For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ ను బహిరంగంగా చూపిస్తే తప్పేంటి ? మీరు చూసే విధానంలో తేడా ఉంటే ఎవరేం చేస్తారు!

|

అమ్మాయి నిండుగా కప్పుకుని ఉంటేనే మగవాడి కళ్లు ఆమెపై పడవా? లేదంటే వేరే కోణంలో అమ్మాయిని చూస్తాడా? అమ్మగా మారిన ఆమె కూడా తన శరీరాన్ని మొత్తం దాచి పెట్టుకోవాలి. బిడ్డ కోసం కొద్దిగా అయినా ఆమె స్వేచ్ఛగా ఉండకూడదా? ఇలాంటి విషయాలపై కొందరు ఆడవారు గళం విప్పుతున్నారు.

శరీరాన్ని ఒక కవచంలాగా కాపాడుకోవాలి

శరీరాన్ని ఒక కవచంలాగా కాపాడుకోవాలి

సహజంగా ఓ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, తోటి అమ్మాయిల మధ్యన ఉన్నప్పుడు పరిశీలించండి. ఆ సమయంలో ఆమె ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవ్వదు. అదే ఇంటి నుంచి ఒక్క అడుగు బయటపెట్టగానే ఆమె శరీరాన్ని ఒక కవచంలాగా కాపాడుకోవాల్సి వస్తుంది. శరీరాన్ని ఒకటికి పదిసార్లు చూసుకుంటుంది.

ఆడవారు కూడా అంతేకదా

ఆడవారు కూడా అంతేకదా

సమాజంలోని చాలా కళ్లు ఆమెను గమనిస్తున్నాయనే విషయం పదే పదే ఆమెకు గుర్తుకొస్తుంది. సమాజంలో ఆడవారిని ఇలా చూడటం ఎంత అమానుషం. మగవారికి కూడా శరీరంలో చాలా భాగాలున్నాయి కదా. ఆడవారికి కూడా అంతే కదా అని మగవారు అనుకోరే.

బ్రెస్ట్ గురించి కూడా మాట్లాడుకోకూడదా?

బ్రెస్ట్ గురించి కూడా మాట్లాడుకోకూడదా?

ఇక అమ్మాయి బ్రెస్ట్‌ గురించి ఎవరైనా వయస్సులో పెద్దగా ఉన్న ఆడవారితో వారితో మాట్లాడితే ''ష్‌...! నిశ్శబ్ధంగా ఉండు. ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు..?!'' అని అంటారు. ఏం.. ఒకమ్మాయి తన బ్రెస్ట్ గురించి కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోకూడదా?

రూల్స్ పెడతారు

రూల్స్ పెడతారు

'సంవత్సరంలో ఎప్పుడో ఒక్కరోజు మహిళాశక్తికి జై కొట్టడం.. ఆ తర్వాత షరామామూలే. ఇంటా, బయటా.. మహిళ కుక్కిన పేనుగానే పడుండాలి. అమ్మాయిలు ఇలాంటి డ్రస్సులు వేసుకోవాలి.. ఎంతవరకు వేసుకోవాలనేది కూడా రూల్స్‌ పెట్టేస్తారు.

ఆఫీసుల్లో అలాంటి డ్రెస్ లు

ఆఫీసుల్లో అలాంటి డ్రెస్ లు

నేటి సమాజంలో ప్రాంతం, ప్రజలను బట్టి మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలనే విషయాలు ముడిపడి ఉన్నాయి. ఆఫీసుల్లో వివిధ రకాలుగా చూసేవాళ్లు ఉంటారు. అంటే, అదోటైపు మేనేజర్లో లేక అధికారులో అన్నమాట. అందుకే అమ్మాయిలు, కాలర్‌ బోన్‌ హైనెక్‌ ఉన్న డ్రస్సులను మాత్రమే వేసుకుని ఆఫీసులకి వెళ్లాలి.

