For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క ఫాదర్ తో గడిపాను అని చెప్పినందుకు 5మంది ఫాదర్లు ఆమెను అనుభవించారు, మరో సన్యాసినిపై 13 సార్లు

తిరువళ్లకు చెందిన వివాహిత పెళ్లికి ముందు ఓ ఫాదర్‌తో సన్నిహితంగా గడిపింది. తన తప్పును ఆమె పెళ్లయిన తర్వాత పదే పదే తలచుకొని కుమిలిపోయింది. కేరళలో అత్యాచారం, కేరళ ఫాదర్, కేరళ సన్యాసినిపై అత్యాచారం

|

కేరళలో ఒక వివాహితను బెదిరించి ఐదుగురు చర్చ్ ఫాదర్లు ఇష్టానుసారంగా అనుభవించిన ఘటనతో పాటు ఒక సన్యాసినిపై (నన్) బిషప్ 13 సార్లు అత్యాచారం చేసిన ఘటనలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి.ఓ వివాహితపై ఐదుగురు మలంకర ఆర్థొడాక్స్‌ చర్చ్‌ ఫాదర్ల అత్యాచారం జరిపారు. వివాహితను బ్లాక్ మెయిల్ చేసి చర్చ్ ఫాదర్ లు దారుణంగా అత్యాచారాలు చేశారు. తిరువళ్లకు చెందిన వివాహిత పెళ్లికి ముందు ఓ ఫాదర్‌తో సన్నిహితంగా గడిపింది. తన తప్పును ఆమె పెళ్లయిన తర్వాత పదే పదే తలచుకొని కుమిలిపోయింది.

సాంత్వన పొందేందుకు చర్చికొచ్చింది

సాంత్వన పొందేందుకు చర్చికొచ్చింది

జీసస్‌ ఎదుట చెప్పుకొని సాంత్వన పొందేందుకు చర్చికొచ్చింది. అక్కడ ఉన్న మరో ఫాదర్‌తో తన పట్ల జరిగిన ఘోరాన్ని చెప్పుకొంది. అమె బలహీనతను ఆసరాగా చేసుకొని ఆ ఫాదర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను ఇష్టానుసారంగా అనుభవించాడు. తర్వాత ఆమెతో నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు దిగాడు. ఆమెతో తాను ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను అతడు మరో ఫాదర్‌కు పంపాడు.

అత్యాచారానికి పాల్పడ్డారు

అత్యాచారానికి పాల్పడ్డారు

ఇలా పరస్పరం వీడియోలు, ఫొటోలు పంపుకొన్నఐదుగురు ఫాదర్లు.. వాటిని ఆమెకు చూపించి బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. గత ఫిబ్రవరిలో తన భార్య మెయిల్‌కు ఓ హోటల్‌కు సంబంధించిన భారీ బిల్లు రావడంతో అనుమానించిన భర్త గట్టిగా అడిగే సరికి బాధితురాలు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది.

సస్పెండ్‌ చేసింది

సస్పెండ్‌ చేసింది

బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐదుగురు ఫాదర్లను చర్చి నిర్వహణ కమిటీ సస్పెండ్‌ చేసింది. తన భార్య పట్ల జరిగిన దారుణాన్ని భర్త.. మరో వ్యక్తితో ఫోన్‌లో పంచుకున్న సంభాషణల తాలూ కు ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎట్టకేలకు కేరళ పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రత్యేకంగా దర్యాప్తు

ప్రత్యేకంగా దర్యాప్తు

వివాహితను బ్లాక్ మెయిల్ చేసి చర్చ్ ఫాదర్ లు జరిపిన దారుణంపై కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహ్రా దర్యాప్తు జరపాలని క్రైంబ్రాంచ్ పోలీసులను ఆదేశించారు. ఈ దారుణ ఘటనపై దర్యాప్తునకు ఎర్నాకులం క్రైంబ్రాంచ్ ఎస్పీ సాబు మ్యాథ్యూ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని డీజీపీ నియమించారు. బాధిత వివాహిత ఫిర్యాదు చేయకపోవడంతో జాతీయ మహిళా కమిషన్ ఆదేశంతో తాము దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ లోక్ నాథ్ చెప్పారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్చుతానందన్ ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు.

సన్యాసినిపై 13 సార్లు అత్యాచారం

సన్యాసినిపై 13 సార్లు అత్యాచారం

ఇక వివాహితపై ఐదుగురు చర్చ్ ఫాదర్ లు అత్యాచారం జరిపిన ఘటన మరవక ముందే మరో కేథలిక్ బిషప్ క్రైస్తవ సన్యాసిని (నన్‌)పై అత్యాచారం జరిపిన బాగోతం వెలుగుచూసింది. తనపై ఉత్తర భారతదేశానికి చెందిన డయాసిస్ కేథలిక్ బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఓ నన్ కొట్టాయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

అతిధి గృహంలో అత్యాచారం

అతిధి గృహంలో అత్యాచారం

2014లో అనాథ ఆశ్రమం వద్ద ఉన్న అతిధి గృహంలో బిషప్ తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని నన్ పేర్కొంది. బిషప్ నిర్వాకంపై తాను చర్చ్ అథారిటీకి ఫిర్యాదు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నన్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించింది.

బదిలీ చేసినందుకే

బదిలీ చేసినందుకే

కాగా తాను నన్ ను బదిలీ చేశాననే కోపంతో ఇలా ఫిర్యాదు చేసిందని బిషప్ పోలీసులకు కౌంటర్ పిటిషన్ సమర్పించారు. కేరళలో జరిగిన ఈ రెండు సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

English summary

five kerala church priests sexually abuse blackmail married woman

five kerala church priests sexually abuse blackmail married woman
Desktop Bottom Promotion