For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన అంశాలు : పురాతన భారతదేశం గురించిన ఈ 11వాస్తవాలు మిమ్ములను ఖచ్చితంగా మంత్రముగ్ధులను చేస్తాయి

|

భారతదేశ చరిత్ర అనేక ఆసక్తికరమైన కథనాలు, కథాంశాలతో పాటు యుగాలు, రాజ్యాలు, యుద్దాలు, సంస్కృతులు సాంప్రదాయాల మేళవింపుతో కూడిన అంశాలతో నిండిపోయి అబ్బురపరిచేదిలా ఉంటుంది. అంతటి అసామాన్యమైన దేశం భారతదేశం. వాస్తవానికి, పురాతనకాలం నుండే సంపన్నమైన దేశంగా ఉన్నదని ఋజువుచేసే అనేక చారిత్రిక స్థలాలు ఈ దేశంలో కోకొల్లలు.

అనేక ప్రదేశాలలో దొరికిన శిలాఫలకాలు మరియు ప్రాచీన సాహిత్యాలలో కనుగొన్న అనేక వాస్తవాలు ఇక్కడ సాక్ష్యాలుగా ఉన్నాయి. అవి అత్యంత ప్రాచీన పురాతన భారతదేశానికి చెందినవిగా ఉన్నాయి. కనీసం పాఠ్యాంశాలలో సైతం పొందుపరచబడనివిగా ఉన్నాయి. క్రమంగా కొన్ని విషయాలు, అనేకమందికి తెలియని అంశాలుగానే మిగిలిపోయాయి.

మహాభారతం కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్, క్లోనింగ్ ప్రక్రియ గురించి ప్రస్తావిస్తుంది:

మహాభారతం కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్, క్లోనింగ్ ప్రక్రియ గురించి ప్రస్తావిస్తుంది:

మహాభారతం క్లోనింగ్, టెస్ట్ ట్యూబ్ బేబీస్, మరియు సర్రోగేట్ మదర్స్ అనే ప్రక్రియల గురించి ప్రస్తావించింది కూడా. మహాభారతంలో, గాంధారికి 100కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు అన్నది వాస్తవం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఆమె అంతమందికి జన్మనివ్వడం అనే అంశం వెనుక అనేకమందికి తెలియని శాస్త్రీయ వివరణ కూడా జోడించబడి ఉంది. ఈ 100మంది కౌరవులు, మరియు చెల్లెలు దుశ్శల కూడా ఒకే పిండం నుండి 101భాగాలుగా విభజించబడి, సృష్టించబడిన వారిగా ఉన్నారు. విభజించబడిన పిండాలన్నిటినీ 101 కుండల్లో భద్రపరచి ప్రత్యేక వాతావరణాన్ని కల్పించి వారికి జన్మను ఇచ్చేలా అప్పటి శాస్త్రం అభివృద్ధి చెంది ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రక్రియ ప్రస్తుతం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియకు సమానంగా ఉంటుంది.

మహాభారతంలో క్లోనింగ్ ప్రక్రియ:

మహాభారతంలో క్లోనింగ్ ప్రక్రియ:

కోరుకున్న వ్యక్తి గుణగణాలను కొడుకు రూపంలో పొందే వరాన్ని ఒక మహర్షి ద్వారా పొందిన కుంతీదేవి, ఆ క్రమంలో భాగంగా సూర్యదేవుని వరంతో కర్ణునికి, యమధర్మరాజు వరంతో ధర్మరాజుకు, వాయుదేవుని వరంతో భీమునికి, ఇంద్రుని వరంతో అర్జునునికి, జన్మనిచ్చింది, అశ్వినీదేవతల వరంతో నకుల సహదేవులకు మాద్రి కోసం జన్మనిచ్చింది. తాము కోరుకున్న వారి గుణగణాలను తమ పిల్లలలో పొందే ఈ ప్రక్రియ, ప్రస్తుతం క్లోనింగ్ వలె అభివర్ణిస్తున్నాము.