జిమ్ కు వెళ్తే ఇంకో రకం

జిమ్ కు వెళ్తే ఇంకో రకం

జిమ్‌కు వెళ్లేవాళ్లు మీ టీషర్ట్‌ మెడ సఫారీ నెక్‌ ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం వేళ జనంతో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లదలిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలో నెక్‌ ఉన్న టీషర్ట్‌ను వేసుకోవాలి.

ప్రత్యేక డ్రెస్ తప్పదా?

ప్రత్యేక డ్రెస్ తప్పదా?

ఒకవేళ క్లబ్‌కు వెళ్లదలిస్తే స్కార్ఫ్‌ వేసుకొని వెళ్లాలి. స్కార్ఫ్‌ అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉన్న నానీ, దాదీ వాళ్ల శాలువాను తీసుకొని, మొత్తం కప్పుకోని మరీ వెళ్లాలి. ఎందుకంటే, అమ్మాయి సేఫ్టీ ముఖ్యం కదా అని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతారు. ఇలా ఎక్కడికెళ్లిన అమ్మాయి ప్రత్యేకంగా డ్రెస్ ఎందుకు మెయింటెన్ చేయాలా?

బుర్ఖా వేసుకున్నా ఫలితం ఉండదు

బుర్ఖా వేసుకున్నా ఫలితం ఉండదు

అబ్బాయిలు ఎలా ఉన్నా వారికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు ఎందుకని? అమ్మాయిలకే ఏంటీ ఆంక్షలు? అందుకే ప్రశ్నించే సమయం వచ్చింది కాబట్టి ప్రశ్నిస్తున్నాం. తప్పుగా ఆలోచించేవారి ముందు అమ్మాయిలు బుర్ఖా వేసుకున్నా, శారీ కట్టుకున్నా మృగాలుగానే మారతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి

బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి

అమ్మాయిలు దుస్తులతో మొత్తం శరీరాన్ని కప్పి ఉంచుకోవాలని చెప్పే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు. ఇలాంటి భావాలన్నింటి నుంచి పుట్టిందే ఈ కాన్సెప్ట్. మాతృమూర్తి బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి అంటూ ఒక కొత్త ఉద్యమాన్ని కేరళలో తీసుకొచ్చారు.

గృహలక్ష్మి

గృహలక్ష్మి

ఓ తల్లి బిడ్డకు జన్మను ఇచ్చాక బిడ్డనుతాకుతూ.. ముద్దాడుతూ ఆ బాధనంతటినీ మర్చిపోతుంది. బిడ్డ ఆలనాపాలనా చూస్తూ తల్లి మురిసిపోతుంటుంది. బిడ్డకు పాలిస్తుంది లాలిస్తుంది. అంతటి మాతృమూర్తి బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి అనే ఓ కొత్త వాదనను కేరళ మ్యాగజైన్ గృహలక్ష్మి తెరపైకొచ్చింది.

అలా ఎందుకు పాలివ్వాలి

అలా ఎందుకు పాలివ్వాలి

చాటుమాటుగా చీర కప్పుకునో, ఏదో తప్పు చేస్తున్నట్లు ఏదైనా వస్త్రం ఛాతిపై వేసుకునో ఎందుకు పాలివ్వాలని ఆ మ్యాగజైన్ ప్రశ్నిస్తోంది. బహిరంగంగా బిడ్డకు పాలిస్తే ఎందుకు సిగ్గుపడాలని, ఏదో అపరాధం చేస్తున్నట్లు ఎందుకు ఆత్మన్యూనతతో భయపడాలని వాదిస్తోంది.

బ్రెస్ట్‌ఫీడ్ ఫ్రీలీ

బ్రెస్ట్‌ఫీడ్ ఫ్రీలీ

అంతేకాదు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘‘బ్రెస్ట్‌ఫీడ్ ఫ్రీలీ'' అనే ఓ క్యాంపెయిన్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఇద్దరు మహిళలు బిడ్డకు బహిరంగంగా పాలిస్తున్న ఫొటోలను గృహలక్ష్మి మ్యాగజైన్ కవర్ పేజ్‌పై పోస్ట్ చేసి సంచలనానికి తెరలేపారు ఆ మ్యాగజైన్ నిర్వాహకులు.

