Just In
- 16 hrs ago
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- 19 hrs ago
మంగళవారం దినఫలాలు : మీన రాశి వారు అనవసరమైన ఖర్చులు నియంత్రిస్తారు...!
- 1 day ago
ఉగాది వేళ.. ఈ రుచికరమైన వంటకాలను మీరూ ట్రై చేయండి...
- 1 day ago
అబ్బాయిలతో ‘ఆ కార్యం’లో ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!
Don't Miss
- News
ఢిల్లీలో కరోనా రికార్డుల భ్రేక్..: 13వేలు దాటిన కొత్త కేసులు, 200మందికిపైగా మృతి
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Movies
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నగ్నంగా అలా గంటల తరబడి కూర్చొన్నప్పుడు సిగ్గుతో చచ్చిపోయేదాన్ని : న్యూడ్ మోడల్ ధనలక్ష్మి
న్యూడ్ (నగ్నంగా) మోడల్ ధనలక్ష్మి మణి ముదలియార్ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కష్టాలు, ఇబ్బందుల మధ్య కూడా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకుంది ఈమె. ఆమె జీవితకథ ఆధారంగా మరాఠీ సినిమా న్యూడ్ కూడా తీశారు.
ధనలక్ష్మి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో న్యూడ్ (నగ్న) మోడల్‌గా పని చేస్తున్నారు. ఈమె న్యూడ్ మోడలింగ్ చేస్తుంటారు. తన పొట్ట కూటి కోసం ఈమె చేసే ఈ పని ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది.

చెత్తను ఏరుకునేవారు
ఆమెకు ఐదేళ్ల వయసు ఉన్నపుడు చెన్నై నుంచి ముంబై వచ్చారు. వీళ్లు మొత్తం ఆరుగురు పిల్లలు. వీరు ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉండేవారు. ధనలక్ష్మి తల్లిదండ్రులు చెత్తను ఏరుకునేలాంటి చిన్నచిన్న పనులు చేసేవారు. పూట గడవనప్పుడు ధనలక్ష్మి బిచ్చం కూడా ఎత్తుకుంటూ గడిపేది.

చదివించే స్థోమత లేదు
ధనలక్ష్మి చాలా దారిద్ర్యంలో జీవించేది. ఆమెను చదివించే స్థోమత కూడా ఇంట్లో వాళ్లకు ఉండేది కాదు. దీంతో ఆమెను ఇళ్లల్లో పని చేయడానికి పెట్టారు. ఇక తన అమ్మతో కలిసి ధనలక్ష్మి అన్నం, కూరలు, ఎండుచేపలు వండి వాటిని గ్రాంట్ రోడ్ ప్రాంతంలోని నిషా మూవీ థియేటర్ బయట అమ్మేది. దీంతో ఆమెకు సినిమాలపై ఆసక్తి పెరిగింది.

భర్తకు ఇష్టం ఉండేది కాదు
ధనలక్ష్మి సోదరిల్లో ఒక ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత
తన పిల్లలను ధనలక్ష్మి దగ్గరే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పిల్లలందర్నీ ధనలక్ష్మి చూసుకునేదాన్ని. ఇది ధనలక్ష్మి భర్తకు ఇష్టం ఉండేది కాదు. దాంతో అతను ధనలక్ష్మిని చిత్రహింసలు పెట్టేవాడు.

ధనలక్ష్మి భర్త మరణించాడు
అప్పటికే ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారుడికి ఆరేళ్ల వయసు వచ్చినపుడు, మళ్లీ రెండోసారి ధనలక్ష్మి గర్భవతి అయ్యింది. ఆ సమయంలో ధనలక్ష్మి భర్త మరణించాడు. భర్త మరణంతో ధనలక్ష్మి జీవితం మరింత ఆందోళనకరంగా మారింది.

అందంగా ఉండేది
అయితే ధనలక్ష్మి కాస్త అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. భర్త లేడనే కారణంతో ఆమె వైపు అందరూ ఏదోలా చూసేవారు. కొందరు ఆమె అందం చూసి నీకు పని ఇప్పిస్తాం అని చెప్పేవారు. కానీ వాళ్లు ఉద్దేశం వేరే ఉండేది. దీంతో ధనలక్ష్మి వాళ్లు ఇచ్చే ఆఫర్స్ తీసుకునేది కాదు.

