For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందులో పురుషులకే మంచి అనుభవం ఉంటుంది... కానీ పూనమ్ నెగి మాత్రం మగవాళ్లనే హడలెత్తిస్తుంది

|

డ్రైవింగ్ అంటే అంత ఈజీ కాదు. అందులో భారీవాహనాలు నడపడం అనేది అస్సలు సులభతరం కాదు. కానీ ఆమె మాత్రం ఎంత పెద్ద వెహికల్ ను అయినా సరే ఈజీగా నడపగలదు. ఆమె పేరే పూనమ్‌ నెగి. ట్రక్స్ నడపడం అనేది పురుషులకు కూడా చాలా కష్టం. అలాంటి ఎంతో సునాయసంగా ట్రక్స్ నడుపుతూ అందరినీ అవాక్కు చేస్తోంది ఈ యువతి.

ఎత్తైనా కొండపై

ఎత్తైనా కొండపై

అది చాలా ఎత్తయిన కొండ. దానిపై రహదారి కూడా ఉంటుంది. దానిపై వాహనాన్ని నడపడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ రోడ్డు వంకర టింకరగా ఉండడమే కాదు, వంపూ ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఆ రోడ్డుపై సాధారణ కార్ల వంటి వాహనాల్లో ప్రయాణించాలన్నా, అసలు ఎలాంటి వాహనాలను నడపాలన్నా గుండెల్లో గుబులు పుట్టకతప్పదు.

చాలా అప్రమత్తంగా నడపాలి

చాలా అప్రమత్తంగా నడపాలి

చాలా అప్రమత్తంగా వాహనాన్ని నడపాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అదుపు తప్పి, వేల అడుగుల లోతు లోయలో పడిపోవాల్సిందే. అందుకనే ఆ ప్రాంతంలో వాహనాల్లో ప్రయాణించే వారు దారి పొడవునా జంకుతూనే ఉంటారు. అలాంటిది ఆ రోడ్డుపై ఇక భారీ వాహనాలను నడిపేవారికి ఎంతటి భయం ఉంటుందో మనం ఇట్టే అర్థంచేసుకోవచ్చు.

పురుషులకు మంచి అనుభవం ఉంటుంది

పురుషులకు మంచి అనుభవం ఉంటుంది

ట్రక్‌ డ్రైవింగ్‌లో ఎక్కువగా పురుషులకు మంచి అనుభవం ఉంటుంది. ఎలాంటి రూట్ లోనైనా పురుషులు ట్రక్స్ ను తీసుకెళ్లగలరు. కానీ కొన్ని రోడ్లలో ఎంత అనుభవం ఉన్న డ్రైవర్లు అయినా సరే ట్రక్స్ ను తీసుకెళ్లలేరు.

పూనమ్ నెగి ఆ రూట్లలో ట్రక్ నడపగలదు

పూనమ్ నెగి ఆ రూట్లలో ట్రక్ నడపగలదు

అలాంటి రూట్లలో కూడా పూనమ్ నెగి ట్రక్స్ ను నడపగలదు. ధైర్యంగా ట్రక్స్ ను తీసుకెళ్లగలదు. పూనమ్ నెగి ఉంటున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతంలోని ఖార్‌దుంగ్‌ లా పాస్‌ అనే పర్వత శ్రేణిపై రహదారి 17,582 అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఎవరికైనా హడల్

ఎవరికైనా హడల్

ఖార్‌దుంగ్‌ లా పాస్‌పై ట్రక్‌ నడపాలంటే ఎవరికైనా హడల్. చాలా అనుభవం ఉన్న పురుష డ్రైవర్లు కూడా ఈ మార్గంపై ట్రక్స్ తీసుకెళ్లాలంటే భయపడతారు. దాదాపుగా ఎవరూ కూడా ఈ మార్గం ద్వారా వెళ్లరు.

వారికి ఎక్కువ ప్రాముఖ్యం

వారికి ఎక్కువ ప్రాముఖ్యం

అయితే ట్రక్స్ ఓనర్స్ మాత్రం ఈ రహదారి గుండా తమ సరుకులను గమ్యానికి చేరవేసే వారికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. అంత ఎత్తు అయిన ఖార్‌దుంగ్‌ లా పాస్‌ రోడ్డుపై కూడా పూనమ్‌ నెగి సునాయసంగా, ఎలాంటి భయంలేకుండా ట్రక్స్ నడపగలదు.

చాలా అలవోకగా

చాలా అలవోకగా

పూనమ్ నెగి ఈ రహదారిపై చాలా అలవోకగా ట్రక్ తీసుకుని వెళ్తుంది. భారీ ట్రక్కును సైతం అవలీలగా నడిపిస్తుంది. దీంతో ఆమె ధైర్యానికి, డ్రైవింగ్‌ స్కిల్‌కు తోటి పురుష డ్రైవర్లు అవాక్కవుతుంటారు.

అంత సులువేం కాదు

అంత సులువేం కాదు

ట్రక్‌ డ్రైవింగ్‌ చేసే స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది ఓ మహిళ హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం, భారీ ట్రక్‌ డ్రైవింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అంటే అంత సులువేం కాదు.

ఎగతాళి చేశారు

ఎగతాళి చేశారు

పూనమ్ నెగి మొదట ట్రక్ నడుపుతానంటే చాలామంది ఎగతాళి చేశారు. కొన్ని ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న మేమే ట్రక్ నడపలేకపోతున్నాం.. నీవల్ల ఏం సాధ్యం అవుతుందని చులకనగా మాట్లాడారు.

అందరూ పొగుడుతున్నారు

అందరూ పొగుడుతున్నారు

పూనమ్ నెగె డ్రైవింగ్‌ స్కిల్‌ చూసిన వారంతా ఇప్పుడు ఆమెను మెచ్చుకుంటున్నారు. డ్రైవింగ్ ఎంతో అనుభవం ఉన్న మగవారు కూడా నడపలేని రోడ్లలో నువ్వు ట్రక్ నడుపుతున్నావంటే చాలా గ్రేట్ అని పూనమ్ నెగిని అందరూ పొగుడుతున్నారు.

యాక్సిడెంట్ జోన్ లోనూ

యాక్సిడెంట్ జోన్ లోనూ

ఇక పూనమ్‌ యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే సిమ్లా కిన్నార్‌ హైవేపై కూడా చాలా అవలీలగా ట్రక్‌ను నడుపుతుంది. అక్కడ పక్కనే సట్లేజ్‌ నదీ ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా పూనమ్‌ ట్రక్‌లో దూసుకెళ్తుంది.

సూపర్బ్

సూపర్బ్

పూనమ్ ఇప్పుడు అక్కడ ఓ సెలబ్రిటీలా అయిపోయింది. ఏది ఏమైనా పూనమ్‌ ధైర్యం, ట్రక్‌ డ్రైవింగ్‌ స్కిల్‌ మాత్రం సూపర్బ్. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పూనమ్ నెగికి హ్యాట్సాప్ చెప్పాలిందే.

Image Credit

English summary

international women's day meet poonam negi lady driver who runs truck on dangerous highways

international women's day..meet poonam negi lady driver who runs truck on dangerous highways..She Is Poonam Negi — Himachal’s 23-Year-Old Truck Driver. Ridiculed By All, Her Aim Is Now Khardung La Pass