అమ్మాయిలు బీర్ తాగితేనే గింజుకుంటున్నావ్.. అమ్మాయిలు పోర్న్ కూడా చూస్తారు సీఎంగారూ..

Written By:
Subscribe to Boldsky

బీర్ ఇప్పుడు దీన్ని మగాళ్లే కాదు.. ఆడవారు కూడా బాగానే తాగుతున్నారంట. ఈ విషయం ఆ మధ్య ఒక సర్వేలో కూడా తేలింది. దీంతో గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ కాస్త కోపం వచ్చింది. అమ్మాయిలు కూడా బీర్లు ఇలా ఇష్టానుసారంగా తాగితే ఎలా అంటూ కాస్త మండిపడ్డడాడు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ కు నచ్చలేదు

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ కు నచ్చలేదు

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ మహిళలు బీర్ తాగడం అస్సలు నచ్చలేనట్లుంది. ఇక తన మనస్సులో ఉన్న మాటల్ని మొత్తం తాజాగా బయటపెట్టాడు. అమ్మాయిలకు బీర్లు తాగడం భలే ఇష్టమున్నట్టుంది.. అమ్మాయిలు పరిమితి దాటి బీర్లు తాగేస్తున్నారు. ఇది చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటూ కాస్త బాధను కాస్త కోపాన్ని వెల్లగక్కాడు.

అమ్మాయిలు అంతా అలాంటి వారు కాదు

అమ్మాయిలు అంతా అలాంటి వారు కాదు

గోవాలో ఆ మధ్య జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ సమావేశంలో ఈ లొల్లంతా జరిగింది. అలా అని నేను అమ్మాయిలు అంతా అలాంటి వారు అని అనడం లేదు. మన గోవాలో ఈ రెండేళ్లలో మద్యం తాగుతున్న అమ్మాయిల సంఖ్య కాస్త పెరిగిపోయింది. ఆ విషయంలో నాకు కాస్త భయం వేస్తుందని కాస్త బాధపడ్డాడు.

సీఎం మీదకు ఎగబడ్డారు

సీఎం మీదకు ఎగబడ్డారు

ఇక గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ ఆడవారిని ఇన్ని మాటలు అన్నాక వారు ఊరికే ఉంటారా? అవు భయ్ తాగుతాం.. నీదేమి పోతుందంటూ సీఎం మీదకు ఎగబడ్డారు. ఒక చిన్నపాటి ఉద్యమమే తీసుకొచ్చారు.

సోషల్‌ మీడియాలో గళం

సోషల్‌ మీడియాలో గళం

సీఎం మనోహర్‌ పారికర్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో అమ్మాయిలంతా తమ గళం వినిపించడం మొదలుపెట్టారు. 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' #GirlsWhoDrinkBeer అనే హ్యాష్‌ ట్యాగ్ తో ట్విటర్ లో ఫొటోలు పెట్టారు.

బీరు తాగుతూ ఫొటోలు పోస్ట్‌

బీరు తాగుతూ ఫొటోలు పోస్ట్‌

ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో బీరు తాగుతూ ట్విట్టర్ లో ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే వాటిని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ మైండ్ బ్లాంక్ అయ్యింటుంది. ఎందుకంటే ఆ ఫొటోలను ట్యాగ్ చేస్తూ పెట్టిన కామెంట్లు అలా ఉన్నాయి మరి.

పోర్న్ కూడా చూస్తారు

పోర్న్ కూడా చూస్తారు

అమ్మాయిలు బీరు తాగడాన్ని మాత్రమే సీఎం పారికర్‌ కు తెలిసినట్లుంది.. చాలా మంది అమ్మాయిలు పోర్న్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని, తాగిన తర్వాత ఇష్టం వచ్చినట్లు తిడతారని సీఎంకు తెలియనట్లుంది. ఇంక అది తెలిస్తే ఈ సీఎంకు నిద్ర కూడా పట్టదేమో అని ఒక అమ్మాయి పోస్ట్ చేసింది.

