వాత్స్యాయనుడి కామసూత్ర గురించి కొన్ని నిజాలు

By Bharath
Subscribe to Boldsky

కామసూత్ర అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి గ్రంథం మనదేశానికి చెందినది కావడం మన అదృష్టం. పాశ్యాత దేశాలు కూడా కామసూత్ర పుస్తకానికి చాలా విలువ ఇస్తున్నాయి. అందులో సారాంశాన్ని గ్రహించి దానికి విలువ ఇచ్చే దేశాలు చాలానే ఉన్నాయి.

కామశాస్త్రంలో ఏమి ఉంటుంది

కామశాస్త్రంలో ఏమి ఉంటుంది

ఇంతటి అద్భుతమైన కామసూత్రం , కామశాస్త్రంలో అసలు ఏమి ఉంటుందో క్లుప్తంగా తెలుసుకోండి. వాత్స్యాయనుడి కామసూత్రం ఏడు అధికరణాల గ్రంథం. దాదాపు 1250కి పైగా సూత్రాలు, ముప్పై ఆరుఅధ్యాయాలున్నాయి.

వేల అంశాలుంటాయి

వేల అంశాలుంటాయి

అయితే ఏ అధ్యాయానికి చాలా క్లియర్ గా ఉంటుంది. ముద్దులు, కౌగిళ్లు, గోళ్లరక్కులు, పంటినొక్కులు, అరుపులు, భావప్రాప్తి, స్త్రీ పురుషులలో రకాలు, వారి మనస్తత్వాలు, లైంగిక విన్యాసాలు ఇలా కొన్ని వేల అంశాలుంటాయి.

ఎక్కడి నుంచి మొదలుపెట్టొచ్చు

ఎక్కడి నుంచి మొదలుపెట్టొచ్చు

శృంగారం గురించి బాగా తెలుసుకోవాలంటే వాత్స్యాయనుడి కామసూత్రంలో మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలనే డౌట్ ఏమి పెట్టుకోకండి. ప్రతి పేజీ కూడా చాలా అమూల్యం.

పరిచయం ఇలా ఉంటుంది

పరిచయం ఇలా ఉంటుంది

కామసూత్ర పీఠికలో వాత్సాయనుడు అతని కంటే పూర్వపు గ్రంథకర్తల రచనలు తన రచనకి ఎలా ఉపయోగపడ్డాయో వివరించారు. తన రచనలోని ఏడు భాగాలనుదత్తకుడు, సువర్ణనభుడు, ఘోతకముఖుడు, గోనర్దియుడు, గోనికపుత్రుడు, చారాయణుడు, కుచుమారుని రచనల ఆధారంగానే రాశానని కూడా వివరించాడు.

పరిచయం భాగంలో ఇవి కూడా ఉంటాయి

పరిచయం భాగంలో ఇవి కూడా ఉంటాయి

వాత్స్యాయనుడి కామసూత్రం పుస్తకంలో పరిచయం ఇలా ఉంటుంది. పరిచయ భాగములో జీవిత గమ్యాలు ప్రాముఖ్య వివరించాడు వాత్స్యాయనుడు. అలాగే విజ్ఞాన సముపార్జన, మంచివారు, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చి నాగరికత తెలిసిన వారి గురించి, విటునికి సహాయపడే మధ్యవర్తుల గురించి పరిచయంలో ఉంటుంది. పరిచయం మొత్తం మొదటి భాగంలో ఉంటుంది.

రెండో భాగంలో శృంగారం సంబంధించి

రెండో భాగంలో శృంగారం సంబంధించి

ఇక రెండో వాత్స్యాయనుడు శృంగార కలయికల గురించి వివరించారు. కామోద్దీపనం, కౌగిలింతల్లో రకాలు, శృంగారం చేసేటప్పుడు ప్రేమగా అమ్మాయిని ఎలా నిమరాలి, ముద్దులు ఎలా పెట్టుకోవాలి, ప్రేమగా గోర్లతో ఎలా గిచ్చాలి (నఖక్షతాలు) పంటితో సున్నితంగా ఎలా ముద్దాడాలనే (దంతక్షతాలు) విషయాలను వివరించాడు.

