దేవేంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు, వాయుదేవుడు కన్నేసిన మనోహరమైన దమయంతి నలుడికే ఎందుకు దక్కింది?

Posted By:
Subscribe to Boldsky

విదర్భగా పిలవబడే కుండిన దేశపురాజు భీమరాజు. ఆయన కూతురే దమయంతి. నిషిధ రాజాధిపతి వీరసేనుని కుమారుడు నలుడు. ఒకరి గుణగుణాలను గురించి ఒకరు తెలుసుకుని నలదమయంతులు ప్రేమలో పడతారు. నలుని ఊహాచిత్రాన్ని మదిలో ప్రతిష్ఠించుకుంటుంది దమయంతి.

ఆమె అందం గురించి స్వర్గలోకం

ఆమె అందం గురించి స్వర్గలోకం

రూపలావణ్యాలకే కాదు, గుణసౌశీల్యాలకు దమయంతి తిరుగు ఉండేది కాదు. ఆమె అందం గురించి స్వర్గలోకం వరకూ తెలిసింది. అందుకని ఆమెను పెళ్ళాడడం కోసం దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు ఉవ్విళ్ళూరారు.

సుచిముఖి

సుచిముఖి

అప్పటికే నలుని దగ్గర నుంచి వచ్చిన సుచిముఖి అనే హంస ద్వారా దమయంతి అన్నీవిని మనసు పెంచుకుంది. నలునికీ దమయంతి అంటే ఇష్టమే. ఇంతలో దమయంతి స్వయవరం ప్రకటించాడు తండ్రి భీమరాజు. నల చక్రవర్తిని స్వయంవరానికి రమ్మని కోరి హంసతో రాయభారం పంపింది దమయంతి.

నలుని కోసమే..

నలుని కోసమే..

దమయంతి స్వయవరం రోజును ఆమె కళ్లు మొత్తం కూడా నలుని కోసమే వెతికాయి. నలుని చూడగానే ఆమె మనసు ఉప్పొంగింది. అయితే ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు.

మొత్తం ఐదుగురు నలుడులు

మొత్తం ఐదుగురు నలుడులు

ఒక నలుడు కాదు, పక్కన మరో నలుగురు నలులున్నారు. అప్పడు దమయంతికి అంతకు ముందు జరిగింది గుర్తుకు వచ్చింది. తన అంతఃపుర మందిరంలోకి అదృశ్యుడై వచ్చిన నలుడు దేవేంద్ర అగ్ని వాయువరుణ దేవుళ్ళు నిన్ను కోరుకుంటున్నారని చెప్పాడు.

ప్రేమించిన నలుడినే పెళ్లాడింది

ప్రేమించిన నలుడినే పెళ్లాడింది

అప్పుడు ఆమె తను కోరుకున్న వాణ్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరిప్పుడు తన ముందున్న అయిదుగురు నలుని రూపధారుల్లో తన నలుడెవరో? సాయం కోరుతూ సరస్వతీ దేవిని ప్రార్థించింది. ఆ తర్వాత తను ప్రేమించిన నలున్నే మాలవేసి పెళ్ళాడింది దమయంతి.

అంగరంగవైభవంగా వివాహం

అంగరంగవైభవంగా వివాహం

ఇరురాజ్యాల ప్రజల ఆనందోత్సాహాల నడుమ నలదమయంతుల వివాహం అంగరంగవైభోగంగా జరుగుతుంది. శనిప్రభావం ఎంతటి వారినైనా అధోగతి పాల్జేస్తుంది. ఇందుకు నలుడు మినహాయింపు కాదు.

ఆ సుఖం ఎక్కువ రోజులు లేదు

ఆ సుఖం ఎక్కువ రోజులు లేదు

నిషధ దేశాన్ని ఏలుతున్న నలుడు దమయంతి కొన్నిరోజులు సంతోషంగా ఉంటాడు. దమయంతి కూతురు, కొడుకులకు జన్మనిచ్చింది. ఆ సుఖం సౌఖ్యం ఎన్నాళ్ళో నిలవలేదు. నలుడు దుర్వ్యసనాలలో పడిపోతాడు.