సౌర వ్యవస్థ యొక్క ఉనికిని గుర్తించిన మొదటి పండితులు:

సౌర వ్యవస్థ యొక్క ఉనికిని గుర్తించిన మొదటి పండితులు:

చరిత్ర ప్రకారం, మన సౌరవ్యవస్థ యొక్క సూర్యకేంద్రక సిద్దాంతాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించినవారు కోపర్నికస్ అని చరిత్ర ఉన్నప్పటికీ., సూర్యకేంద్రక సిద్దాంతం వలెనే సూర్యుని కేంద్రకంగానే కాకుండా, సౌరవ్యవస్థలో కక్ష్యలో ఉన్న ఇతర గ్రహాలను సైతం మొదటిసారి గుర్తించిన వేదం ఋగ్వేదం. "సూర్యుడు తన కక్షలో, తన చుట్టూ తాను తిరుగుతూ ఉండగా, భూమి మరియు ఇతర గ్రహాలూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి. ఎందుకనగా సూర్యుడు మిగిలిన గ్రహాల కన్నా భారమైన గ్రహం కాబట్టి." - ఋగ్వేదం 1.164.13

మరొక వాస్తవం: టాలమీ అనే మతగురువు ప్రతిపాదించిన భూకేంద్రక సిద్దాంతాన్ని కాదని, సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించినందులకు కోపర్నికస్ అను శాస్త్రవేత్తను, చిత్రవధ చేసినట్లుగా చరిత్ర. కానీ, చివరికి అదే నిజమైంది.

సౌరవ్యవస్థ ఉనికిని గుర్తించిన వేదాలు:

సౌరవ్యవస్థ ఉనికిని గుర్తించిన వేదాలు:

"సూర్యుడు తన కక్ష్యలో తాను తిరుగుతూ, భూమిని మరియు ఇతర గ్రహాలను పట్టి ఉంచుతూ, పరస్పరం పరస్పరం ఘర్షణలకు లోనుకాకుండా ఒక అసాధారణశక్తితో(గురుత్వాకర్షణ శక్తి) నియంత్రించగలడు."– ఋగ్వేదం 1.35.9

శుశ్రుతుడు రాసిన శుశ్రుత సంహిత, ప్రాచీన కాలపు వైద్య విధానాన్ని మరియు శస్త్రచికిత్సల ఎన్సైక్లోపీడియాగా ఉంది:

శుశ్రుతుడు రాసిన శుశ్రుత సంహిత, ప్రాచీన కాలపు వైద్య విధానాన్ని మరియు శస్త్రచికిత్సల ఎన్సైక్లోపీడియాగా ఉంది:

Image source: wikinow.co

క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన శుశ్రుత సంహితలో 1,120 అనారోగ్యాలు, 700 రకాల ఔషధ మొక్కలు, ఖనిజ వనరుల నుండి 64 సమ్మేళనాలు మరియు జంతు వనరుల ఆధారంగా 57 సమ్మేళనాల వివరణలతో కూడిన 184 అధ్యాయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. దీని రచయిత అయిన శుశ్రుతుడు మానవ వైద్య శస్త్రచికిత్సలను నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా పరిగణించబడుతున్నారు. ఒక వెంట్రుకను 100 ముక్కలు చేయగలిగిన ఆయుధాన్నిసైతం తయారుచేసుకున్న వానిగా శుశ్రుతునికి పేరుంది.

ఈ పుస్తకంలో అంధత్వం, మానవుల శరీరనిర్మాణం, పిండోత్పత్తి శాస్త్రం, రోగిలో రక్తనాళాల స్థానాలు మరియు ముఖ్యమైన శరీర అంతర్గత నిర్మాణాల(మర్మ) రక్షణా పద్దతుల గురించిన వివరాలు ఉన్నాయి.

ఒక జీవించి ఉన్న వ్యక్తి దంతాల మరమ్మత్తుకోసం డ్రిల్లింగ్ చేసే వ్యవస్థను 9000సంవత్సరాల క్రితమే ఉన్నట్లుగా ఉన్న లిఖితపూర్వకమైన సాక్షాలను మెహర్గ త్రవ్వకాలలో కనుగొనబడింది.

గమనిక : ఈ మెహెర్గా అనేది సింధూలోయ పరీవాహక ప్రాంతంలో ఒకప్పుడు కొలువుదీరిన మొహొంజోదారో హరప్పా సంస్కృతి వంటింది. ఇండియా, బెలూచిస్థాన్, పాకిస్తాన్ ప్రాంతాలలో ఈ నాగరికత మూలాలు ఉన్నట్లుగా కనుగొనబడింది.

