For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మయోంగ్ అంతా మాయలే, మనుషుల్నే మాయం చేస్తారు, నొప్పులను మంత్రాలతో పొగొడుతారు, దొంగల్ని పట్టుకుంటారు

మయోంగ్ ప్రజలకు కేవలం బ్లాక్ మ్యాజిక్ మాత్రమే కాదు కొన్ని జబ్బులను నయం చేసే విషయాలపై కూడా మంచి పట్టు ఉంది. వీళ్లు చాలా రకాల జబ్బులను చిటికెలో నయం చేయగలరట.మయోంగ్ అంతా మాయలే, మనుషుల్నే మాయం చేస్తారు

|

అసోం ( అస్సాం) రాజధాని గౌహతి (గువాహటి)కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక ఊరు. ఆ ఊరి పేరు
మయోంగ్ (మయాంగ్). ఈ గ్రామానికి మయోంగ్ పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఇక్కడి జనాలు అన్నీ మాయలు చేస్తూ ఉంటారు. ఇంద్రజాలంలో వీరు ఆరి తేరిన వారు. ఇక్కడ అంతా మాయనే కాబట్టి ఈ ప్రాంతానికి మయోంగ్ (మేయోంగ్) అనే పేరు వచ్చింది.

మయోంగ్ మారిగాన్ (మొరిగోన్) జిల్లాలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున కొన్ని గ్రామాల సముదాయమే ఈ మయోంగ్. ఇక్కడ బ్లాక్ మేజిక్ తో అందరినీ మాయ చేస్తారు. ఇలా ఇంద్రజాలం చేసే వారు ప్రపచంలోనే ఎవరూ ఉండరేమో. అంతేకాదు మయోంగ్ ఒక పర్యాటక ప్రదేశం కూడా.

ఏదో ఒక శక్తి ఉంది

ఏదో ఒక శక్తి ఉంది

ఈ గడ్డపైనే ఏదో ఒక శక్తి ఉందని చాలా మంది నమ్ముతారు. అక్కడికెళ్తే ఏవో వింత శబ్దాలు వినపడతాయి మనకు. చుట్టు పక్కల చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ మనకు మాత్రం ఏవేవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అస్సలు ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయో కూడా అర్థం కావు.

Image Credit(All Pics)

ఆ పేరు రావడానికి చాలా స్టోరీస్ ఉన్నాయి

ఆ పేరు రావడానికి చాలా స్టోరీస్ ఉన్నాయి

అయితే మయోంగ్ కు ఆ పేరు రావడానికి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక భీముడి కుమారుడైన ఘటోత్కచుడికి సంబంధించిన రాజ్యం ఇప్పటి మాయోంగ్ ప్రాంతంలోనే ఉండేదట. ఘటోత్కచుడి గురించి మనకు తెలిసిందే. పెద్ద పెద్ద మాయల్ని కూడా చిటికెలో చేసే ప్రావిణ్యం ఆయనకుంది. అంతేకాదు ఘటోత్కచుడు తన సైనికులకు, తన మనుషులందరికీ కూడా ఈ మయోంగ్ లోనే శిక్షణ ఇప్పించాడట.

మాయలు నేర్చుకునేందుకు వచ్చేవారట

అలా మహాభారతం కాలం నుంచి ఇప్పటి వరకు ఆ వంశస్తులు మాయలు చేస్తూనే ఉన్నారట. ఇక పూర్వకాంలో మాయలు, ఇంద్రజాలం, క్షుద్రపూజలు నేర్చుకునేందుకు ఈ ప్రాంతానికి చాలా మంది వచ్చేవారట. పూర్వకాలంలో ఇక్కడ నరబలులు కూడా చాలా జరిగేవని అంటారు. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు అయితే లేవు.

మాయం అయిపోయిన వారిని ప్రత్యక్షం చేసేవారట

గతంలో ఇక్కడ మనుషులను కూడా మాయం చేసేవారు. ఇక్కడి మంత్రగాళ్లు మాయలు చేస్తున్నప్పుడు చూడడానికి వచ్చి జనాల్ని మాయ చేసేవారట. తర్వాత కుటుంబ సభ్యులు వేడుకుంటే మళ్లీ మాయం అయిపోయిన వారిని ప్రత్యక్షం చేసేవారట. అలాగే మనుషులను జంతువులుగా కూడా మార్చేవారట. ప్రస్తుతం మాయలు చేస్తున్న వాళ్ల తాతల కాలంలో ఇలా జరిగేదట. అంతేకాదు బ్లాక్ మ్యాజిక్ ఎలా చేయాలో అప్పటి కాలం వారు కొన్ని గ్రంథాలు కూడా రాశారు.

