For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వేలి ముద్రలు మీ వ్యక్తిత్వాన్ని సూచించగలవా?

|

ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అనేక విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క అంతరాత్మను తెలుసుకోవడం కోసం, కొన్ని భౌతిక విషయాలను కూడా తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే హస్త సాముద్రికం, కాలి రేఖలు, నుదిటి రేఖలు వంటివి అనేకం ఉన్నాయి. అదేకోవలో వేలి ముద్రలు కూడా వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి.

ఇక్కడ, ఈ వ్యాసంలో, వేర్వేరు రకాల ప్రజలకు సంబంధించిన వేలిముద్రల వాస్తవాలను మీకు వెల్లడి చేస్తున్నాము.

నిజానికి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి వేలి ముద్రలు కూడా మరొక వ్యక్తితో సమానంగా ఉండవు. కానీ కొన్ని పోలికలు ద్వారా అంచనా వేయవచ్చు. తద్వారా వేలిముద్రలలోని సారూప్యతలు, పోలికలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి బహిర్గతం చేస్తాయి.

Understanding Your Personality As Per Your Fingerprints

విజ్ఞాన శాస్త్రం ప్రకారం, మూడు వేర్వేరు రకాల వేలిముద్రలు ఉన్నాయి. ఇవి వాటి వైవిధ్యాలు, ఒక వ్యక్తి యొక్క వేలిముద్రలతో ముడిపడివున్న వ్యక్తిత్వాన్ని ఎలా వర్ణించాలో వివరిస్తుంది.

వ్యాసంలోకి కొనసాగే ముందు మీ వేలి ముద్రలు ఏ రకానికి చెందినవో తెలుసుకోవడం ముఖ్యం.

లూప్స్ వేలిముద్రలు:

లూప్స్ వేలిముద్రలు:

మీరు మీ వేళ్ళ మీద ఉచ్చులు వలె ముద్రలు ఉన్న వ్యక్తి అయితే, విశాల హృదయం కలిగిన ఉన్నత మనస్కుల వర్గానికి చెందిన వారని అర్ధం. ఈ రకానికి చెందిన వేలిముద్రలు సాధారణంగా ప్రశాంతత, సున్నితత్వం మరియు సంతులిత వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తిని ప్రతిబింబిస్తాయి. ఒక వ్యక్తిగా, మీరు ఎటువంటి క్లిష్ట పరిస్తితులనైనా సాదరంగా ఆహ్వానించే రకాలుగా ఉంటారు. ఇతరులు మీపట్ల ఉన్నత దృక్పధాన్ని కలిగి ఉంటారు. తద్వారా మీకు స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మీలో ఆకర్షణ శక్తి కూడా ఎక్కువే. మీ ప్రశాంతతే మీ తెలివితేటలకు ప్రతిరూపం. భవిష్యత్ కార్యాచరణల పట్ల మీ ఆలోచనలు, లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడగలవు. మరియు ఉత్తమ ఫలితాలకై ఆలోచన చేసే మీ ఆలోచనలపై మీకుటుంబ శ్రేయస్సు ఆధారపడి ఉందన్న అంశాన్ని ఎప్పుడూ విస్మరించరు.

స్విర్ల్స్ లేదా సుడిగుండాల రకాలు:

స్విర్ల్స్ లేదా సుడిగుండాల రకాలు:

మీ వేలిముద్రలు సుడిగుండాలను పోలి ఉంటే, అప్పుడు మీరు భావోద్వేగాల గనిగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించే మనస్థితి మీ సొంతం. మరియు నిగ్రహ సమస్యలను అధికంగా కలిగి ఉంటారు. కోపం, ఆవేశం సర్వసాధారణంగా ఉంటుంది. అలాగని మీరు అసూయను కలిగి ఉన్న వ్యక్తి కాదు. మీ పరిసరాలు, మీకు అనువుగా లేకపోయినా, సంబంధాలలో పొరపొచ్చాలు వంటివి మీరు అస్సలు సహించలేరు. ముక్కుసూటి తత్వానికి, మారుపేరుగా ఉంటారు. అదేమీ చెడు లక్షణం కాదు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేరకం కాదు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే తత్వం మీది. మీ కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు ఎన్నడూ మీ వెంట ఉంటాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీ ప్రియమైన వారిని సంప్రదించే గుణాలను కలిగి ఉంటారు. ఈ అలవాటు మీ మద్య సంబంధాలను కూడా పెంచేలా ఉంటుంది.

