ప్రభుత్వ ఉద్యోగాలను ఈ రాశుల వారు అస్సలు చేయలేరు మరియు వారికీ అంతగా సరిపడవు

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చాలా మంది తమ జీవితంలో ఉద్యోగాన్ని చేయాలని భావిస్తూ ఉంటారు. తమ వ్యక్తిత్వానికి మరియు ఇష్టానికి అనుగుణంగా తమకు నచ్చిన ఉద్యోగాలను చేస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన నానుడి ఏమిటంటే, " మీరు ప్రేమించే ఉద్యోగాన్ని ఎంచుకోండి. అటువంటప్పుడు మీరు మీ యొక్క జీవితంలో ఒక్కరోజు కూడా పనిచేయాల్సిన అవసరం ఉండదు ".

ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా స్థిరంగా సౌకర్యవంతంగా, మరీ అంత పని ఒత్తిడి లేకుండా, టార్గెట్ లు ఏవి ఉండకుండా ఉంటాయి. పదవి విరమణ చేసేంత వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో జీవితం అలా సాగిపోతూనే ఉంటుంది. అదే ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగాలు ఇందుకు పూర్తి విభిన్నంగా ఉంటాయి. అంతర్జాతీయ సంస్థల్లో టార్గెట్లు ఉంటాయి. మీ నుండి సరైన సమయంలో, సరైన పని కావాలని వారు కోరుకుంటారు. మీ ఆరోగ్యం కూడా ఎంతో బాగుండాలి. అంతేకాకుండా ఆయా సంస్థలు ఎంతో ఆశిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు ఆ గమ్యాలను చేరుకోకపోవచ్చు, ఒత్తిడికి లోను కావొచ్చు.

Government Job Not Suited These Zodiac

కొన్ని రాశుల వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే సామర్థ్యం ఉంటుంది. మరికొంతమందేమో ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ఎదో చేసుకుంటూ తమ జీవితాలని చక్కదిద్దుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం మన చెప్పుకోబోయే రాశులవారు ప్రభుత్వ ఉద్యోగాల్లో మరీ అంత బాగా ఇమడలేకపోవచ్చు. వారి యొక్క సామర్ధ్యాన్ని స్వతంత్రంగా ఉపయోగించుకొనే వాతావరణంలో అయితేనే వీరు ఎంతో ఉత్తమంగా రాణించగలరు.

మేషం :

మేషం :

ఎంతో విపరీతమైన పట్టుదల గలవారు, స్వతంత్రంగా వ్యవహరించాలని అనుకుంటారు, విపరీతమైన పోటీ తత్వాన్ని ఇష్టపడతార, ఏది ఉన్నా బాహాటంగా మాట్లాడతారు మరియు ఎన్నో ఉన్నత గమ్యాలను నిర్దేశించుకుంటారు. ఏ ఉద్యోగం అయితే, వ్యక్తుల నుండి ఎక్కువ ఫలితాలను కోరుకుంటుందో మరియు సవాళ్ళను విసిరేదిగా ఉంటుందో అటువంటి ఉద్యోగాలు చేయడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సాధారణంగా చేసే ప్రభుత్వ ఉద్యోగాలు వీరు అస్సలు ఇష్టపడరు. అలాంటి ఉద్యోగాలు చేయడం వల్ల వీరికి సంతృప్తి కూడా కలగదు. ఎప్పడూ ఎదో సరికొత్త సవాళ్లు విసిరే ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు.

మిథునరాశి :

మిథునరాశి :

నైపుణ్యం కలవారు, ఎన్నో విద్యలు తెలిసినవారు, ఉత్సాహవంతులైనవారు, ఎన్నో పనులను ఒకే సమయంలో చేయగలిగే వారు మరియు ఎప్పుడు మార్పుని కోరుకునే వారు మిథునరాశి వారు. సాధారణమైన ప్రభుత్వ ఉద్యోగం, ఎప్పుడు చేసే పనిని అలానే చేస్తూ ఉండటానికి అస్సలు ఇష్టపడరు. విపరీతమైన విసుగు చెందుతూ ఉంటారు. ఏదైనా పనిని ఉత్తమంగా చేయడానికి విభిన్నమైన మరియు సరికొత్త దారులను ఎంచుకుంటుంటారు.

సింహరాశి :

సింహరాశి :

క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. అధికార దాహంతో ఉంటారు. శక్తి విపరీతంగా ఉంటుంది. ఎప్పుడూ తామే ముందుండి నడిపించాలని భావిస్తుంటారు ఈ సింహరాశి వారు.

