చాయ్ పీలో ఫ్రెండ్స్ ఆంటీ.. వీడియోలు చూస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది.. మీరూ ఒక్క లుక్ వేసుకోండి

Subscribe to Boldsky

'చాయ్ పీలో ఫ్రెండ్స్' అంటూ అందరినీ తన వీడియోల ద్వారా పలకరించే సోంవాటి మహవార్ (సోమ్‌వతి) మహవార్ గుర్తుందా? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవాళ్లకు ఆమె గురించి చెప్పాల్సిన పనిలేదు. చాయ్ పీలో ఫ్రెండ్స్ అని ఎవరు పలుకుతారో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

విగో వీడియో యాప్ గురించి తెలిసిన వాళ్లకు సోంవాటి మహవార్ సుపరిచితమే. విగో వీడియో యాప్ ద్వారా వీడియోలు షేర్ చేసి తనకంటూ సోషల్ మీడియాలో ఒక స్టార్ డమ్ సంపాదించుకుంది ఈమె. అలా ఈమె కూడా ఒకస్టార్ అయిపోయింది.

అంతర్జాతీయ స్టార్

సోంవాటి తన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె అంతర్జాతీయ స్టార్ అయిపోయింది. ఆమెను అనుకరిస్తూ చాయ్ పీలో ఫ్రెండ్స్ అంటూ ఓ ఫారెనర్ వీడియో తీసి తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కూడా కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.యూఎస్‌లోని యేల్ యూనివర్సిటికీ చెందిన ఓ స్టూడెంట్ హలో ఫ్రెండ్స్ చాయ్ పీలో అంటూ చాయ్ తాగుతూ దానిని ఆస్వాదిస్తున్న వీడియో అది.

విగో వీడియో యాప్‌లో పోస్ట్

సోంవాటి.. హల్లో ఫ్రెండ్స్.. చాయ్ పీలో అంటూ తను రోజూ ఓ వీడియో తీసి విగో వీడియో యాప్‌లో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో తను విగోలో పాపులర్ వ్లోగర్ అయింది. అయ్యో.. ఈ వ్లోగర్ ఏంది అని కన్ఫ్యూజ్ కాకండి. వ్లోగర్ అంటే వీడియో బ్లాగర్‌కు షార్ట్ ఫామ్.

ఫ్లేమ్స్ అనే పాయింట్స్

విగో వీడియో అనేది ఒక వీడియో యాప్. దాంట్లో షార్ట్ వీడియోలను క్రియేట్ చేసి అందులో షేర్ చేయొచ్చు. డబ్‌స్మాష్ కూడా చేయొచ్చు. వాటిని ఎంతమంది చూస్తే అంత పాపులారిటీ వస్తుంది, ఫాలోవర్స్ పెరుగుతారు. అంతే కాదు. ఫ్లేమ్స్ అనే పాయింట్స్ యాడ్ అవుతాయి.

500 దాకా వీడియోలు

అలా ఇప్పటి వరకు సోంవాటి మహవార్ 500 దాకా వీడియోలను విగోలో అప్‌లోడ్ చేసింది. అయితే.. వాటిలో చాయ్ పీలో అని చెబుతూ.. గరమ్ గరమ్ చాయ్‌ని మహవార్ తాగిన ఓ 15 సెకండ్ల వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దీంతో మహవార్ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

బ్రాండ్ అంబాసిడర్

బ్రాండ్ అంబాసిడర్

తన మ్యానరిజం నచ్చిన నెటిజన్లు.. తననే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టీగా ప్రకటించారు. ఇక.. తనకు రోజురోజుకూ పాపులారిటీ పెరుగుతుండటంతో తన వీడియోలను కూడా మహవార్ పెంచుతూ పోతోంది.

మెమెలు తయారు చేసి

మెమెలు తయారు చేసి

చాయ్‌తో పాటు పుచ్చకాయ, మామిడి పండ్లను తింటూ వాటిని తినండంటూ వీడియోలు షేర్ చేస్తోంది సోంవాటి మహవీర్. తన వీడియోలను ఉపయోగించి నెటిజన్లు తమ మెదడుకు పదును పెడుతున్నారు. ఆ వీడియోలకు తగ్గట్టుగా మెమెలు తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

ఓ లుక్కేసుకోండి

అలా సోషల్ మీడియాలో తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ప్రస్తుతం చాయ్ అంటే మహవార్, మహవార్ అంటే చాయ్ అన్నట్లుగా సోంవాటి మహవార్ ఫేమస్ అయిపోయింది. త‌న‌ను ఫేమ‌స్ చేసిన వీడియోల‌పై మీరూ ఓ లుక్కేసుకోండి మ‌రి..

Paranthe khalo frandss #chaipilofrandss #garamhai #somvati

A post shared by Paagal Hai Kya (@paagalpantibhijarurihai) on May 31, 2018 at 11:25am PDT

#papewali#chaipilo Follow us @nagarpalika_troll

A post shared by Nagarpalika Troll (@nagarpalika_troll) on May 31, 2018 at 9:54am PDT

Hello friends good morning #ChaiPeelo #HelloFriends #GoodMorning

A post shared by Memes Wala (@memes.waala) on Jun 1, 2018 at 8:10pm PDT

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    meet the chai pilo bhabhi who is driving people crazy

    meet the chai pilo bhabhi who is driving people crazy
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more