కర్వ్ రకాలు(వంకరలుగా) :

కర్వ్ రకాలు(వంకరలుగా) :

మీ వేలి ముద్రలు వంపులుగా ఉంటే, మీరు కోపిష్టి వర్గానికి చెందిన వ్యక్తిగా ఉండే అవకాశo ఉంది. ఈ నమూనాతో ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తిగా ఆత్మ విశ్వాసం కూడిన శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారు. మీ వేలిముద్ర నమూనా వంపులు తిరిగి ఉంటే, మీరు మొండి పట్టుదలగలవారిగా లేదా పూర్తిగా మొండివారై ఉంటారు. ఎల్లప్పుడూ మీ అభిప్రాయానికి కట్టుబడి ఉంటారు. మిమ్ములను నమ్మినవారి పట్ల కట్టుబడి ఉండే రకంగా ఉంటారు. మోసాన్ని అస్సలు సహించలేని వ్యక్తులుగా ఉంటారు. ఒక ప్రణాళికా బద్దమైన జీవన శైలికి మీరెప్పుడు కూడా సుముఖంగా ఉంటారు. మీ ఆలోచనలకు తగ్గ రీతిలో పరిసరాలు లేని పక్షంలో, మీ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఒక్కోసారి ఈ కోపమే మీ సంబంధాల మద్య చిచ్చును రగిలిస్తుంది. కావున జాగ్రత్తగా వ్యవహరించడం మేలు,

వీటితో పాటు, ఇతర రకాల వేలిముద్రలు కూడా ఉన్నాయి. మీ వేలిముద్ర ఈ వర్గాల క్రింద ఉన్నాయేమో తనిఖీ చేయండి.

ఉల్నార్ లూప్ రకం:

ఉల్నార్ లూప్ రకం:

మీ వేలిముద్రలు ఉల్నార్ ఉచ్చుల రకాన్ని కలిగి ఉంటే, ఉచ్చులు వేర్వేరు వైవిధ్యాలను కలిగివుంటాయని నమ్ముతారు మరియు త్రిభుజాకార పాయింట్లతో కూడుకుని కొంచెం వేలు వైపు ప్రవహించే జలపాతం వలె కనిపిస్తుంది. ఈ మీరు వేలిముద్రలు రకం ఉంటే, మీరు సున్నితమైన హృదయం కలవారిగా మాత్రమే కాకుండామ, మీ స్వంత ప్రణాళికలకు మాత్రమే కట్టుబాటి ఉండే రకంగా ఉంటారు. దీనితో పాటు, మీ పరిశీలనా నైపుణ్యాలు మెచ్చుకోదగినవిగా ఉంటాయి. మీలో చెప్పుకోదగ్గ ఉన్నతమైన అంశం అంటే, మీ స్వతంత్ర వైఖరి. వర్తమానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటారు. ఉన్నతమైన విలువలు కలిగి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగేలా మీ చర్యలు ఉంటాయి.

రేడియల్ లూప్ రకం వేలి ముద్రలు:

రేడియల్ లూప్ రకం వేలి ముద్రలు:

మీరు ఉల్నార్ లూపుకు వ్యతిరేకముగా నిర్వచించబడ్డ రేడియల్ ఉచ్చుల రకాన్ని కలిగి ఉన్న ఎడల, పంక్తుల యొక్క ప్రవాహం బ్రొటన వేలి వైపు మళ్ళించబడుతుంది. మీరు ఈ రకమైన వేలిముద్రను కలిగి ఉంటే, అప్పుడు మీరు తీవ్రమైన స్వతంత్ర భావజాలాలు కలిగిన వారిగా ఉంటారు. మరియు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఎక్కువగా ప్రశ్నించే తత్వం మీ అలవాటుగా ఉంటుంది. తద్వారా శత్రు మూకలు కూడా ఎక్కువగానే ఉంటారు. క్రమంగా అసూయ, ఈర్ష్యా ద్వేషాల సమాజంలో ఉన్న అనుభూతికి లోనవుతుంటారు. కావున దేనికీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, సావధానంగా వ్యవహరించడం ద్వారా ఎన్నో సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి శాస్త్రాలు, రాశి చక్రాలు, మరియు అనేకములైన ఆద్యాత్మిక వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Understanding Your Personality As Per Your Fingerprints

Do you know that your fingerprints can reveal a lot about your personality? Well, the loops, swirl or the curves tend to define an individual's personality. For example, if your fingerprint has loops, then it means you are the kind of person who is usually calm and is said to have a balanced personality.
Story first published: Monday, June 11, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more