ఎవరి క్రింద అయినా పనిచేయాలన్నా మరియు వేరొకరి నుండి ఆజ్ఞలు తీసుకోవడానికి ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు. ప్రతిష్టాత్మకంగా వ్యవహరించడానికి మరియు ఆధిపత్యం ప్రదర్శించడానికి ఉవ్విళూరే ఈ రాశివారు ఎదో బల్ల పై కూర్చొని ప్రభుత్వ ఉద్యోగం చేయమంటే, చేయడానికి ఆసక్తి చూపించరు. క్లిష్టమైన సమయాల్లో సరిగ్గా వ్యవహరించడంలో సిద్ద హస్తులు కాబట్టి, వీరు పై స్థాయిల్లో పనిచేస్తే బాగుంటుంది.

వృశ్చికం :

వృశ్చికం :

అధికారదాహంతో ఉంటారు, విపరీతంగా కష్టపడతారు , బాగా పట్టుదల కలిగినవారు మరియు పనిపై అభిరుచి కలవారు వృశ్చికరాశి వారు. సౌకర్యవంతంగా ఉండి సవాళ్లు విసరని ఉద్యోగాన్ని చేయాలంటే వీరు ఎక్కువగా ఇష్టపడరు. చాలా ఎక్కువ అవిశ్రాంతంగా భావిస్తూ ఉంటారు. కష్టతరమైన మరియు సంక్లిష్టమైన వ్యవహారాలు వీరిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అటువంటి సమయాల్లో వీరు తమ శక్తికి మించి మరియు పరిధులు దాటి పనిచేయడానికి కూడా ఇష్టపడతారు.

ధనస్సు :

ధనస్సు :

ఈ స్వతంత్ర స్వభావం కలిగిన రాశివారు ఎక్కువగా యాత్రలు చేయడానికి లేదా తిరగడానికి ఇష్టపడతారు. విభిన్నమైన కొత్త నవలా అనుభవాలను తెలుసుకోవడానికి, అనుభవించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు మరియు కొత్తవాటిని కనుక్కోవడాన్ని ప్రేమిస్తారు. ఎక్కువగా తరచూ ప్రజలతో మాట్లాడటాన్ని వీరు ఇష్టపడతారు.ఎదో బల్ల పై కూర్చొని చేసుకొనే ప్రభుత్వ ఉద్యోగం వీరి ఆలోచన సామర్ధ్యానికి పరిధులు పెడుతుంది మరియు వీరి యొక్క చాతుర్యం మూలాన పడిపోతుంది.

మకరం :

మకరం :

తెలివిగలవారు, తర్కంగా ఆలోచించగలవారు, ఉన్నతమైన లక్ష్యాలు కలవారు, అధికారాన్ని వినియోగించుకోవాలనుకొనే వారు, వారికంటూ తగినంత స్వేచ్ఛను స్థలాన్ని ఇవ్వకపోతే, వృత్తిపరంగా అంతగా ఎదగలేని వ్యక్తులు మకరరాశివారు. ఈ మకరరాశి వారు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ ఉద్యోగం అయితే లక్ష్యాలను నిర్దేశించి వాటిని అందుకోవాలని చెబుతాయో అలాంటి ఉద్యోగాలు మరియు వాతావరణం లో పని చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తారు. ఇటువంటి వారు, అటువంటి సందర్భాల్లో వారి యొక్క సంస్థాగత నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.

కుంభం :

కుంభం :

తెలివిగలవారు మరియు ప్రగతిశీలంగా ఆలోచించగలిగే వారు, వారికంటూ తగిన స్వేచ్ఛను కోరుకునే వారు మరియు స్వతంత్రంగా అలోచించి తమను తాము నిరూపించుకొని తాము గొప్ప దూరదృష్టికలవారు అని అనిపించుకోవాలని కుంభ రాశివారు భావిస్తారు. వీరు నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు మరియు వారి యొక్క పనుల పట్ల స్థితి స్థాపకంగా ఉంటారు. సాధారణమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇటువంటి వ్యక్తులు తమ యొక్క ఆలోచనలను అమలుపరచలేరు. వీరు విభిన్నంగా ఆలోచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరియు ఇటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం అంతగా సరిపడకపోవచ్చు. ఎందుకంటే అక్కడ కొన్ని నిర్దిష్టమైన విధివిధానాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది.

English summary

Government Job Not Suited These Zodiac

A better part of one’s life is spent doing a job. It thus makes sense to pick a job suited to one’s personality and interest. As the wise say,” Choose a job you love and you will never have to work a day in your life.”
Story first published: Tuesday, March 13, 2018, 8:00 [IST]