కట్టుబట్టలతో అడవి పాలు

కట్టుబట్టలతో అడవి పాలు

శనిప్రభావంతో, సోదరుడైన పుష్కరుని చేతిలో జూదంలో ఒడిపోతాడు. నలుడు రాజ్యభ్రష్టుడువతాడు.జూదంలో రాజ్యాన్ని కోల్పోవడం చివరకు కట్టుబట్టలతో అడవులపాలు కావడంతో దమయంతి భర్తతో వెంట వెళ్లింది.

Image Source

కష్టాలు చూడలేక

కష్టాలు చూడలేక

పిల్లల్ని తన తండ్రి దగ్గరకు పంపింది. ఎన్నో కష్టాలుపడింది. కష్టాలు చూడలేక నలుడు దమయంతిని అడవిలోనే వదిలి వెళ్ళిపోతాడు నలుడు. నిద్రలేచి నలుడు కనబడక ఆందోళన పడుతుంది. ఏడుస్తుంది.

Image Source

బలాత్కారం

బలాత్కారం

ఎరుకలవాడు బలాత్కారము చెయ్యబోయి భస్మీపటలం అవుతాడు.భర్తను వెతుకుతూ అడవిని దాటి నగరం చేరుకుంది. సైరంధ్రి కంట పడుతుంది. పినతల్లి పద్మావతి ఇంటికి వెళ్తుంది. భీమరాజు కూతురూ అల్లుడూ ఎక్కడ ఉన్నారోనని వెతికించడంతో ఈ వార్త తెలుస్తుంది. మొత్తానికి తిరిగి తండ్రి దగ్గరకు చేరుతుంది దమయంతి.

Image Source

సర్పం కాటేస్తుంది

సర్పం కాటేస్తుంది

నలుని జాడ తెలుసుకొనుట కొరకు భీమరాజు దమయంతికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఇదిలా ఉండగా దమయంతిని వీడిన నలుడు అడవులలో తిరుగుతుండగా కర్కోటకమనే సర్పం నలుని కాటేస్తుంది.

Image Source

నలుడుని ఎవ్వరూ గుర్తించలేరు

నలుడుని ఎవ్వరూ గుర్తించలేరు

దీంతో నలుని దేహఛాయ నలుపురంగులోకి మారిపోతుంది. నలుడు కురిపి అవుతాడు. నలుని ఎవ్వరూ గుర్తించలేని పరిస్థితి తలెత్తుంది. బాహుకుని పేరుతో రధసారధిగా మారి విదర్భ రాజ్యానికి చేరుకుంటాడు నలుడు. పవిత్ర ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే దమయంతి వికృతరూపంలోని నలుని ఇట్టే గుర్తించింది.

Image Source

మళ్లీ రాజ్యం గెలుచుకుంటాడు

మళ్లీ రాజ్యం గెలుచుకుంటాడు

అప్పుడు కలసిన ఆ జంట ఆనందానికి అంతేలేదు. శనిప్రభావం తొలగింది. నలుని వికృతరూపం మాయమై నిజరూపం కలిగింది. పుష్కరునితో మరోసారి జూదమాడిన నలుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటాడు.

Image Source

నిజమైన ప్రేమకు నిదర్శనం

నిజమైన ప్రేమకు నిదర్శనం

దమయంతి కేవలం రూపవతియే కాదు నలుని ప్రేమ పట్ల అచంచలమైన అనురాగాన్ని ప్రదర్శించి నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. స్వయంవరంలో దేవతల సౌందర్యానికి లోనుకాక నలుని వరించింది దమయంతి.

Image Source

చాలా స్వచ్ఛమైన ప్రేమ

చాలా స్వచ్ఛమైన ప్రేమ

అంతేకాక వికృతరూపంలోని నలుని బాహ్యరూపాన్ని కాక అంతఃసౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చిన దమయంతి ప్రేమ నిజంగా చాలా స్వచ్ఛమైనది. అందుకే నల దమయంతి జంట చిరకాలం అందరికీ గుర్తుంటుంది.

Image Source

English summary

the story of nala and damayanti

the story of nala and damayanti
Story first published: Wednesday, February 28, 2018, 11:30 [IST]