బీర్లు తాగే వారే కనపడుతున్నారా

బీర్లు తాగే వారే కనపడుతున్నారా

సీఎం పారికర్ కు బీర్లు తాగే వారే కనపడుతున్నారా? ఎనిమిది నెలల పాటు అత్యాచారనికి గురైన అమ్మాయి విషయం తెలియదా? పట్టపగలు బస్సుల్లో మహిళలను వేధిస్తున్న విషయం తెలియదా అంటూ మరో మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బీరు తాగడం అంటే బాగా ఇష్టం

బీరు తాగడం అంటే బాగా ఇష్టం

అవును.. నేను అమ్మాయినే నాకు బీరు తాగడం అంటే బాగా ఇష్టం. ఇప్పుడేమిటి నీ బాధ అంటూ మరో మహిళ పోస్ట్ చేసింది. కొందరు అమ్మాయిలు తండ్రితో కలిసి కూర్చొని బీరు తాగిన ఫొటోలను పోస్ట్‌ చేయండని పోస్ట్ చేశారు.

పెళ్లిళ్లలో బీర్ పార్టీ

పెళ్లిళ్లలో బీర్ పార్టీ

ఇక ఒక అమ్మాయి చేసిన పోస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంది..

తమ ఫ్రెండ్ పార్టీ అయితే అమ్మాయిలంతా కలిసి పెళ్లికి వెళ్తారు. అక్కడ పెళ్లి కూతురి తండ్రి.. ఏంటమ్మా ఏం కావాలి మీకు అని పెళ్లి కూతురి ఫ్రెండ్స్ ను అడుగుతాడు.

బీర్ తీసుకురండి

బీర్ తీసుకురండి

"ఏం లేదూ అంకుల్.. మా అమ్మాయిలందరికీ బీర్ తీసుకురండి అని అడుతారంట. ఇలా ఫన్నీ జోక్ లతో కూడా సీఎం మనోహర్ పారికర్ పై సెటైర్లు వేస్తున్నారు."

చాలా బోర్

చాలా బోర్

బీర్ లేకుండా గడపడమా.. అలా చేస్తే ఇంకేమన్నా ఉందా అంటూ ఒక మహిళ పోస్ట్ చేశారు. బోర్ లేకుంటే చాలా బోర్ కొడు తుందన్నారు.

చీర్స్

చీర్స్

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు చీర్స్ అంటూ ఒక అమ్మాయి పోస్ట్ చేసింది. అమ్మాయిలంతా ఈ వీకెండ్ లో బీర్ పార్టీ చేసుకుని తన టైమ్ లైన్ కు గర్ల్ హూ డ్రింక్ బీర్ అంటూ పోస్ట్ చేయండని కోరింది.

కూతురికి బీర్ ఇప్పించా

కూతురికి బీర్ ఇప్పించా

మొన్న నా కూతురి బర్త్ డే ఉంటే ముంబైకి తీసుకెళ్లి ఓ హోటల్ లో పార్టీ ఇచ్చాను. ఆమెకు ఇష్టమైన బీర్ ను ఇప్పించాను. ఇద్దరం బీర్ తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేశాం అంటూ ఒక తండ్రి తన కూతురితో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.

బీర్ తాగడం ఆపేస్తారా?

బీర్ తాగడం ఆపేస్తారా?

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పాడని అమ్మాయిలందరూ బీర్ తాగడం ఆపకండి. తాగుదాం పద.. చీర్స్ అంటూ మరో మహిళ పోస్ట్ చేసింది.

భయం ఇదే

భయం ఇదే

అయితే అమ్మాయిలు బీర్ తాగడంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు ఉన్న భయం ఏమిటంటే.. "పర్యాటక రాష్ట్రమైన గోవాలో ఆల్కహాల్ అమ్మకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి... దీంతో పాటు విదేశీయుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది."

తరుచూ గొడవలు

తరుచూ గొడవలు

"గోవాలో తరచూ మద్యం తాగి గొడవలు చేసే ఉదంతాలు ఎక్కువవుతున్నాయి.. ఇక అమ్మాయిలు కూడా ఆల్కహాల్ తాగితే శాంతిభద్రతలకు కాస్త ఆటంకం కలిగే అవకాశం ఉందనేది" గోవా సీఎం ఉద్దేశం.

Image Source:https://twitter.com/hashtag/girlswhodrinkbeer?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Ehashtag

http://www.news18.com/news/buzz/sorry-mr-parrikar-girlswhodrinkbeer-are-taking-over-twitter-1656857.html

English summary

girls beer the bias

girls beer the bias.. Goa Chief Minister Manohar Parrikar is a worried man these days because girls have started consuming alcohol.
Subscribe Newsletter