For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్ర నీతి: పురుషుడు, స్త్రీ ఎవరైనా సరే ఈ రహస్యాలను బయటపెట్టరాదు

శుక్ర నీతి: పురుషుడు, స్త్రీ ఎవరైనా సరే ఈ రహస్యాలను బయటపెట్టరాదు

|

శుక్ర నీతి యొక్క విధానాలు:
పురాణాలు, వేద గ్రంథాలలో ప్రస్తావించిన ప్రకారం, శుక్రాచార్యుడు అసురుల ముఖ్య గురువు. అతను రాక్షసుల వైపు చేరి, దుష్టత్వంతో ప్రవర్తించినప్పటికీ, అతను బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల పవిత్ర త్రయం మీద తన భక్తిని నిలుపుకున్నాడు.

never reveal these things to anyone

శుక్ర నీతి అంటే ఏమిటి?

అతని గురించి ప్రస్తావించిన పలు పవిత్ర గ్రంథాలలో కొన్ని అతని జ్ఞానం మరియు అతని జీవితంలో విజయం సాధించిన దశల గురించి ప్రస్తావించబడినది. ఇవి అనేక మందికి ప్రేరణ కలిగించి, జీవితంలో ఎన్నో రూపాలలో సహాయం చేస్తున్నాయి కూడా. కావున ఇప్పుడు ఈ వ్యాసంలో శుక్రాచార్యుల వారి ప్రకారం స్త్రీ, పురుషులు రహస్యంగా ఉంచవలసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

శుక్ర నీతి: పురుషుడు, స్త్రీ ఎవరైనా సరే ఈ రహస్యాలను బయటపెట్టరాదు:

 మీ సంపద:

మీ సంపద:

చెడు మార్గానికి గర్వం, అత్యాశ, అపరిపక్వత కలిగిన మాటలు అనేవి నిజమైన సంపద. కానీ అవి పెరిగే కొలదీ, మనిషి పతనానికి దారితీస్తుంది. దురాశ దురదృష్టకర జీవితానికి, దుఃఖానికి దారితీస్తుందని వివరిస్తుంది; కావున, ఏ సమయంలోనైనా ఎవరికి అయినా సంపద యొక్క నిజమైన లెక్కను బహిర్గతం చేయాలి, స్నేహితులు మరియు బంధువులకు కూడా. గొప్పలకు వెళ్తే తిప్పలు తప్పవు అన్న మాట కూడా ఈ నీతినుండే వచ్చింది. కొందరు తమ వద్దనున్న దానికన్నా అధికంగా గొప్పలకు పోతుంటారు, ఇటువంటివి చెడు వ్యక్తి లేదా దొంగల చెవిన పడితే తర్వాత జరిగే పరిణామాలకు జీవితాన్నే బదులివ్వాల్సి రావొచ్చు అని అర్ధం.

నీ భక్తి:

నీ భక్తి:

ఎవరితోనూ మీ భక్తిని ఎన్నటికీ పంచుకోవద్దని శుక్ర నీతి హెచ్చరిస్తుంది. మంత్రాలను మరియు మీ కోరికల ఉద్దేశ్యాన్ని ఇతరులకు ఎన్నడూ బహిర్గతం చేయవద్దు. ప్రత్యేకించి, మీ బలహీన గ్రహాలను పటిష్టపరచడానికి మీరు మంత్రోచ్చారణలు చేస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని బహిరంగ పరచకూడదు. ఇలాంటివి అప్రయోజనకరంగా మారడంతో పాటు, ఇతరులకు మీ ప్రతికూల లక్షణాల గురించిన అవగాహన తెస్తుంది.

మీ వ్యక్తిగత విషయాలు:

మీ వ్యక్తిగత విషయాలు:

ఒక పురుషుడు లేదా స్త్రీ వారి వ్యక్తిగత క్షణాలను, లేదా విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. అనేకమంది వ్యక్తులు తమ స్నేహితులతో కలిసి కూర్చుని, అసంబద్దమైన విషయాలను సైతం పంచుకుంటారు. కానీ అలా చేయడం వల్ల, మీరు మీ యథార్థత యొక్క సరిహద్దులను మరియు మీ సంబంధం యొక్క గౌరవాన్ని, విలువలను కోల్పోతారు.

మీ ఉదారత :

మీ ఉదారత :

సహాయం చేయాలి అని మనసుకు తోస్తే, ఇతరుల చర్చలతో సంబంధం లేకుండా చేయగలగాలి. ఈరోజుల్లో అటువంటి దాతలు ఉన్నారు. కానీ కొందరు ప్రచారాల కోసం సేవ అన్న మార్గంలోనే పయనిస్తున్నారు. నిజానికి ఈ కాలంలో కనీసం ఒక్క ఫోటో లేకుండా, అన్నం పెట్టడానికి కూడా చేయి రావడం లేదు అనేకులకు. పేదవారికి విరాళం ఇచ్చిన తర్వాత, వారి చర్యల గురించి చెప్పుకోవడం అనేది తప్పు శుక్ర నీతి ప్రకారం. విరాళములు ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలి. ఎవరైనా ఆ విరాళం గురించి చెప్పినట్లయితే, వారికి లభించిన ధర్మం నాశనమవుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, తదితర సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి

English summary

never reveal these things to anyone

Sukra Charya was not just a great scholar but an intelligent man his well. His teachings, popularly known as Sukra Niti are relevant even today --- here are a few things he had said one should never reveal about himself.
Desktop Bottom Promotion