For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

“సంస్కారి” స్త్రీలు ఎపుడూ చేయకూడని పనులు!

భారతదేశం విభేదం, అసమ్మతితో కూడిన దేశం, భారతదేశంలో ప్రజలు సాధారణ విశ్వాసాన్ని కలిగి ఉంటారు, వారు ఎల్లపుడూ ప్రతిదీ సాధారణీకరిస్తారు అనేది నిజం.అందులో అత్యంత సాధారణ బాధితులు భారతీయ మహిళలే. నేటికీ, చాలామ

By Gandiva Prasad Naraparaju
|

భారతదేశం విభేదం, అసమ్మతితో కూడిన దేశం, భారతదేశంలో ప్రజలు సాధారణ విశ్వాసాన్ని కలిగి ఉంటారు, వారు ఎల్లపుడూ ప్రతిదీ సాధారణీకరిస్తారు అనేది నిజం.

అందులో అత్యంత సాధారణ బాధితులు భారతీయ మహిళలే. నేటికీ, చాలామంది బాగా చదువుకున్న భారతీయ స్త్రీలు ఇప్పటికీ సమాజంలోని కఠినమైన నిబంధనలకు కట్టుబడి ఉంటారు.

మన కుటుంబాలలో ఎక్కువగా చెప్తుంటారు "మీ సోదరుడు అతను ఏదనుకుంటే అది మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, కానీ నువ్వు అమ్మాయివి, నువ్వు ఎక్కువ మాట్లాడ కూడదు అని. మీరు ఎక్కువగా మాట్లాడితే, మీరు అబ్బాయి కంటే ఎక్కువ చదువుకున్నారని, ఎక్కువ తెలివిగల వారని వారు గుర్తించవచ్చు, కానీ మీకు సరిపోలిన వారిని గుర్తించరు.

మీరు పెళ్లి చేసుకోరు. మేము ఏమి చేస్తాము?

కొన్నిసార్లు, ఒక స్త్రీ తన తల్లిదండ్రులు సరైన అబ్బాయిని వెతికి, అతన్ని పెళ్ళిచేసుకోవడానికి మాత్రమె స్త్రీ పుట్టిందని భావిస్తారు. ఇవన్నీ జరిగాక కూడా, మీరు నియమాలను ఉల్లంఘించడానికి ప్రయత్నించినా, ఏదైనా కొత్తగా చేయలన్నా, మీకు పద్ధతి లేదని, అనాగరికులని పిలుస్తారు.

మన సంఘం భారతీయ మహిళలు చేసే పనిని నేరంగా భావించే కొన్ని విషయాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. "సంస్కారి" స్త్రీ ఎప్పుడూ చేయకూడని కొన్ని పనులు ఇవే, వీటి గురించి తెలుసుకోవానికి చదువును కొనసాగించండి.

మోకాలు పైకి ఉండే దుస్తులు ఏవీ వేసుకోవద్దు

మోకాలు పైకి ఉండే దుస్తులు ఏవీ వేసుకోవద్దు

భారతదేశంలో, మీరు వేసుకునే దుస్తుల్ని బట్టి మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. కాబట్టి, దీనిప్రకారం చాలామంది చాలా మర్యాదగా ఉండే భారతీయ స్త్రీలు వారి కాళ్ళను కవర్ చేసుకుంటారు. మీరు కురచ దుస్తులు ధరించడం చూస్తే, మిమ్మల్ని "బేషరమ్ లడకి" (సిగ్గులేని అమ్మాయి) అని అంటారు.

మీరు భారతదేశంలో ఏదైనా చర్చ్ లేదా గుడిని సందర్శించాలి అంటే, భారతీయ స్త్రీ అయితే కాళ్ళు తప్పని సరిగా కవర్ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో కూడా భారతీయ మహిళలు అధునాతన దుస్తుల కోడ్స్ "నో-నో" అని చెప్తాలి.

