ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు. నమ్మశక్యం గా లేకపోయినా ఇది నిజం.

82 యేళ్ళ వయసుకలిగిన మిహైలో తొలోట్టి అనే ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదని, అసలు మహిళ ఈ గ్రహంమీద ఉన్నదన్న విషయమే తనకు తెలీదు అని అంటారు.

real life stories in telugu

నమ్మశక్యంగా లేకపోయినా కూడా, అతని జీవితంలో జరిగిన పరిణామాలు తెలిస్తే విస్మయానికి గురవడం మనవంతు అవుతుంది.

మిహైలో తొలోట్టి., ఈ వ్యక్తి ప్రపంచానికి ఎంత దూరమో, ప్రపంచానికి కూడా ఈ వ్యక్తి అంతే దూరం. ఈ వ్యక్తి గురించిన ఆశ్చర్యకరమైన కథను తెలుసుకుందాం.

ఇతను ఒక గ్రీకు సనాతన సన్యాసి:

ఇతను ఒక గ్రీకు సనాతన సన్యాసి:

మిహైలో తొలోట్టి, ఒక గ్రీకు సనాతన సన్యాసి, తన 82 యేళ్ళ వయసులో 1938 లో మరణించాడు. మరియు ఇతని జీవితకాలంలో మహిళ ఎలాఉంటుందో కూడా తెలీకుండా బ్రతికాడు. ఊహకి కూడా అందని ఈ వింత నిజం.

చరిత్ర ప్రకారం:

చరిత్ర ప్రకారం:

చరిత్ర ప్రకారం ఇతను తన నాలుగేళ్ల వయసులోనే 1856 లోనే తల్లిని కోల్పోయాడు. ఎవ్వరూ దరికి చేరనీయని పక్షంలో ఇతను అథోస్ పర్వతం మీద ఉన్న ఆశ్రమం కడకు చేరుకున్నాడు.

ఆశ్రమం ఇతన్ని దత్తత తీసుకుంది :

ఆశ్రమం ఇతన్ని దత్తత తీసుకుంది :

ఆశ్రమంలోని, మైకేల్ టోలొటోస్ అనే సన్యాసి ఇతన్ని దత్తత తీసుకుని ఆదరించాడు. ఆ తర్వాత అతని జీవితకాలంలో ఆ ఆశ్రమం ద్వారాలు దాటి అతను బయటకి వెళ్లలేదు.

ఒక చట్టం కూడా కారణం :

ఒక చట్టం కూడా కారణం :

Image Source: Flickr

నిజానికి 1060 లొ మహిళలు, పిల్లలు కొండ ఎక్కరాదన్న చట్టం చేయబడింది. ఇప్పటికీ ఆ చట్టాన్ని పాటిస్తున్నారంటే ఎంతగా ప్రభావితం చేసిందో తెలుస్తూనే ఉంది. ఆ చట్టం కారణంగా ఏ ఇతరమహిళా ఆ కొండను ఎక్కే ప్రయత్నం కూడా చేయలేదు. తద్వారా ఇతను మహిళను చూసే అవకాశమే లేకుండా పోయింది.

మగవారికి మాత్రమే అనుమతి:

మగవారికి మాత్రమే అనుమతి:

Image Source: Flickr

ఈ అథోస్ పర్వతం నందు కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది, ఆఖరికి పర్యాటకులు కూడా మగవారు మాత్రమే ప్రవేశించే విధంగా చట్టం ఉంటుంది. మరియు ఇక్కడ సన్యాసులు షేవింగ్, స్నానం, యుద్దాలకు కూడా అనుమతించబడరు. కనీసం వీరిని ఆ ఆశ్రమం గురించిన వివరాలు కూడా అడగకూడదన్న నిషేదాజ్ఞలు ఉంటాయి.

తద్వారా మిహైలో తొలోట్టి కి మహిళల గురించిన విషయాలే తెలీకుండా అతని జీవితకాలం గడిచిపోయింది.

English summary

Man Who Never Knew About A Woman's Existence!

Mihailo Tolotos was a man who never saw a woman in his entire life. He apparently never knew about a woman's existence. His mum died when he was just 4 hours old and he was abandoned at a monastery atop Mount Athos, since then he had never stepped out of his monastery until he died.Though this seems to be totally impossible
Story first published: Tuesday, April 3, 2018, 13:15 [IST]