For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేప ప్రసాదం ఆస్తమాకు ఎంత మేరకు మేలు చేస్తుంది? చేప ప్రసాదం పంపిణీ చరిత్ర

|

ఎండలతో హడలెత్తించిన రోహిణి కారై ముగిసి మృగశిర కారై వస్తోంది. ఈ కారైలో వర్షాలు కురిస్తేనే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం అందుకే అ న్నదాతలు తొలకరి కోసం ఎదురు చూస్తుంటారు. మృగశిర కార్తె వస్తే రైతులంతా విత్తనాలు చల్లేందుకు సిద్ధమవుతారు. కాని, లక్షలాది ఆస్తమా రోగులు హైదరాబాద్ వైపు చూస్తారు. బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదం కోసం నిరీక్షిస్తారు. ఇంతకీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేప ప్రసాదం గతం, ఘనత ఏంటి?

చేప ప్రసాదం గురించి తెలియని వారు ఉండరు

చేప ప్రసాదం గురించి తెలియని వారు ఉండరు

హైదరాబాద్‌ చార్మినార్, ఘుమఘుమలాడే బిర్యానీ లాంటివి గుర్తుకొస్తాయి. అదే నగరంలో... మృగశిర కార్తె అనగానే.. బత్తిని బ్రదర్స్‌ చేప ప్రసాదం గుర్తొస్తుంది. ఆస్తమా రోగులకు చేరువైన బత్తిని ఫ్యామిలి చేప మందు.. చేప ప్రసాదం గురించి తెలియని వారూ ఉండరు. అంతగా ఫేమస్‌ అయిన ఈ చేప ప్రసాదాన్ని బత్తిని ఫ్యామిలీ ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున అందిస్తోంది. ఈఏడాది కూడా జూన్‌ 8న.. చేప ప్రసాద పంపిణీ జరుగుతోంది.

పంపిణీకి అన్ని ఏర్పాట్లు

పంపిణీకి అన్ని ఏర్పాట్లు

చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు బత్తిని హరినాథ్‌ కుటుంబసభ్యులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.

ఆ ప్రసాదాన్ని స్వీకరించేందుకు దేశ నలుమూలల నుంచే గాక విదేశాల నుంచీ ఆస్తమా రోగులు హైదరాబాద్‌కు పెద్దయెత్తున తరలిరానున్నారు. వాస్తవానికి మృగశిర కార్తెకు రెండు రోజుల ముందు నుంచే వారు నగరానికి చేరుకుంటారు. చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతి వయసు వారూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు.

లక్షల సంఖ్యలో

లక్షల సంఖ్యలో

ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైదరాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.

చేప పిల్లను మింగిస్తారు

చేప పిల్లను మింగిస్తారు

అపట్లో ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలిలో కొద్దిమంది ఆస్తమా రోగులకు ఈ ప్రసాదాన్ని అందించడం ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కొరమీను చేపపిల్ల నోటిలో ఆ ప్రసాదాన్ని ఉంచి రోగి చేత ఆ చేప పిల్లను మింగిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో ప్రసాదాన్ని అందిస్తారు.

వీటితో పాటు ఇంటి వద్దకు తీసుకెళ్లి స్వీకరించేందుకు కార్తి ప్రసాదం అందిస్తారు. ఇక ప్రసాదం స్వీకరించే వారు గంట ముందు నుంచి ఏమీ తినకూడదు. అలాగే ప్రసాదం స్వీకరించాక గంట సమయం పాటు ఏదీ తినకూడదు. మూడు సంవత్సరాల పాటు ప్రతి ఏటా ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆస్తమా తగ్గుతుందనే నమ్మకం ప్రబలంగా ఉంది.

ఆసక్తికరమైన కథనం

ఆసక్తికరమైన కథనం

చేప ప్రాసదం పంపిణీ వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి వుంది. 1847 ప్రాంతంలో ఒక సాధువు బత్తిన వంశానికి చెందిన వీరన్న గౌడ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జోరు వానలో తడిసిపోయిన వచ్చిన ఆ సాధువుకి వీరన్న గౌడ్ భక్తిగా సేవలు చేశారు. అందుకు మెచ్చి ఆయన ఆస్తమా మందు ఎలా తయారు చేయాలో చెప్పి దాన్ని ఏటా మృగశిర కార్తె రోజున ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి వెళ్లాడు. అప్పట్నుంచీ బత్తిని వంశజులు శతాబ్దమున్నరకు పైగా విజయవంతంగా చేప ప్రసాదం రోగులకు అందిస్తూ వస్తున్నారు.