ప్రకృతిలోని శక్తులను ఎలా దక్కించుకోవాలి

ప్రకృతిలోని శక్తులను ఎలా దక్కించుకోవాలి

ప్రకృతితో ఎలా మెలగాలి. ప్రకృతితో ఎలా స్నేహం చేయాలి. ప్రకృతిలోని శక్తులను ఎలా దక్కించుకోవాలనే విసయాలు మొత్తం అప్పటి గ్రంథాల్లో రాసి ఉందట. ఈ విషయాలన్ని వారికి సంబంధించిన వంశస్తులకు పూర్తిగా తెలియకపోయినా కొన్ని మాత్రం తెలుసు. దీంతో వారు ఇప్పటికీ ఇక్కడ మాయలు చేస్తూ ఉన్నారట. అయితే మొత్తం విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడి మాయగాళ్లకు ప్రపంచంలో ఎవరూ సాటి రారు. అంతటి శక్తివంతులుగా మారుతారు.

మంత్ర విద్యలను అభ్యసిస్తారు

మంత్ర విద్యలను అభ్యసిస్తారు

ఇక్కడ ఉండే చిన్నారులు కూడా మంత్ర విద్యలను అభ్యసిస్తూ ఉంటారు. ఇక్కడ మాయలు చేసే వారిన బెజ్ అని అంటారు. అలాగే ఓజ అని కూడా అంటారు. ఇక్కడి వారు వారు నమ్మే దేవతల కోసం ఏటా పోబిటోరా ఉత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు వీరి ఆనందానికి అవధులుండవు.

జబ్బులను నయం చేస్తారు

జబ్బులను నయం చేస్తారు

అంతేకాదు మయోంగ్ ప్రజలకు కేవలం బ్లాక్ మ్యాజిక్ మాత్రమే కాదు కొన్ని జబ్బులను నయం చేసే విషయాలపై కూడా మంచి పట్టు ఉంది. వీళ్లు చాలా రకాల జబ్బులను చిటికెలో నయం చేయగలరట. ఒక్క మంత్రం వేస్తే చాలు ఎలాంటి జబ్బు అయినా క్యూర్ అయిపోతుందట.

నొప్పులను తగ్గించడంలో నంబర్ వన్

నొప్పులను తగ్గించడంలో నంబర్ వన్

ముఖ్యంగా నొప్పులను తగ్గించడంలో వీరికి వీరే సాటి. వీరు ఒక రాగి పళ్లెం తీసుకుని మొదట ఏవేవో మంత్రాలు చదివి దాన్ని మీకు ఏ ప్రాంతంలో నొప్పి ఉంటుందో అక్కడ అతికిస్తారు. దానికి ఎలాంటి లేపనాలు పూయరు కానీ మీ శరీరానికి అతుక్కుపోతుంది. తర్వా త కొన్ని మంత్రాలు చదువుతారు. అంతే.. మీ కాళ్ల నొప్పులు, నడుం నొప్పి ఇంకా తదితర నొప్పులన్నీ తగ్గిపోతాయట. అంతేకాదు వీరు ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లు ఎవరు, వారు ఎక్కడున్నారో కూడా కనిపెట్టగలరట.

డాక్యుమెంటరినీ తీశారు

ఇక ఫిల్మ్ మేకర్ ఉత్పల్ బోర్పూజరి మాయాంగ్ సందర్శించాడు. 2011లో ఈయన అక్కడికి వెళ్లాడు. ఈయన అక్కడి పరిస్థితులను మొత్తం అధ్యాయనం చేసి ఒక డాక్యుమెంటరినీ కూడా తీశాడు. 53 నిమిషాల విడిది ఉండే ఈ డాక్యుమెంటరీలో మయోంగ్ ప్రజల స్థితి గతులన్నీ వివరించేందుకు ప్రయత్నించాడు.

English summary

mayong in this place magic cures diseases helps catch thieves

mayong in this place magic cures diseases helps catch thieves
Desktop Bottom Promotion