకోవలసిన అవసరంకూడా లేదని కొందరి అభిప్రాయం.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications