మహిళను చిత్రహింసలు పెట్టే వీళ్ళు నైతిక విలువలు కాపాడేవారా ...

Posted By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ప్రతి నిమిషం ఏదో ఒక మూల కొన్ని వికారమైన హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటనలలో ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా ఒకటి. ఇది మీకు చాలా అన్యాయంగా అనిపిస్తుంది కూడా.

అప్పుడప్పుడు మన దేశంలో వింటూనే ఉంటాం, నైతిక విలువలను కాపాడుతామని కొందరు పనిగట్టుకుని ప్రేమికులను కాపు కాచి చిత్రహింసలకు గురిచేసి వీడియోలు అంతర్జాలంలో పెడుతూ ఉంటారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని నైతిక విలువలు కాపాడుతాం అని ఇలాంటి హింసాత్మక ధోరణిని ఎన్నుకోవడం అత్యంత భాధాకరమైన విషయం. ఇలాంటివి కొన్ని కోర్టు దాకా కూడా వెళ్ళడం లేదు. అలాంటి ఒక ఘటనే ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా. ఒక మహిళ తన సహచరునితో వెళ్తుండగా అనుమానించి, అపార్ధం చేసుకుని కాపు కాచిన ఒక గాంగ్, నైతిక విలువలు కాపాడుతామనే పేరుతో వారిని చిత్రహింసలకు గురిచేసి వీడియోను ఇంటర్నెట్ లో పెట్టడం సంచలనం అయింది.

viral video

ఇది జరిగింది ఎక్కడో కాదు మన దేశంలోనే:

ఇలాంటి ఘటనలు మన ఇండియాలో సర్వసాధారణం అయిపోయాయి. తద్వారా కొందరు ఈ విషయాన్ని తేలికగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతటి భాధాకరమైన పరిస్థితుల్లో ఉంది మన సమాజం. కానీ ఆ పరిస్తితి అనుభవించిన వారికే ఆ భాధ తెలుస్తుంది. అస్సాo లోని గోల్పారా జిల్లాలో ఒక 22 యేళ్ళ యువతి తన సహచరునితో ఒక మెడికల్ సెంటర్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

వీడియో వివరాలు:

ఈ వీడియో పరంగా ఆ మహిళను ఈ గాంగ్ సభ్యులు తీవ్రంగా జుట్టు పట్టుకుని కొట్టడం, కాలితో తన్నడం వంటి హీనమైన చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు దీనిని " మోరల్ పోలీసింగ్" చర్యగా భావించి కేసు నమోదు చేశారు. ఒక అమ్మాయి అబ్బాయితో కలిసి వెళ్తే సహించలేని వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు అని తెలిపారు.

దోషుల ఆలోచనా విధానం.. !

ఈ గాంగ్, వీరిరువురిని ప్రేమికులుగా, సంబంధంలో ఉన్నట్లుగా భావించారు. ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైనా, వేరే వ్యక్తితో కలిసి వెళ్లడాన్ని సహించలేకే ఈ చర్యకు పూనుకున్నామని తెలిపారు. తద్వారా ఆ అబ్బాయి కన్నా అమ్మాయినే బలమైన దెబ్బలతో చిత్రహింసలకు గురిచేశారు.

వీరిని అరెస్ట్ చేశారు ..

ఈ ఘటనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకపక్క ఆ అమ్మాయి భాధతో అరుస్తున్నా, వదలకుండా జుట్టు పట్టుకుని కొట్టడం , పైశాచికంగా ప్రవర్తించడం వలన అనతి కాలంలోనే ఈ వీడియో వైరల్ అయింది.

ఇలాంటి ఘటనలు చూస్తుంటే మహిళలమీద అరాచకాలు మాదేశం లో జరగవు అనే రోజు కలలో కూడా కనపడదేమో అనిపిస్తుంది.

English summary

Video Of A Woman Who Was Moral Policed And Slapped

A video of a woman and her male companion being brutally hit is going viral. The woman was hit by the moral policing gang when they targeted her and attacked. It is reported that the woman is about to get married in the next few weeks, but was found to be travelling with another male friend.Video Of Woman Being Slapped!