భంగిమలు కూడా రెండో భాగంలోనే

భంగిమలు కూడా రెండో భాగంలోనే

అలాగే రెండో భాగంలో శృంగార భంగిమలు గురించి కూడా వివరించాడు. అధిక లైంగిక శక్తి గల స్త్రీల గురించి కూడా చెప్పాడు, ఉపరతి, ముఖ రతి, రతికేళి, అంత్యారంభాలను కూడా వివరించాడు.

స్త్రీ ని పొందే విధానం

స్త్రీ ని పొందే విధానం

ఇక మూడో భాగంలో భార్యను ఎలా పొందాలి, వివాహంలో రకాలు వివరించాడు. స్త్రీ ని ప్రశాంతంగా ఉండేట్లు ఎలా చేయాలో వివరించాడు. అలాగే స్త్రీ ని పొందే విధానాన్ని వివరించాడు. ఒంటరిగా గడపటం, వైవాహిక సంగమం ఎలా చేయాలో ఇందులో తెలుసుకోవొచ్చు.

భార్యాధికరణం

భార్యాధికరణం

నాలుగో భాగంలో భార్యాధికరణం గురించి తెలుసుకోవొచ్చు. భార్య భర్తపై చెలాయించే అధికారం, స్వేచ్ఛ గురించి చాలా చక్కగా వర్ణించాడు.

ఇతరుల భార్యల గురించి

ఇతరుల భార్యల గురించి

ఐదో విభాగంలో ఇతరుల భార్యల గురించి వివరించాడు.

ఇందులో స్త్రీ, పురుషుల ప్రవర్తన, పరిచయం ఎలా పెంచుకోవాలో తెలిపాడు. మనోభావాలని పరీక్షించటం, రాయబారాలు నెరపే విధానం గురించి చక్కగా రాశాడు. రాజభోగాలు, గర్భాశయము నడత గురించి వివరించాడు.

వేశ్యాధికరణం

వేశ్యాధికరణం

ఆరో విభాగంలో వేశ్యాధికరణం గురించి ఉంటుంది. ఈ విభాగంలో విటుల ఎంపిక ఎలా చేయాలో తెలుసుకోవొచ్చు. ఒక వేశ్య ఒక స్థిరమైన విటుని కోసం వెతికేవిధానం గురించి వివరించాడు.

వేశ్యలకు సంబంధించిన విషయాలే

వేశ్యలకు సంబంధించిన విషయాలే

అలాగే ఆరో భాగంలో డబ్బు సంపాదించటానికి మార్గాలు, పాత ప్రేమికునితో తిరిగి స్నేహాన్ని చిగురింపజేసుకోవడం వంటి విషయాలుంటాయి. అయితే ఇందులో అన్నీ వేశ్యలకు ఉపయోగపడే విషయాలే ఉంటాయి.

వశీకరణం

వశీకరణం

ఏడో విభాగంలో ఇతరులను ఆకర్షించడం గురించి వివరించాడు. ఈ భాగంలో శారీరక ఆకర్షణను మెరుగుపరచుకోవటం, వశీకరణం, లైంగిక బలహీనతలను అధిగమించడం వంటి విషయాలుంటాయి. మరో ఆర్టికల్ లో కామసూత్రలోని ఒక్కో అంశంపై తెలుసుకుందాం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    lesser known facts about the kamasutra

    ‘Kama’ means desire while ‘sutra’ means the line or the thread which holds things together. So, Kamasutra is a set of guidelines that every individual requires to fulfill his sexual need. When talking about the facts of the Kamasutra, the first thing every couple should keep in mind is that there is no proper set of rules and regulations in the bedroom,
    Story first published: Tuesday, February 20, 2018, 13:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more