For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశిచక్రాలకు చెందిన వారు, స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు

|

మీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులైతే, దీనికి గల కారణాల్లో మీ రాశి చక్రాలు కూడా ఒకటి కావచ్చని మీకు తెలుసా? జీవితంలో స్వతంత్ర భావాలు కలిగి ఉండడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. కానీ అందరికీ మీ మనస్థితి అర్ధం కాకపోవచ్చు, క్రమంగా కొన్ని కలహాలకు కూడా దారితీస్తుంటాయి. ఎన్ని కలహాలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అదరక, బెదరక ఎదురు నిలిచే తత్వాన్ని ప్రదర్శించే కొన్ని రాశి చక్రాలు గురించి ఇక్కడ తెలియజేయడమైనది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం, స్వతంత్ర భావాలు కలిగిన రాశి చక్రాలు కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడ బోల్డ్స్కీలో మీతో ఈ జాబితాను పంచుకుంటున్నాము.

Independent Zodiac Signs Who Love To Do Things On Their Own

స్వతంత్ర భావాలు కలిగి ఉండడాన్ని ఇష్టపడే రాశి చక్రాల గురించిన వివరాలను తెలుసుకొనుటకు ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది.

ఇక్కడ వారి లక్షణాల ఆధారితంగా రాశి చక్రాల క్రమాన్ని పొందుపరచడం జరిగింది.

ఈ క్రింది రాశి చక్రాల వివరాలు సూర్యమాన సిద్దాంతం ప్రకారం చెప్పబడినవి.

ఈ రాశిచక్రాలకు చెందిన వారు, స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు:

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22

ధనుస్సు రాశికి చెందిన ఎక్కువగా తమని తాము ప్రేమించుకునే వారిలా ఉంటారు, ఏ విషయంలో అయినా తమ అంతరాత్మ చెప్పిన విధంగానే నడుచుకునే వ్యక్తిత్వం వీరి సొంతం. తమ పనిని ఇతరులకు అప్పగించే అలవాట్లు వీరికి ఉండవు. వ్యక్తిగత విలువలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే వీరు, అన్నిటా ఉత్తమంగా ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు. ఎటువంటి నిర్ణయమైనా ఇతరుల మీద ఆధారపడకుండా అంతరాత్మతో చర్చలు జరుపుతుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే వీరు, తమ కుటుంబం పట్ల ప్రియమైన వారి పట్ల అత్యధిక విధేయతను ప్రదర్శిస్తుంటారు.

కుంభ రాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభ రాశికి చెందిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు, తమ నిర్ణయాలు మరియు అభిప్రాయాలలో ఇతరుల ప్రమేయాన్ని కూడా సహించలేరు. మరియు వెనుక మాటలను, వెన్నుపోటుదారులను అస్సలు క్షమించలేరు. ఒక్కసారి ఎవరి మీదనైనా కోపం తెచ్చుకున్న వారైతే, జీవితాంతం వారికి వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నిస్తుంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఒకటికి పదిసార్లు అంతరాత్మతో చర్చలు జరిపే వీరు, ఫలితాల సాధనలో కూడా అంతే జాగ్రత్తను కనపరుస్తూ ఉంటారు. స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులకు సహజంగానే శత్రువులు అధికంగా ఉంటారు. కానీ కుంభ రాశి వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా తమ భావాలను మార్చుకునేందుకు మాత్రం సిద్దంగా ఉండరు.

వృశ్చిక రాశి: అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశి: అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశి వ్యక్తులు ఎటువంటి విషయంలో అయినా అధిక భయాలను కలిగి ఉంటారు, మరియు తరచుగా సందేహాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. తాము తప్ప ఏ ఇతర వ్యక్తి చెప్పిన అంశాన్ని పరిగణనలోనికి తీస్కోవడానికి కూడా సుముఖతను ప్రదర్శించరు. కుటుంబసభ్యుల, మరియు ప్రియమైన వారి సలహాలను తీసుకున్నా కూడా, చివరికి వీరి నిర్ణయమే ఆధారితం కావాలన్న పట్టుదల వీరిది.