ఫేస్‌బుక్‌లో పోస్ట్

ఫేస్‌బుక్‌లో పోస్ట్

అసలు కథ ఇది.. అమృత అనే ఓ 23ఏళ్ల గృహిణి తన నెలన్నర బిడ్డకు పాలిస్తున్నఫొటోను ఆమె అంగీకారంతో తన భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే తెరలేపింది. ఈ ఫొటో స్పూర్తితో గృహలక్ష్మి మ్యాగజైన్ ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది

అమృత అలా చేసేదట

అమృత అలా చేసేదట

తాను బిడ్డను కన్న తర్వాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు బహిరంగంగా బిడ్డకు పాలిచ్చేది అట అమృత. చాలామంది పక్కనున్న వారు ఆ భాగాన్ని కప్పుకోమని చెప్పేవారట. అంతేకాదు, అలా బహిరంగంగా బిడ్డకు పాలివ్వడం వల్ల పాలు పడటం తగ్గిపోతాయని అనేవారట. అప్పటి వారి మూఢనమ్మకాలను ఇప్పటి యువతపై కూడా రుద్దాలని చూస్తున్నారని అమృత అభిప్రాయం.

అలాంటి వారందరికీ అంకితం

అలాంటి వారందరికీ అంకితం

ఇక గృహలక్ష్మి మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ కవర్ ఫొటోకు ఫోజిచ్చిన ఆమె ప్రముఖ మలయాళి నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఎవరైతే బిడ్డకు బహిరంగంగా పాలివ్వడం గర్వ కారణంగా భావిస్తారో.. అలాంటి వారందరికీ తన ఫొటోను అంకితం చేస్తున్నాను అంటోంది మోడల్ గిలు జోసెఫ్,

బ్రెస్ట్ ను బహిరంగంగా చూపిస్తే ఎలా?

బ్రెస్ట్ ను బహిరంగంగా చూపిస్తే ఎలా?

అయితే ఈ ఫొటోలపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు.బిడ్డకు పాలివ్వడం తప్పు కాదని, కానీ మగవారిలో శృంగారపరమైన భావోద్రేకాలను కలిగించే బ్రెస్ట్ ను అలా బహిరంగంగా చూపించడం తప్పని కొందరు అంటున్నారు.

కుటిల మనస్తత్వాన్ని వీడండి

కుటిల మనస్తత్వాన్ని వీడండి

పాలు తాగే బిడ్డను చూడకుండా, ఆమె స్తనం వంక చూసే కుటిల మనస్తత్వాన్ని మగవారు వీడాలనే కదా మేము ఇలా చేస్తున్నాం అని గృహలక్ష్మి మ్యాగజైన్ వారు చెబుతున్నారు.

Image Source

దీన్ని నగ్నత్వంగా భావిస్తే...

దీన్ని నగ్నత్వంగా భావిస్తే...

బిడ్డకు పాలివ్వడమనేది తల్లికి బిడ్డకు ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. మరింత ముఖ్యంగా అమ్మతనాన్ని చూపిస్తుంది. దీన్ని నగ్నత్వంగా భావిస్తే అంతకంటే సిగ్గుచేటు మరేదీ లేదు. ఇలాంటి ఫోజు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీలవ్వుతున్నాను అంటోంది మోడల్ గిలు జోసెఫ్.

సిగ్గుపడొద్దు

సిగ్గుపడొద్దు

ఈ చిత్రం ఆడవారికి నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా.. మీ పిల్లలకు ధైర్యంగా పాలివ్వండి. అది ఓ అపూర్వ అవకాశం. సిగ్గుపడొద్దు అని గర్వంగా చెబుతోంది గిలు జోసెఫ్.

English summary

malayalam actress gilu joseph breastfeeds in an iconic bold magazine grihalakshmi cover shoot

malayalam actress gilu joseph breastfeeds in an iconic bold magazine grihalakshmi cover shoot
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more