మనం ఇదివరకే కాంతి వేగాన్ని గురించిన అంచనాలను కలిగి ఉన్నాం:

మనం ఇదివరకే కాంతి వేగాన్ని గురించిన అంచనాలను కలిగి ఉన్నాం:

14వ శతాబ్దానికి చెందిన వేదాంత పండితుడైన సాయనుడు ఒకసారి ఇలా అన్నాడు, "అత్యంత భక్తిశ్రద్దలతో నేను సూర్యుడికి నమస్కరిస్తాను, ఎవరైతే అర నిమేషం(నిమిషం కాదు) 2,202 యోజనాల దూరాన్ని ప్రయాణిస్తారో వారికి." అని. ఒక యోజనం అనగా 9 మైళ్ళు; ఒక నిమేషము అనగా 2 లో 16/75 భాగము. అందువలన, 2,202 యోజనాలు x 9 మైళ్ళు x 75/8 నిమేషాలు = సెకనుకు 185,794 మైళ్ళు లేదా సెకనుకు 2,99,000 కిలోమీటర్లు. ఇది "శాస్త్రీయంగా నిరూపితమైన" సెకనుకు 3,00,000 కిలోమీటర్లకి ఆశ్చర్యకరంగా దగ్గరగా ఉంటుంది. ఈ సంఖ్య కనుగొనడానికి మూలంగా వేదాలను పరిగణించడానికి కారణమిదే.

భారతీయ వేదాలు పాశ్చాత్య దేశాలకన్నా ముందుగానే గురుత్వాకర్షణ గురించిన వివరాలను చిత్రీకరించాయి:

భారతీయ వేదాలు పాశ్చాత్య దేశాలకన్నా ముందుగానే గురుత్వాకర్షణ గురించిన వివరాలను చిత్రీకరించాయి:

ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణను వివరించడానికి ముందే, పురాతన భారతీయ పండితులు అప్పటికే గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ఎలా పని చేశారో వివరించినట్లుగా ఋగ్వేదంలో ఉంది. "ఈ భూమి చేతులు మరియు కాళ్లు లేనిది, అయినా ముందుకు కదులుతుంది. భూమి మీద ఉన్న వస్తువులు కూడా దానితో కదులుతాయి. మరియు సూర్యుని చుట్టూ కదులుతుంది."- ఋగ్వేదం :10.22.14

'హనుమాన్ చాలిసా' భూమి మరియు సూర్యుని మధ్య ఉన్న దూరాన్ని సైతం లెక్కిస్తుంది

'హనుమాన్ చాలిసా' భూమి మరియు సూర్యుని మధ్య ఉన్న దూరాన్ని సైతం లెక్కిస్తుంది":

"యుగ సహస్ర యోజన పార్ భను, లీల్యో తాహి మధురా ఫల్ జాను" అని హనుమాన్ చాలీసాలో ఉంది. అనగా హనుమంతుడు సూర్యుని ఒక పండుగా ఆలోచించి అన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు అని వివరించే క్రమంలో ఇలా చెప్పబడింది. అదే వ్యాఖ్య యొక్క అనువాదాన్ని చూస్తే హనుమంతుడు ప్రయాణించిన దూరాన్ని వెల్లడిస్తుంది. 1యుగం = 12000 సంవత్సరాలు. 1సహస్ర యుగం = 1,20,00,000 సంవత్సరాలు మరియు, 1 యోజనం = 8 మైళ్ళు.

అందువలన, "యుగ సహస్ర యోజన", మొదటి 3 పదాలకు అర్ధం తీసుకుంటే 12000X12000000X8 = 96000000 మైళ్ళు లేదా 153,600,000 కిలోమీటర్లు. ఆసక్తికరంగా, భూమి నుండి సూర్యునికి అసలు దూరంగా 152,000,000 కిలోమీటర్లు ఉంది. ఇంచుమించు 1 శాతం లోపంతో.

భూమి చుట్టుకొలత అంచనా వేసిన మొట్టమొదటివారు :

భూమి చుట్టుకొలత అంచనా వేసిన మొట్టమొదటివారు :

నిజానికి, ఈ ఆవిష్కరణ చేసినందుకు గ్రీకులు ఎంతగానో ఆనందిస్తారు, అయితే వాస్తవానికి ఆర్యభట్ట, భూమి ఒక అక్షం మీద తిరుగుతున్నదన్న ఊహను రుజువు చేసేందుకు ఒక సూత్రాన్ని కనుగొన్నాడు. అప్పుడు, "పై" విలువను 3.1416గా అంచనా వేయడం ద్వారా, భూమి చుట్టుకొలత సుమారుగా 39736కిలోమీటర్లు అని నిర్ధారించారు. భూగోళపు వాస్తవ చుట్టుకొలతగా నేడు శాస్త్రవేత్తలచే 40,075కిలోమీటర్లుగా నిర్ధారించబడింది.