బెల్లంతో కలిపి

బెల్లంతో కలిపి

చేప ముందు మూడు రకాలుగా ఇస్తారు రోగులకి. పూర్తి శాఖాహారులైతే బెల్లంతో కలిపి ప్రసాదాన్ని అందిస్తారు. మాంసాహారులైతే కొర్రమీను చేప నోట్లో ప్రసాదాన్ని వుంచి... ఆ చేపని రోగి చేత మింగిస్తారు. ఇక మూడో రకం ప్రసాదం.. ప్రత్యేకంగా పత్యం చేసే వారికి వేస్తారు.

వాతావరణంలో మార్పు రావటమే

వాతావరణంలో మార్పు రావటమే

ఈ చేప ప్రసాదం ప్రత్యేకంగా మృగశిర కార్తె రోజునే ఇవ్వటానికి కారణం... మృగశిర కార్తె నుంచీ వాతావరణంలో మార్పు రావటమే. ఎండ తగ్గి తేమ క్రమంగా పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆస్తమా రోగులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే, వర్షాలు మొదలయ్యే మృగశిర కార్తె రోజు ఆస్తమాను అరికట్టే చేప ప్రసాదం ఇవ్వటం ఆనవాయితి.

 చేప ప్రసాదం అని వ్యవహారించాలి

చేప ప్రసాదం అని వ్యవహారించాలి

కొన్నాళ్లుగా ఎంతో చరిత్ర కలిగిన ఈ చేప ప్రసాదంపై హేతువాదులు, శాస్త్రీయవాదుల దృష్టి పడింది. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మీడియా సాయంతో ఏటేటా పెద్ద వివాదమే రాజేశాయి. చివరకు వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది.

కోర్టులో చేప మందు అని కాకుండా చేప ప్రసాదం అని వ్యవహారించాలని జడ్జ్ తీర్పునిచ్చారు. అలాగే అనేక సూచనలు కూడా న్యాయస్థానం చేసింది. కాని, ఉద్యమకారులు కోరినట్టు చేప ప్రసాదం పంపిణీ మాత్రం నిషేధించలేదు.

హానికరమని ఎక్కడా నిరూపించబడలేదు

హానికరమని ఎక్కడా నిరూపించబడలేదు

శతాబ్దమున్నర కాలంగా రోగులు అంతకంతకూ పెరుగుతూనే వున్న చేప ప్రసాదం హానికరమని ఎక్కడా నిరూపించబడలేదు. అలాగే శాస్త్రీయత కూడా ఋజువు కాలేదు. కాని, చేప ప్రసాదం హైద్రాబాద్ కి ఒక ప్రత్యేకత అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోంచి జనం ఈ ప్రసాదం కోసం ఏటా వస్తుంటారు!

గవర్నమెంటే అన్ని ఏర్పాట్లూ

గవర్నమెంటే అన్ని ఏర్పాట్లూ

వివాదాల కారణంగా మధ్యలో ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అండగా వుంటం మానేసినా... ఇప్పుడు గవర్నమెంటే అన్ని ఏర్పాట్లూ చూసుకుంటోంది. వచ్చే రోగులకి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడుతోంది.

కాల పరీక్షకి నిలబడి, ఎన్ని విమర్శలు, వివాదాలు వచ్చినా తట్టుకున్న బత్తిని సోదరుల చేప ప్రసాదం ఒక విధంగా సాంస్కృతిక అద్బుతమే. ఇక దాని వైద్యపరమైన లాభాలు ఔషధం స్వీకరిస్తున్న ఆస్తమా రోగులకే తెలియాలి. అందులో ఎలాంటి ఉపయోగం లేకుంటే లక్షలాది మంది ఎంతో శ్రమకోర్చి తీసుకోరు కదా?

పంపిణీ జరుగుతూ ఉంది

పంపిణీ జరుగుతూ ఉంది

ఇక బత్తిన సోదరులు ఏటా ఉబ్బస రోగుల కోసం పంచే చేప మందు కాల క్రమంలో చేప ప్రసాదం గా పేరు మార్చుకున్న విషయం విదితమే. రాజకీయ కుట్రకు చేప మందు కాస్తా చేప ప్రసాదంగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. పరిస్థితులు చక్కబడి మళ్ళీ చేప ప్రసాదం కాస్తా చేప మందుగా ప్రాచుర్యం పొందే రోజు దగ్గర్లోనే వుందని బత్తిన వంశీయులూ ఆశాభావంతో వున్నారు. ఇక హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నే చేప మందు / ప్రసాదం పంపిణీ జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మంది తరలి వచ్చారు.

English summary

soul story of a fishy cure

soul story of a fishy cure
Story first published: Friday, June 8, 2018, 9:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more