For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త అధ్యయనాల ప్రకారం, స్ట్రైట్ సెక్సువాలిటీ ఆచరించే వారు కనుమరుగవుతున్నారు

కొత్త అధ్యయనాల ప్రకారం, స్ట్రైట్ సెక్సువాలిటీ ఆచరించే వారు కనుమరుగవుతున్నారు

|

మీ భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ముక్కుసూటి తనాన్ని కలిగి ఉన్నారా? ప్రత్యామ్నాయంగా, మీరు మీ స్వంత గుర్తింపు గురించిన ఆలోచనలతో గందరగోళంగా ఉన్నారా? లేక మీరు మీ భావోద్వేగాలకు, ఆలోచనలకు విరుద్ధ ధోరణిని కలిగి ఉన్నారా?

స్ట్రైట్ పీపుల్ మీద జరిపిన కొన్ని అధ్యయనాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు బహిర్గతం చేయబోతున్నాము. నిజానికి లైంగిక సంపర్కంలో అనేక రకాలు ఉన్నాయి, స్ట్రైట్, బై సెక్సువల్ (గే, లెస్బియన్), ట్రాన్స్జెండర్ మొదలైనవి. వీటిలో ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా తీసుకుంటుంటారు. స్ట్రైట్ మరియు బై. ముఖ్యంగా ఈ అధ్యయనం వీరిద్దరిమీదే జరిగింది.

Research Suggests Straight People Don’t Exist

క్రమంగా ఊహించని, ఊహకు అందని ఫలితాలు నమోదయ్యాయి. అనగా తెలీకుండా స్ట్రైట్ పీపుల్ సంఖ్య కనుమరుగవుతూ ఉంది. దీనికి కారణాలేవో పూర్తిగా తెలియ రావడం లేదు కూడా.

మానవ లైంగికతకు అనుసంధానించబడి దీర్ఘకాలంపాటు వారి మనస్సులో దాక్కుని ఉన్న నమ్మకాలను ఈ పరిశోధన కొంతమేర నిర్లక్ష్యం చేసింది. వ్యక్తుల జెండర్ ఎక్స్ప్రెషన్ చూడటం మరియు వారి శారీరక ప్రతిస్పందనలను అంచనా వేయడం ద్వారా, అనేక రకాల శృంగార సంబంధిత విషయాలను చూపడం ద్వారా ఈ అధ్యయనాలు జరిగాయి.

పరిశోధన ప్రకారం, మహిళలు తమ లైంగికత గురించి ఎలా చెప్తున్నారనే విషయాన్ని వెల్లడించారు, క్రమంగా వారి శరీరాలను స్ట్రైట్(హెటెరో) మరియు స్వలింగసంపర్క సంబంధాలకు అనుకూలంగా స్పందించడం ఊహకు అందని విషయంగా మారింది.

స్త్రీల లైంగిక ఆలోచనలు సంక్లిష్టంగా ఉంటాయి మరియు సాంప్రదాయ సరిహద్దులమద్య స్ట్రైట్ వైపే మొగ్గుచూపాల్సిన స్థితి. క్రమంగా స్వలింగసంపర్కం అనేది భావవ్యక్తీకరణలో కూడా తెలుపలేని పరిస్థితుల్లో ఉన్నారు. కావున ఈ రీసెర్చ్, వారి కోరికలు మరియు అవసరాలను అర్ధం చేసుకునే అంశాల మీద ఫోకస్ చేసింది.

ఈ అధ్యయనం కేవలం స్ట్రైట్, స్వలింగసంపర్కం వంటి అంశాల మీదనే కాకుండా సాంప్రదాయక సరిహద్దుల, మరియు ఆలోచనా పరిణామాల గురించిన అవగాహన కూడా కలిగి ఉంటుంది. క్రమంగా వారి ఆలోచనలను తెలుసుకోగలిగింది.

ఇక్కడ, మహిళల మీద పరిశోధన జరిపిన పరిశోధనల గురించే మీరు ఆశ్చర్యపోతుంటే, ఈ పరీక్ష పురుషుల మీద జరిపినప్పుడు తెలిసిన విషయాల గురించి వింటే జుట్టు పీక్కుంటారు.

అదేమిటో చూడండి:

పరిశోధన ప్రకారం, సాధారణంగా పురుషులు ఏదైనా పోర్న్ చూస్తున్నప్పుడు మహిళల పట్ల ఆకర్షితులవడం సర్వసాధారణం, కానీ అనేకమంది పురుషులపట్ల ఆకర్షితులవడం అనేది ఊహకు అందని విషయంగా ఉంది. ఇక్కడ, కొందరు తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తున్నా, అనేకమంది మాత్రం బయటకు స్ట్రైట్ గా వ్యవహరిస్తూ మానసికంగా స్వలింగ సంపర్క ఆలోచనలను చేస్తున్నారు అని తేలిన నిజం.

ఈ పరిశోధన ద్వారా, శాస్త్రవేత్తలు తేల్చిన విషయం ఏమిటంటే అందరు పురుషులు మానసికంగా, శారీరికంగా స్వలింగ సంపర్కం, స్ట్రైట్, లేదా బైసెక్సువల్ పట్ల భిన్న ఆలోచనలను కలిగి ఉంటారని. కొందరు బాహాటంగా తాము ఇది అని భావాలను వ్యక్తపరుస్తున్నా, ఆలోచనా ప్రకారం వేరే భావాలను కలిగి ఉంటున్నారని తేలింది. ఇంతకు ముందు సర్వేలతో పోల్చినప్పుడు స్ట్రైట్ ఆలోచన కలిగిన వారు క్రమంగా తగ్గుముఖం పడుతున్నారని మాత్రం తేలింది.

సామాజిక, సాంప్రదాయ మరియు శారీరిక అంశాలను పరిగణనలోనికి తీసుకుని లైంగిక ప్రాధాన్యతలను అర్థం చేసుకునే ప్రయత్నంలో అనేకులు తమ నిజ భావాలను వ్యక్తపరచుటకు సుముఖంగా లేరని తేలింది. కానీ మారుతున్న కాలం ప్రకారం, భావవ్యక్తీకరణ స్వేచ్చ ఎక్కువవుతున్న నేపద్యంలో రాబోవు కాలంలో ఏమైనా జరగొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

కావున ఎవరైనా తాము స్ట్రైట్ అని చెప్పుకునే స్త్రీ పురుషులకు ఈ రీసెర్చ్ గురించి కాస్త వివరించండి. అలాగని అందరూ ఇలాగే ఉండరు, కానీ తమకుతాముగా చెప్పుకునే వారి సైకాలజీ ప్రకారం, వారి ఆలోచనల్లో మార్పులు ఉండవచ్చు అని తేలింది కూడా. పరిశోధకులు కూడా మాటలు కాదు భావాలను చదివే ప్రయత్నం చేయమని సూచిస్తున్నారు. ఆ భావాలు పూర్తిగా అర్ధమయితే ముక్కున వేలేసుకోవడం గారెంటీ.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Research Suggests Straight People Don’t Exist

A recent research has undermined the long-held beliefs regarding human sexuality. The studies were done by looking at gender expression of individuals and by measuring their physiological response, viewing a variety of pornographic material. This research suggests that our preferences are more fluid than we once thought.
Story first published:Friday, July 20, 2018, 15:02 [IST]
Desktop Bottom Promotion