చరిత్ర ప్రకారం, "పై" యొక్క అహేతుక విలువను యూరప్లో 1761లో లాంబెర్ట్ చేత నిరూపించబడింది. గొప్ప భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట "పై" విలువ మీద ప్రయోగాలు చేసి, చివరకు అహేతుకమని నిర్ధారించి దాని విలువ సుమారుగా 3.1416 గా కనుగొన్నాడు. అతను తన 23 ఏళ్ల వయస్సులో క్రీస్తు పూర్వం 499లో ఈ ఘనతను సాధించాడు.

ఒక సంవత్సరం యొక్క ఖచ్చితమైన కాలాన్ని కనుగొన్నారు:

ఒక సంవత్సరం యొక్క ఖచ్చితమైన కాలాన్ని కనుగొన్నారు:

ప్రాచీన భారతీయులు సంవత్సరం పొడవును కొలిచేందుకు నక్రత్రాలు, సవానా, లూనార్ మరియు సౌర అనే 4 మార్గాలను ఉపయోగించారు. సౌర కాలాలు నిర్వచించే ఉష్ణమండల రాశిచక్రం ఆధారితం కూడా ఒక పద్ధతిగా ఉంది: విషువత్ చలనాలు, సూర్యాస్తమయాలు, అర్ధ వార్షిక భాగాలు, మరియు ఆరు ఋతువులకు సంబంధించిన నెలలు మొదలైనవి ఇందులో భాగంగా తీసుకునేవారు. నమ్మదగని విధంగా, సంవత్సరం పొడవును సుమారుగా 365 రోజుల, 6 గంటలు 12 నిమిషాలు 30 సెకన్ల వ్యవధిని అంచనా వేసింది. ఆంగ్లసంవత్సరం ప్రకారం 365 లేదా 366 (లీఫ్) కు ఇంచుమించు సమానం.

'భయపడే' గ్రహణాల వెనుక కూడా సైన్స్ వివరించిన వేదాలు:

'భయపడే' గ్రహణాల వెనుక కూడా సైన్స్ వివరించిన వేదాలు:

ప్రపంచమంతా గ్రహణాలకు ఎక్కువగా భయపడుతూ కనిపిస్తుంది, క్రమంగా ఆరోజు జరిగే కొన్ని సమస్యలను గ్రహణ ప్రభావాలుగా కూడా చిత్రీకరిస్తుంది. అన్నిరకాల అభూతకల్పనలకు, మరియు అతీతమైన సంఘటనలకు సంబంధించి, శాస్త్రీయ వివరణను వేదాలు ఇదివరకే చర్చించాయి. చంద్రుడు స్వీయ ప్రకాశకం కాని ఉపగ్రహం అని కూడా వీరికి తెలుసని చెప్పబడింది. "ఓ సూర్యదేవా! నీ వెలుగును బహుమతిగా పొందిన చంద్రుడు, నీ వెలుగును సైతం అడ్డుకుని భూమిని ఆకస్మిక చీకట్లకు గురిచేసి భయపెడుతున్నాడు"- ఋగ్వేదం 5.40.5

చదరంగం ఆట:

చదరంగం ఆట:

చదరంగం ఆట, ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతిగా చెప్పబడింది. అదనంగా యోగా, ఆయుర్వేదం, ఆల్జీబ్రా, దశాంశ వ్యవస్థ మరియు అనేక ఇతర విషయాలు కూడా పురాతన భారతదేశంలోని మన పండితులే కనుగొన్నారని వేదాలు సూచిస్తున్నాయి. అందుకే అన్నారు ఇన్క్రెడిబుల్ ఇండియా అని!

English summary

Eleven Unknown facts about ancient India that will mesmerize you

India is a country that will mesmerize you with its intrig uing history and fascinating past. The country is no ordinary country. In fact, it had the components of a prosperous nation since ancient times only. Here are facts, as found in our written and oral literature, about the supremely advanced ancient India that you were never taught in school.
Story first published: Saturday, September 8, 2018, 16:05 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more