తమ నిర్ణయాల పట్ల ఇతరుల ఆమోదాన్ని సహించలేరు. వీరు తరచుగా ఒత్తిళ్ళకి లోనవుతూ ఉంటారు. మరియు భాగస్వాముల పట్ల విధేయతను కలిగి ఉంటారు.

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

వంట వాళ్ళు ఎక్కువైతే వంట చెడిపోతుంది అన్న సామెతను బలంగా నమ్ముతుంటారు. కావున తమ నిర్ణయాల పట్ల స్వతంత్రాన్ని కలిగి ఉంటారు. తమ అంచనాలకు వ్యతిరేక ఫలితాలు రావడాన్ని ఎన్నటికీ సహించలేరు. ఒక క్రమబద్దమైన జీవితాన్ని పాటించడానికి, కొన్ని నియమాలను ఏర్పరచుకునే వీరు తమ భాగస్వామిలో కూడా అటువంటి విధానాలే ఉండాలన్న ఆలోచనను కలిగి ఉంటారు. వీరు కోరుకున్న విధంగా భాగస్వామి లేని పక్షాన కాస్త అసౌకర్యాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. మరియు కుటుంబంలో వీరి నిర్ణయమే ప్రధానంగా ఉండాలన్న ఆలోచన వీరిది. తద్వారా కొన్ని ప్రతికూల ప్రభావిత అంశాలకు కేంద్ర బిందువుగా మారుతారు. తమ వ్యక్తిగత నిర్ణయాలకు గౌరవమిచ్చే వారినే, తమ ప్రియమైన వారిగా మలచుకుంటారు. వాదనల కన్నా, మౌనం మంచిదని భావించే వీరి మనసు అనేక ఆలోచనల పరంపరలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఒక్కోసారి వీరి నిర్ణయాలు కుటుంబ కలహాలకు కేంద్రబిందువుగా మారుతున్నా, తమ ఆలోచనలను మార్చుకోడానికి సిద్దంగా ఉండరు. విశ్వాసం, ధైర్యం వీరి ఆయుధాలుగా ఉంటాయి.

వృషభ రాశి : ఏప్రిల్ 20 -మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 -మే 20

వృషభ రాశికి చెందిన వ్యక్తులు వారి స్వంత అభిప్రాయాలకే ఎక్కువ విలువని ఇస్తుంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, మిమ్ములను కూడా నిర్ణయాలలో భాగం చేశాను అన్న అభిప్రాయం వచ్చేలా కుటుంబ సభ్యులతో మెలుగుతూ, చివరికి తన నిర్ణయాన్నే అమలు పరచే వ్యక్తులుగా ఉంటారు. వీరు స్వభావం కాస్త ప్రశ్నార్ధకంగా ఉంటుంది. వీరి ప్రతి ఆలోచన వెనుక తమ కుటుంబ శ్రేయస్సు, ప్రతిష్ఠ దాక్కొని ఉంటాయి.

అధిక భావోద్వేగాలకు మీరు మనసు కేంద్రంగా ఉంటుంది. మరో పక్క ప్రతీకారేచ్చను కలిగి ఉంటారు. తమకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారి పట్ల అదను కోసం ఎదురుచూసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఒంటరిగా ఉన్న సమయంలో ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు, వీరిని కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెట్టుకుని ఉండవలసి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆధ్యాత్మిక, రాశిచక్ర, హస్త సాముద్రిక తదితర అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Independent Zodiac Signs Who Love To Do Things On Their Own

Leading a life where being independent is the only kick that keeps you motivated, you need to know that your stars might be one of the reasons why you love to be independent. According to astrology, there are zodiacs who love being independent, and here we at Boldsky are sharing this list.
Story first published: Monday, July 2, 2018, 12:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more