లేట్ నైట్స్ కి బై బై చెప్పాలి

లేట్ నైట్స్ కి బై బై చెప్పాలి

మీరు భారతదేశానికి చెందిన స్త్రీలయితే, ఈ విషయాన్నీ ఎల్లపుడూ గుర్తుంచుకోండి, "మీరు రాత్రి సమయంలో ఎక్కువ ఆలస్యం కాకముందే ఇంటికి వెళ్ళండి". చాలామంది మన తల్లిదండ్రుల దగ్గర నుండి ఈమాట వినే ఉంటారు, మన పడక గదిలో లేదా లివింగ్ రూమ్ లేదా ఎక్కడినుండైనా సరే ఇంటికి వెళ్ళమని అర్ధం; కానీ రాత్రిపూట 9PM లోపు మీ ఇంట్లో ఉండాలి.

అధ్ధరాత్రి లేదా ఆతరువాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళడం మీ చుట్టుపక్కల వారు గమనిస్తే మిమ్మల్ని అనుమానంతో చూస్తారు. కాబట్టి, లేట్ నైట్ పార్టీలు వద్దు, నిద్దర్లు లేకుండా ఉండొద్దు, అమ్మాయిలూ!

మీరు దూషించొద్దు; దూషించబడోద్దు

మీరు దూషించొద్దు; దూషించబడోద్దు

మీరు కేవలం యాసను ఉపయోగించారా? నిజంగానా?? మీరు భారతీయ స్త్రీ అయి, మీరు దూషిస్తే, మీ పెంపకం, మీ చదువు ప్రశ్నించబడతాయి. తమ పిల్లలు ఇతరులను దూషించడం చూడాలని తల్లిదండ్రులు ఎప్పుడూ అనుకోరు, ఇది ఖచ్చితంగా ఒక "సంస్కారి" అమ్మాయి చేయవలసిన పని కాదు!

మగ స్నేహితులు ఉండ కూడదు

మగ స్నేహితులు ఉండ కూడదు

చిత్రంలో మీతో అబ్బాయి ఉన్నదా? మగ స్నేహితుడా? మీకు మగ స్నేహితుడు లేదా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నదా? నిన్ను కాలేజ్ కి చదువుకోడానికి పంపిస్తున్నామా లేదా మగ స్నేహితుల కోసం పంపిస్తున్నమా? ఇలాంటివి కొన్ని విషయాల గురించి భారతీయ తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు!

మన సంఘంలో మరికొందరు తేలికగా వూహించేసుకుంటారు, మీకు ఒక మగ స్నేహితుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని పద్ధతి లేని స్త్రీగా అనుకుంటారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, నేటికీ, అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలను దాదాపు నేరం చేసినట్టు భావిస్తారు.

మీరు వివాహం తరువాత పని చేయకూడదు

మీరు వివాహం తరువాత పని చేయకూడదు

భారతదేశంలో, స్త్రీలు ఇంటిపనులను నిర్వర్తిస్తారు, పురుషుడు పనిచేసి, బతకడానికి సంపాదిస్తాడు. అయితే, ఈరోజుల్లో, స్త్రీలు విజయవంతమైన వృత్తిని చేస్తున్న వారిని కూడా చూస్తున్నాము, ఇంట్లో పనులు ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమౌతుంది. ఒక "సంస్కారి" అమ్మాయి ఇటువంటి పరిస్ధితులలో తనకోసం కెరీర్ ని ఏర్పాటు చేసుకోడానికి బదులుగా ఇంట్లో పనిని చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం తరువాత తమ కోడలిని ఉద్యోగాలకు పంపడానికి వ్యతిరేకించే కుటుంబాలు కూడా అనేకం ఉన్నాయి.

English summary

Things “Sanskari” Indian Women Must Avoid Doing

Even today, when most of us are well educated, Indian women are still bound by the norms of the society. This makes one realise that being born as a woman is not so easy! We are not given the freedom of the way we want to live our life; that is on our own terms.
Story first published:Thursday, January 18, 2018, 19:37 [IST]
Desktop Bottom Promotion