రాజమ్మ కోసం..
ధనలక్ష్మికి తెలిసిన రాజమ్మ అనే మహిళ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో పని చేసేది. ఒకసారి ఆమెను కలవడానికి జేజే స్కూల్‌కు వెళ్లింది ధనలక్ష్మి. అక్కడ ఆమె కోసం వెదుకుతూ వెళ్లింది ధనలక్ష్మి. అప్పుడు ఒక విద్యార్థి ధనలక్ష్మిని ఏం కావాలని అడుగుతాడు. తాను రాజమ్మను కలవడానికి వచ్చానని చెబుతుంది ధనలక్ష్మి. దీంతో అతను ధనలక్ష్మిని గదిలోకి తీసుకెళ్తాడు.

నగ్నంగా కూర్చొనే పని చేస్తాను
తాను పని కోసం వచ్చానని, అయినా ఇలా నగ్నంగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అని అడిగింది ధనలక్ష్మి. నేను ఇక్కడ ఇలా నగ్నంగా కూర్చొనే పని చేస్తాను.. ఎలాగూ నేను చేసే పని ఏంటో చూశావు కాబట్టి, నువ్వు కూడా ఈ పని చేయొచ్చు అని రాజమ్మ చెప్పింది. కానీ అందుకు ధనలక్ష్మి అంగీకరించలేదు.

తప్పు పని చేయడం లేదు కదా
మొత్తానికి రాజమ్మ గట్టిగా చెప్పి బతిమిలాడడంతో ధనలక్ష్మి కూడా వెంటనే ఒకే అనింది. అయినా మనం తప్పు పని చేయడం లేదు కదా అని రాజమ్మ ధనలక్ష్మికి నచ్చజెప్పింది. అలా ధనలక్ష్మి న్యూడ్ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆమె నగ్నంగా కూర్చున్నందుకు మొదట రోజుకు 60 రూపాయలు ఇచ్చేవారు. ఇక ఆమె మొదటి సారి నగ్నంగా మారినప్పుడు చాలా ఇబ్బందులు పడింది.

చాలా భయపడుతూ బట్టలు తీసేసి
ఒక విద్యార్థి టేబుల్ తెచ్చి గది మధ్యలో వేయగా ధనలక్ష్మి
చాలా భయపడుతూ బట్టలు తీసేసి ఉండాల్సి వచ్చింది.
తర్వాత ఆమె ఏడ్చింది కూడా. అప్పుటికి ఆమెకు రెండేళ్ల వయసున్న కొడుకున్నాడు. పిల్లాడికి పాలు పట్టేది. దాంతో ఆమె పాలిండ్లు పెద్దగా ఉండేవి. ఆమెకు అది చాలా సిగ్గుగా అనిపించింది. నగ్నంగా అలా గంటల తరబడి మొదటి సారి కూర్చొన్నప్పుడు న్యూడ్ మోడల్ ధనలక్ష్మి సిగ్గుతో లోలోపలచచ్చిపోయేది.

నగ్నంగా కూర్చొవడం స్టార్ట్ చేసింది
కానీ విద్యార్థులంతా ఆమె కన్న తల్లిలాగా భావించి ఆమెకు భరోసా ఇచ్చేవారు. మొత్తానికి ధనలక్ష్మి బట్టలు తీసేసి నగ్నంగా కూర్చొవడం స్టార్ట్ చేసింది. విద్యార్థులు ఆమె బొమ్మను గీసేవారు. అలా ఆమెకు ఆ వృత్తి అలవాటు అయిపోయింది.

25 ఏళ్లుగా పని చేస్తున్నారు
అలా ధనలక్ష్మి ఆ వృత్తిలో 25 ఏళ్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు న్యూడ్ పెయింటింగ్‌కు వెయ్యి రూపాయలు, అదే దుస్తులతో కూర్చుంటే రూ.400 ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త మోడల్స్ కు వాళ్లకు ధనలక్ష్మిశిక్షణ కూడా ఇస్తున్నారు.

'న్యూడ్' కథ ధనలక్ష్మిదే
ఇక మరాఠీ సినిమా 'న్యూడ్' కథ ధనలక్ష్మిదే. ధనలక్ష్మి న్యూడ్ మోడల్‌గా పని చేస్తున్నట్లు తన పిల్లలకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ న్యూడ్ సినిమా తర్వాత ఆ విషయం ఆమె పిల్లలకు కూడా చెప్పింది. మొదట వాళ్లు ధనలక్ష్మిపై కోపడ్డారు. తర్వాత అర్థం చేసుకున్నారు.

పెద్దగా సంపాదించుకోలేదు
ఇన్నేళ్లుగా ఆమె న్యూడ్ మోడల్ గా పని చేస్తున్నా పెద్దగా సంపాదించుకున్నది మాత్రం లేదు. తప్పు దారిలో నడవకుండా... మనం చేసే పనిని ప్రేమిస్తూ వెళ్తే అందరికీ ఆదర్శంగా నిలుస్తామనడానికి ధనలక్ష్మి నిదర్శనం.