For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆమె ముఖంపై తుపాకి గాయం మిగిల్చింది..... ఆమె రూపం ఇప్పుడు ఇలా ఉంది...!

  |

  మీరు ఇప్పటివరకు చవిచూసిన కష్టాలలో ఘోరమైనది ఏది? అది మీ అనుబంధానికి సంబంధించినదో, లేదా డబ్బు కొరత వలనో, లేదా మీ ఉద్యోగ నిర్వహణలో అసంతృప్తి వలనో అయ్యి ఉంటుంది. కాని మీరు నమ్మినా, నమ్మకపోయినా ఈ సమస్యలు అంత తీవ్రమైనవి ఏమి కాదు.

  మనం ఇంకా తీవ్రమైన సమస్యలతో సంఘర్షణకు తలపడుతున్న వారిని, వారు అనుభవిస్తున్న బాధను చూసినప్పుడు, మనం చిన్న చిన్న సమస్యలకు కూడా బెంబేలెత్తిపోయి, వాటిని భూతద్దంలో నుండి చూస్తూ సతమతమవ్వడం అనవసరం అనే భావన కలుగుతుంది.

  She Was Shot In The Face And This Is How She Looks Now!

  నిజ జీవిత కధలు.

  ఇప్పుడు మేము మీకు స్పూర్తిదాయకమైన ఒక మహిళ యొక్క నిజజీవిత కధను అందించబోతున్నాం. ఒక ప్రమాదంలో ఆమె తన ముఖాన్ని కోల్పోయినప్పటికి పదకొండు సంవత్సరాలు అలానే బతికింది.

  పూర్తీ వివరాలను తెలుసుకోవాలంటే క్రిస్సీ స్టెల్జ్ జీవితాన్ని తరచి చూడాల్సిందే!

  అది ఒక ఘోర ప్రమాదం.

  క్రిస్సీ స్టెల్జ్ తన తల్లిదండ్రులను, ఇంటిని వదిలి ప్రియునితో కలసి జీవితం మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆమెకు కేవలం పదహారేళ్ళ వయస్సు మాత్రమే! ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆమె తన స్నేహితుల ఇంట్లో జరిగిన ఒక పార్టీలో పాల్గొనడానికి వెళ్ళింది. ఆ పార్టీకి విచ్చేసిన అతిధులలో ఒకరు, తను కాజేసిన షాట్ గన్ తో ఆడుతుండగా, ఈ ప్రమాదం సంభవించింది.

  ఆమె అతన్ని హెచ్చరించింది....

  ముక్కుసూటిగా మాట్లాడే క్రిస్సీ ఆ అతిధిని అటువంటి ప్రమాదకరమైన చేష్టలు చేయవద్దని, తుపాకీతో ఆటలు ఆడటం శ్రేయస్కరం వారించింది. కానీ ఆ అతిధి ఆమె హెచ్చరికను లెక్క చేయలేదు, పైగా అంత భయపడనవసరం లేదని, ఆ తుపాకీలో గుళ్ళు లేవని చెప్పాడు. కాని ఇంతలోనే ఒక గుండు ఆమె ముఖాన్ని తాకింది.

  ఆమె పరిస్థితి చాలా ఘోరంగా మారింది.

  ఆమె ముఖం తునాతునకలైనప్పటికీ కూడా ఆమె స్పృహలోనే ఉంది. ఆ ప్రమదం జరిగిన తీరు, దానిని ఆమె ఎదుర్కున్న విధానం గురించి ఆమె మాజీ ప్రియుని మాటల్లోనే తెలుసుకుందాం. " మీరెప్పుడైనా గాయపడిన జంతువు లేచి నిలబడటానికి చేసే ప్రయత్నాన్ని చూసారో లేదో నాకు తెలియదు కానీ, నేను ప్రత్యక్షంగా చూసాను. కొల్కోవడానికి సాధ్యం కాని గాయాన్ని ఆమె చవిచూసింది. అటువంటి సమయంలో ఆమె చూపిన మానసిక స్థైర్యం అసమానమైనది. ఆమె దానిని ఎదుర్కుని లేచి నిలబడటానికి తీవ్రంగా ప్రయత్నించింది ".

  ఈ సంఘటనతో ఆమె పరిస్థితి...

  ఈ ప్రమాదంలో క్రిస్సీ తన కళ్ళను, ముక్కును కోల్పోయింది. తను గ్రుడ్డిదానిగా మారింది పైగా వాసన కూడా చూడలేదు. క్రిస్సీని అసలు పోలిక పట్టలేము. ఆమె ముఖంపై పెద్ద గుంత ఏర్పడింది.

