For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మా స్వలింగ సంపర్కాన్ని ఎవరూ అంగీకరించడం లేదు.. అందుకే చచ్చిపోతున్నాం

  |

  వారి ఇద్దరి అభిరుచులు ఒక్కటైనప్పటికీ వారిని ఈ లోకం కలిసి బతకనివ్వడం లేదని వారు బాధపడ్డారు.

  కలిసి ఎలాగో బతకలేకపోతున్నాం.. కనీసం కలిసి అయినా మరణిద్దాం అని వారిద్దరూ డిసైడ్ అయ్యారు. ఇక తాము చేసేది ఏమీ లేదంటూ చనిపోయారు. స్వర్గంలో కలిసి బతికేందుకే ఈ లోకాన్ని విడిచిపోతున్నాం.

  మాకు ఏ మగతోడు లేదు. మా ఇద్దరి అభిరుచులు నచ్చి దగ్గరయ్యాం. కానీ, సమాజం మమల్ని ఒక్కటిగా బతకనివ్వట్లేదు. అందుకే కలిసి చావాలనుకుంటున్నాం.... అంటూ సూసైడ్‌ నోట్‌ రాసిన లెస్బియన్‌ జంట సబర్మతీ నదిలో దూకి చనిపోయారు. వీరితోపాటు ఓ పసిబిడ్డను కూడా తీసుకెళ్లారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..

  వీరిద్దరి భర్తలూ దూరమయ్యారు

  వీరిద్దరి భర్తలూ దూరమయ్యారు

  గుజరాత్ రాష్ట్రంలోని బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదేప్రాంతానికి చెందిన భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. వీరిద్దరి భర్తలూ దూరమయ్యారు. దీంతో ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఇద్దరూ కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ, త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు.

  గ్రామ పెద్దలు అడ్డుచెప్పారు

  గ్రామ పెద్దలు అడ్డుచెప్పారు

  అయితే గ్రామ పెద్దలు మాత్రం వీరికి అడ్డుచెప్పారు. దీంతో భావన, ఆశా తన కూతురు మేఘాను తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఊరి నుంచి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ అనూహ్యాంగా నదిలో శవాలై కొట్టుకొచ్చారు.

  మృతదేహాన్ని వెలికి తీసే క్రమంలో

  మృతదేహాన్ని వెలికి తీసే క్రమంలో

  సబర్మతి నదీ తీరంలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చిందని గుజారీ బజార్‌ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మృత దేహాన్ని వెలికి తీసే క్రమంలో మరో మహిళ మృత దేహాం కూడా బయటపడింది. ఆ రెండు దేహాలు కట్టేసి ఉన్నాయి. కాస్త దూరంలో ఒడ్డున కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారిని గుర్తించారు.

  కానీ ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయింది.

  లిప్‌ స్టిక్‌తో సూసైడ్‌ నోట్‌

  లిప్‌ స్టిక్‌తో సూసైడ్‌ నోట్‌

  నదీ తీరం వెంబడి ఉన్న గోడపై లిప్‌ స్టిక్‌తో వారిద్దరూ సూసైడ్‌ నోట్‌ రాశారు. కాస్త దూరంలో కూడా ఓ పేపర్‌ ప్లేట్‌పై తమ ఆవేదనను వెల్లగక్కుతూ మరో నోట్‌ రాశారు. అక్కడికి కాస్త దూరంలో దొరికిన బ్యాగులో ఆధార్‌ కార్డుల ఆధారంగా మృతులను గుర్తించి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు.

  స్వలింగ సంపర్కం గురించి

  స్వలింగ సంపర్కం గురించి

  అహ్మదాబాద్ జిల్లాలోని రజోడా గ్రామంలోని ఓ ప్రైవేటు కంపెనీలో వీరిద్దరూ పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వలింగ సంపర్కం అనేది మన దేశంలో కూడా ఈ మధ్య ఎక్కువైపోతుంది. అందువల్ల స్వలింగ సంపర్కం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

  స్వలింగ సంపర్కం, చట్టం

  స్వలింగ సంపర్కం, చట్టం

  స్వలింగ సంపర్కం విషయంలో అనేక మలుపులు, మెలికలు ఉన్నాయి. 2013లో సుప్రీంకోర్టు 'ప్రకృతికి విరుద్ధమైన లైంగిక చర్య'ను నేరపూరితంగా పేర్కొంటూ సెక్షన్ 377ను తిరిగి భారతీయ నేరస్మృతిలో చేర్చింది. దీనిలో స్వలింగ సంపర్కం కూడా ఉంది. ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు, లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించే అవకాశం ఉంది.

  గోపత్యా హక్కు

  గోపత్యా హక్కు

  2017, ఆగస్టులో సుప్రీంకోర్టు గోప్యతకు సంబంధించిన అంశంపై, ''లైంగిక ధోరణి అనేది గోపత్యా హక్కులో ఒక ముఖ్యమైన అంశం'' అని పేర్కొంది. అంతే కాకుండా, లైంగిక ధోరణి ఆధారంగా వివక్షను ప్రదర్శించడం వ్యక్తిగత గౌరవానికి భంగకరమని తప్పుబట్టింది.

  లైంగిక భావాలు

  లైంగిక భావాలు

  ఎల్‌జీబీటీక్యూఐ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఇంటర్‌సెక్స్) కార్యకర్త ఆదిత్య బంధోపాధ్యాయ, ''మీ వ్యక్తిగత పరిధిలో మీరు స్వలింగ సంపర్కులుగా ఉండడం వరకు ఫర్వాలేదు. కానీ అలాంటి లైంగిక భావాలను మీరు బయట ప్రదర్శించడానికి ప్రయత్నించినపుడు చట్టం దాన్ని నేరపూరితంగా భావిస్తుంది'' అన్నారు.

  సెక్షన్ 377

  సెక్షన్ 377

  కానీ ఇక్కడ విషయం సెక్స్ చుట్టూ కేంద్రీకృతం కాలేదు. ఎల్‌జీబీటీక్యూఐ కార్యకర్త, ఎంట్రప్రెన్యూర్ అయిన నక్షత్ర బాగ్వే, ''మేం కేవలం సెక్స్ కోసం పోరాడడం లేదు. ఇది గుర్తింపు కోసం పోరాటం'' అని తెలిపారు.

  సెక్షన్ 377ను స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని, అందుకే దానిని తొలగించాలని ఎల్‌జీబీటీక్యూఐల హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు పట్టుబడుతున్నారు.

  English summary

  Gujarat lesbian couple commits suicide with child, leaves behind haunting notes

  Gujarat lesbian couple commits suicide with child, leaves behind haunting notes
  Story first published: Tuesday, June 12, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more