  అయినప్పటికీ ఆమె..

  ఇంతటి ఘోరమైన దెబ్బ తాకినప్పటికి, క్రిస్సీ తన జీవితాన్ని తానూ జీవించగలనని ప్రపంచానికి రుజువు చేసింది. ఆమె ఒక యోధురాలిగా పరిణామం చెందింది. ఆమె తన హై స్కూల్ చదువు పూర్తీ చేసి తదుపరి విద్యలలో చేరింది. పదకొండు సంవత్సరాల పాటు ఆమె ఒక ఐ మాస్కుతో తన ముఖానికి ముసుగు వేసుకుంది.

  ఆమెకు ప్రోస్థేటిక్స్ లభించడంలో ఆలస్యం జరిగింది.

  క్రిస్సీ ఇదేవిధంగా పదకొండు సంవత్సరాల పాటు నరకమనుభావించింది. ఆమెకు ఎటువంటి వైద్య భీమా సదుపాయం దక్కలేదు. ఎందుకంటే , ఫేషియల్ ప్రోస్థేటిక్ ద్వారా ఆమెకు కృత్రిమ కళ్ళు, ముక్కు అమరిస్తే, అది "సౌందర్య శస్త్ర చికిత్స" క్రింద వస్తుందని, దానికి ఎటువంటి భీమా సదుపాయం ఉండదని అధికారులు వాదించారు.

  ఆమెకు ప్రోస్థేటిక్స్ ను ఉచితంగా అందించారు.

  అటువంటి సమయంలో ఆమెకు వైద్యులు మరియు శస్త్రచికిత్సా నిపుణులు ఆమెకు అండగా నిలిచారు. ఆమెకు పూర్తిగా ఉచితంగా వారు కొత్త ముఖాన్ని అమర్చారు. ఆమె తన కొత్త రూపాన్ని తానూ చూసుకోలేనప్పటికి తన చిన్నారి తన కొత్త ప్రోస్థేటిక్ ముఖాన్ని చూడవచ్చు.

  బాసటనిచ్చిన భాగస్వామి

  ఇటువంటి సంఘర్షణతో ఆమె సతమతమవుతున్న సమయంలో, ఆమె తన జీవిత భాగస్వామి అయిన జెఫ్రీ డిల్జర్ ను కలుసుకుంది. ఆటను కూడా తన పదహారు సంవత్సరాల వయస్సులో చూపును కోల్పోయాడు. ఆ జంటకు ఇప్పుడు ఒక ముద్దులొలికే బాబు ఉన్నాడు. అతనే జెఫ్రీ జూనియార్.

  ఆమె తన కొడుకు కోసం కళ్ళకు ఉన్న మాస్కును తొలగించాలనుకుంది.

  ఆమె తన కుమారుడు మొదటిసారి తనను చూసేటప్పటికి మాస్కును తొలగించుకోవాలనే సంకల్పంతో ఉంది. ఇప్పుడ తన కుమారుడు మాస్కులేని తన మొహాన్ని చూస్తున్నాడు. ఇప్పుడున్న తన కొత్త రూపం తన జీవితాన్ని సంపూర్ణంగా, ఉత్తమంగా మార్చేసింది.

  ఈ విపత్తు జరిగి పదకొండు సంవత్సరాలవుతుంది.

  ఈ హృదయవిదారక సంఘటన ఆమె జీవితంపై కొన్ని గాయాలను వదిలి వెళ్ళింది. ఈ ఘటన క్రిస్సీ జీవితాన్ని పూర్తిగా మార్చేసినప్పటికి, ఆమె ఒక యోధురాలి వలె పోరాడిండి, కాని తన స్పూర్తిని ఎప్పుడూ కోల్పోలేదు. కొత్త రూపుతో మునుపటికన్నా శక్తివంతంగా తన బిడ్డను ఆనందంగా తీర్చిదిద్దుతుంది.

  ఇలాంటి మరెన్నో స్పూర్తిని నింపే ఆసక్తికరమైన నిజజీవిత కధలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా ఐతే మీ జీవితాన్ని ప్రభావితం చేసే మరెన్నో కధలని ఈ సెక్షన్ ద్వారా మీకందించడానికి మేమెప్పుడూ సిద్ధమే!

  Image Courtesy: Video

  English summary

  She Was Shot In The Face And This Is How She Looks Now!

  Crissy Steltz was shot in the face by a party goer. The accident with a shotgun destroyed her face and left her completely blind. She made an incredible stride toward living a normal life for 11 long years, as she lived a life without a face! Her journey and struggle of living a life without a face is an inspiration in itself.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more